വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

പേജ് നമ്പർ:close

external-link copy
60 : 28

وَمَاۤ اُوْتِیْتُمْ مِّنْ شَیْءٍ فَمَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا وَزِیْنَتُهَا ۚ— وَمَا عِنْدَ اللّٰهِ خَیْرٌ وَّاَبْقٰی ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟۠

మరియు మీకు మీ ప్రభువు ప్రసాదించినది ఏదైన దాని ద్వారా మీరు ఇహలోక జీవితంలో ప్రయోజనం చెందుతారు,అలంకరించుకుంటారు. ఆ పిదప అది అంతమైపోతుంది. మరియు పరలోకంలో అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప ప్రతిఫలం ఇహలోకంలో ఉన్న సామగ్రి,అలంకరణ కన్న మేలైనది,శాస్వతంగా ఉండేది. ఏమీ మీరు దాన్ని అర్ధం చేసుకొని అంతమైపోయే దానిపై శాస్వతంగా ఉండే దాన్ని ప్రాధాన్యతనివ్వరా ?!. info
التفاسير:

external-link copy
61 : 28

اَفَمَنْ وَّعَدْنٰهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَاقِیْهِ كَمَنْ مَّتَّعْنٰهُ مَتَاعَ الْحَیٰوةِ الدُّنْیَا ثُمَّ هُوَ یَوْمَ الْقِیٰمَةِ مِنَ الْمُحْضَرِیْنَ ۟

ఏమీ పరలోకము,అందులో ఉన్న శాస్వత అనుగ్రహాల గురించి మేము వాగ్దానం చేసిన వాడు అతనితో సమానుడు కాగలడా ఎవడికైతే మేము ఇహలోకంలో అతను ప్రయోజనం చెందే సంపద,అలంకరణను ప్రసాదించామొ. ఆ తరువాత అతడు ప్రళయదినాన నరకాగ్ని వైపునకు హాజరు చేయబడే వారిలో నుండి అయిపోతాడు ?!. info
التفاسير:

external-link copy
62 : 28

وَیَوْمَ یُنَادِیْهِمْ فَیَقُوْلُ اَیْنَ شُرَكَآءِیَ الَّذِیْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ ۟

మరియు ఆరోజు వారిని పరిశుద్ధుడైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?. info
التفاسير:

external-link copy
63 : 28

قَالَ الَّذِیْنَ حَقَّ عَلَیْهِمُ الْقَوْلُ رَبَّنَا هٰۤؤُلَآءِ الَّذِیْنَ اَغْوَیْنَا ۚ— اَغْوَیْنٰهُمْ كَمَا غَوَیْنَا ۚ— تَبَرَّاْنَاۤ اِلَیْكَ ؗ— مَا كَانُوْۤا اِیَّانَا یَعْبُدُوْنَ ۟

అవిశ్వాసం వైపున పిలిచే వారిలో నుండి ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వారు ఇలా అంటారు : ఓ మా ప్రభువా వీరందరు మేము అపమార్గమును పొందిన విధంగా మేము అపమార్గమునకు లోను చేసిన వారు. మేము వారి నుండి నీ వద్ద నిర్దోషత్వమును కోరుతున్నాము. వారు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. వారు కేవలం షైతానులను ఆరాధించేవారు. info
التفاسير:

external-link copy
64 : 28

وَقِیْلَ ادْعُوْا شُرَكَآءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ یَسْتَجِیْبُوْا لَهُمْ وَرَاَوُا الْعَذَابَ ۚ— لَوْ اَنَّهُمْ كَانُوْا یَهْتَدُوْنَ ۟

మరియు వారితో ఇలా అనబడుతుంది : మీరు ఉన్న అవమానము నుండి మిమ్మల్ని రక్షించటానికి మీరు మీ భాగస్వాములను పిలవండి. అప్పుడు వారు తమ భాగస్వాములను పిలుస్తారు. కాని వారు వారి పిలుపునకు సమాధానమివ్వరు. మరియు వారు తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శిక్షను చూసి తాము ఇహలోకంలో సత్యమునకు దారి పొంది ఉండాల్సిందని కోరుకుంటారు. info
التفاسير:

external-link copy
65 : 28

وَیَوْمَ یُنَادِیْهِمْ فَیَقُوْلُ مَاذَاۤ اَجَبْتُمُ الْمُرْسَلِیْنَ ۟

మరియు ఆరోజు వారిని వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నేను మీ వద్దకు పంపించిన నా ప్రవక్తలకు మీరు ఏమి సమాధానమిచ్చారు ?. info
التفاسير:

external-link copy
66 : 28

فَعَمِیَتْ عَلَیْهِمُ الْاَنْۢبَآءُ یَوْمَىِٕذٍ فَهُمْ لَا یَتَسَآءَلُوْنَ ۟

అప్పుడు వారు వాదించినవి వారిపై గోప్యమైపోయాయి,వారు ఏమీ ప్రస్తావించలేదు. వారు శిక్షించబడుతారని వారు పూర్తి నమ్మకముతో ఉండటం వలన వారికి కలిగిన ఆపద భయానక పరిస్థితి వలన వారు ఒకరినొకరు ప్రశ్నించుకోరు. info
التفاسير:

external-link copy
67 : 28

فَاَمَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ صَالِحًا فَعَسٰۤی اَنْ یَّكُوْنَ مِنَ الْمُفْلِحِیْنَ ۟

కాని ఈ ముష్రికులందరిలో నుండి ఎవడైతే తన అవిశ్వాసము నుండి పశ్చాత్తాప్పడి,అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి,ఏదైన సత్కార్యమును చేస్తే బహుశా అతడు తాము ఆశించిన దాన్ని పొంది సాఫల్యము చెందే వారిలోంచి,తాము భయపడే వాటి నుండి ముక్తి పొందే వారిలో నుంచి అయిపోతాడు. info
التفاسير:

external-link copy
68 : 28

وَرَبُّكَ یَخْلُقُ مَا یَشَآءُ وَیَخْتَارُ ؕ— مَا كَانَ لَهُمُ الْخِیَرَةُ ؕ— سُبْحٰنَ اللّٰهِ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟

మరియు ఓ ప్రవక్తా నీ ప్రభువు తాను సృష్టించదలచిన దాన్ని సృష్టిస్తాడు. మరియు తన విధేయత కొరకు,తన దౌత్యము కొరకు తాను కోరుకున్న వారిని ఎన్నుకుంటాడు. ముష్రికులకు అల్లాహ్ పై అభ్యంతరం తెలిపే అనుమతి ఉండదు. పరిశుద్ధుడైన ఆయన అతీతుడు మరియు ఆయన వారు ఆయనతో పాటు సాటి కల్పించేవారి నుండి పరిశుద్ధుడు. info
التفاسير:

external-link copy
69 : 28

وَرَبُّكَ یَعْلَمُ مَا تُكِنُّ صُدُوْرُهُمْ وَمَا یُعْلِنُوْنَ ۟

మరియు నిశ్ఛయంగా నీ ప్రభువుకి తన దాసుల హృదయాలు ఏమి దాస్తున్నాయో,ఏమి బహిర్గతం చేస్తున్నాయో తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
70 : 28

وَهُوَ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَهُ الْحَمْدُ فِی الْاُوْلٰی وَالْاٰخِرَةِ ؗ— وَلَهُ الْحُكْمُ وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟

మరియు ఆయనే అల్లాహ్ పరిశుద్ధుడు ఆయన తప్ప సత్య ఆరాధ్య దైవం లేడు. ఇహలోకములో స్థుతులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి మరియు పరలోకంలో స్థుతులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి. మరియు ఆయనకు తిరుగులేని జారి అయ్యే న్యాయ వ్యవస్థ కలదు. ప్రళయదినాన మీరు లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు ఆయన ఒక్కడి వైపే మరలింపబడుతారు. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• العاقل من يؤثر الباقي على الفاني.
బుద్ధిమంతుడు అంతమైపోయే దానిపై శాస్వతంగా ఉండే దాన్ని ప్రాధాన్యతనిస్తాడు. info

• التوبة تَجُبُّ ما قبلها.
తౌబా దానికన్న పూర్వ వాటిని (పాపములను) తుడిచివేస్తుంది. info

• الاختيار لله لا لعباده، فليس لعباده أن يعترضوا عليه.
ఎంపిక అన్నది అల్లాహ్ కొరకు,ఆయన దాసుల కొరకు కాదు. కాబట్టి ఆయన దాసులకు ఆయన పై అభ్యంతరం తెలపటం సరికాదు. info

• إحاطة علم الله بما ظهر وما خفي من أعمال عباده.
అల్లాహ్ యొక్క జ్ఞానం తన దాసుల బహిర్గతమైన,దాగిన కర్మలకు చుట్టుముట్టి ఉండటం. info