വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

പേജ് നമ്പർ:close

external-link copy
48 : 39

وَبَدَا لَهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟

మరియు వారు చేసుకున్న షిర్కు,పాపకార్యముల దుష్ఫలితాలు వారి ముందు బహిర్గతమవుతాయి. మరియు వారికి ఆ శిక్ష దేని గురించైతే వారు ఇహలోకములో భయపెట్టబడినప్పుడు పరిహాసమాడేవారో అది వారిని చుట్టుముట్టుతుంది. info
التفاسير:

external-link copy
49 : 39

فَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَانَا ؗ— ثُمَّ اِذَا خَوَّلْنٰهُ نِعْمَةً مِّنَّا ۙ— قَالَ اِنَّمَاۤ اُوْتِیْتُهٗ عَلٰی عِلْمٍ ؕ— بَلْ هِیَ فِتْنَةٌ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟

అవిశ్వాస మానవునికి రోగము గాని పేదరికం గాని వేరే ఏమైనా కలిగినప్పుడు అతనికి కలిగిన వాటిని అతని నుండి మేము తొలగించటానికి మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము అతనికి ఆరోగ్యము లేదా సంపద అనుగ్రహమును ప్రసాదించినప్పుడు అవిశ్వాసపరుడు ఇలా పలుకుతాడు : అల్లాహ్ తన జ్ఞానం వలన నేను దానికి యోగ్యుడినని గుర్తించి నాకు ప్రసాదించాడు. వాస్తవమేమిటంటే అది ఒక పరీక్ష మరియు మోసము. కాని చాలా మంది అవిశ్వాసపరులకు అది తెలియదు. అందుకనే వారు అల్లాహ్ వారికి అనుగ్రహించిన వాటితో మోసపోతున్నారు. info
التفاسير:

external-link copy
50 : 39

قَدْ قَالَهَا الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟

వాస్తవానికి ఇలాంటి మాటనే వారికన్న పూర్వం గతించిన అవిశ్వాసపరులూ పలికారు. అప్పుడు వారు సంపాదించుకున్న సంపదలు మరియు స్థానం వారికి ఏమీ పనికి రాలేదు. info
التفاسير:

external-link copy
51 : 39

فَاَصَابَهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا ؕ— وَالَّذِیْنَ ظَلَمُوْا مِنْ هٰۤؤُلَآءِ سَیُصِیْبُهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا ۙ— وَمَا هُمْ بِمُعْجِزِیْنَ ۟

అప్పుడు వారు పాల్పడిన షిర్కు,అవిధేయ కార్యాల యొక్క పాపముల ప్రతిఫలం వారిపై పడింది. మరియు హాజరై ఉన్న వీరందరిలోంచి షిర్కు,పాపకార్యములకు పాల్పడి తమపై హింసకు పాల్పడిన వారిపై వారు చేసుకున్న దుష్కర్మల ప్రతిఫలము గతించిన వారి మాదిరిగా వచ్చిపడుతుంది. మరియు వారు అల్లాహ్ నుండి తప్పించుకోలేరు మరియు ఆయనను ఓడించలేరు. info
التفاسير:

external-link copy
52 : 39

اَوَلَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟۠

ఏమి ఈ ముష్రికులందరు వారు పలికినదే పలికారా. మరియు వారికి తెలియదా అల్లాహ్ తాను తలచిన వారిపై ఆహారోపాధిని పుష్కలంగా ఇస్తాడు. అతడిని పరీక్షించటానికి అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృతఘ్నుడవుతాడా ?!. మరియు ఆయన దాన్ని తాను కోరిన వారిపై కుదించివేస్తాడు అతడిని పరీక్షించటానికి అతడు అల్లాహ్ యొక్క కుదించటంపై సహనం చూపుతాడా లేదా ఆగ్రహానికి లోనవుతాడా ?!. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడినటువంటి ఆహారోపాధిని పుష్కలంగా చేయటం మరియు దాన్ని కుదించటంలో విశ్వసించే జనుల కొరకు అల్లాహ్ పర్యాలోచనపై సూచనలు కలవు. ఎందుకంటే వారే ఆధారాల ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు అవిశ్వాసపరులు వాటిపై నుండి వాటి నుండి విముఖత చూపుతూ దాటిపోతారు. info
التفاسير:

external-link copy
53 : 39

قُلْ یٰعِبَادِیَ الَّذِیْنَ اَسْرَفُوْا عَلٰۤی اَنْفُسِهِمْ لَا تَقْنَطُوْا مِنْ رَّحْمَةِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ یَغْفِرُ الذُّنُوْبَ جَمِیْعًا ؕ— اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟

ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,పాపకార్యములకు పాల్పడి తమ స్వయంపై అతిక్రమించిన నా దాసులతో ఇలా పలకండి : మీరు అల్లాహ్ కారుణ్యము నుండి మరియు మీ పాపములకు ఆయన మన్నింపు నుండి నిరాశ చెందకండి. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలేవారి పాపములన్నింటిని మన్నించి వేస్తాడు. నిశ్ఛయంగా ఆయన పశ్ఛాత్తాప్పడే వారి పాపములను బాగా మన్నించేవాడును, వారిపై కరుణించేవాడును. info
التفاسير:

external-link copy
54 : 39

وَاَنِیْبُوْۤا اِلٰی رَبِّكُمْ وَاَسْلِمُوْا لَهٗ مِنْ قَبْلِ اَنْ یَّاْتِیَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُوْنَ ۟

మరియు మీరు ప్రళయదనమున శిక్ష మీ వద్దకు రాక మునుపు పశ్ఛాత్తాపముతో మరియు సత్కర్మలతో మీ ప్రభువు వైపునకు మరలండి. మరియు ఆయనకు విధేయులవ్వండి. ఆ తరువాత శిక్ష నుండి మిమ్మల్ని రక్షించటం ద్వారా మీకు సహాయపడే వాడిని మీ విగ్రహాల్లోంచి గాని మీ ఇంటి వారిలోంచి గాని మీరు పొందరు. info
التفاسير:

external-link copy
55 : 39

وَاتَّبِعُوْۤا اَحْسَنَ مَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَكُمُ الْعَذَابُ بَغْتَةً وَّاَنْتُمْ لَا تَشْعُرُوْنَ ۟ۙ

మరియు మీరు మీ ప్రభువు తన ప్రవక్తపై అవతరింపజేసిన శ్రేష్ఠమైన ఖుర్ఆన్ ను అనుసరించండి. అయితే మీరు దాని ఆదేశములను పాటించండి మరియు అది వారించిన వాటి నుండి దూరంగా ఉండండి. మీ వద్దకు శిక్ష అకస్మాత్తుగా రాక ముందే. మరియు మీరు దాని కొరకు పశ్చాత్తాపముతో సిద్ధం కావటానికి దాన్ని మీరు గ్రహించలేరు. info
التفاسير:

external-link copy
56 : 39

اَنْ تَقُوْلَ نَفْسٌ یّٰحَسْرَتٰی عَلٰی مَا فَرَّطْتُ فِیْ جَنْۢبِ اللّٰهِ وَاِنْ كُنْتُ لَمِنَ السّٰخِرِیْنَ ۟ۙ

ప్రళయదినమున అవమాన తీవ్రత వలన ఏ ప్రాణమయినా ఇలా పలకటం నుండి జాగ్రత్తగా ఉండటానికి మీరు దాన్ని చేయండి : అయ్యో అల్లాహ్ విషయంలో అది దేనిపైనైతే ఉన్నదో అవిశ్వాసము,పాపకార్యముల వలన అది చేసిన నిర్లక్ష్యం పై మరియు విశ్వాసపరులపై,విధేయులపై అది ఎగతాళి చేయటం పై దాని అవమానము. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• النعمة على الكافر استدراج.
అవిశ్వాసపరునిపై అనుగ్రహము నెమ్మది నెమ్మదిగా (శిక్షకు) దగ్గర చేయటమే. info

• سعة رحمة الله بخلقه.
అల్లాహ్ కారుణ్యము యొక్క విశాలత ఆయన సృష్టిపై. info

• الندم النافع هو ما كان في الدنيا، وتبعته توبة نصوح.
ప్రయోజనకరమైన పశ్చాత్తాపము ఏదైతే ఉన్నదో అది ఇహలోకములో కలదు. మరియు దాని తరువాత వచ్చేది నిష్కల్మషమైన పశ్చాత్తాపము. info