വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ

പേജ് നമ്പർ:close

external-link copy
71 : 15

قَالَ هٰۤؤُلَآءِ بَنَاتِیْۤ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟ؕ

లూత్ అలైహిస్సలాం తన అతిధుల ముందు తన తరపు నుండి క్షమాపణ కోరుతూ వారితో ఇలా పలికారు : మీ మహిళలందరిలో నుంచి వీరు నా కుమార్తెలు. ఒక వేళ మీరు మీ కోరికలను తీర్చుకోవాలనుకుంటే వారిని వివాహం చేసుకోండి. info
التفاسير:

external-link copy
72 : 15

لَعَمْرُكَ اِنَّهُمْ لَفِیْ سَكْرَتِهِمْ یَعْمَهُوْنَ ۟

ఓ ప్రవక్తా నీ జీవితం సాక్షి నిశ్చయంగా లూత్ జాతి తమ కామ కోరికల్లో హద్దు మీరి త్రోవ తప్పి తిరుగుతున్నారు. info
التفاسير:

external-link copy
73 : 15

فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُشْرِقِیْنَ ۟ۙ

సూర్యోదయం అయ్యే సమయంలో వారు ప్రవేశించినప్పుడు ప్రాణాంతకమైన పెద్ద స్వరం వారిని పట్టుకున్నది. info
التفاسير:

external-link copy
74 : 15

فَجَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَیْهِمْ حِجَارَةً مِّنْ سِجِّیْلٍ ۟ؕ

అప్పుడు మేము వారి బస్తీలను తలక్రిందులగా త్రిప్పి వేశాము. మరియు మేము వారిపై బంక మట్టితో తయారు చేయబడిన కంకర రాళ్ళను కురిపించాము. info
التفاسير:

external-link copy
75 : 15

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّلْمُتَوَسِّمِیْنَ ۟

నిశ్చయంగా లూత్ జాతి వారిపై కురిసిన ఈ వినాశన ప్రస్తావనలో యోచన చేసే వారి కొరకు సూచనలు కలవు. info
التفاسير:

external-link copy
76 : 15

وَاِنَّهَا لَبِسَبِیْلٍ مُّقِیْمٍ ۟

నిశ్చయంగా లూత్ జాతి బస్తీలు రహదారి పైనే ఉన్నవి. వాటి వద్ద నుండి వెళ్ళే ప్రయాణికులు వాటిని చూస్తూ ఉంటారు. info
التفاسير:

external-link copy
77 : 15

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّلْمُؤْمِنِیْنَ ۟ؕ

నిశ్చయంగా ఈ సంభవించిన దానిలో దాని ద్వారా గుణపాఠం నేర్చుకునే విశ్వాసపరుల కొరకు సూచన ఉన్నది. info
التفاسير:

external-link copy
78 : 15

وَاِنْ كَانَ اَصْحٰبُ الْاَیْكَةِ لَظٰلِمِیْنَ ۟ۙ

దట్టమైన వనవాసులు కల షుఐబ్ జాతి వారు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన,తమ ప్రవక్త ను తిరస్కరించటం వలన దుర్మార్గులుగా ఉండేవారు. info
التفاسير:

external-link copy
79 : 15

فَانْتَقَمْنَا مِنْهُمْ ۘ— وَاِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِیْنٍ ۟ؕ۠

కావున వారికి శిక్ష పట్టుకున్నప్పుడు మేము వారి మీద ప్రతీకారం తీసుకున్నాము.నిశ్చయంగా లూత్ జాతి వారి బస్తీలు,షుఐబ్ జాతి వారి ప్రాంతములు ఒక ప్రధాన మార్గంలో ఉన్నవి దానిపై నడిచే వారి కొరకు. info
التفاسير:

external-link copy
80 : 15

وَلَقَدْ كَذَّبَ اَصْحٰبُ الْحِجْرِ الْمُرْسَلِیْنَ ۟ۙ

నిశ్చయంగా హిజాజ్ మరియు షామ్ (సిరియా) మధ్య కల ప్రాంతమైన హిజ్ర్ వాసులైన సమూద్ జాతివారు తమ ప్రవక్త అయిన సాలిహ్ అలైహిస్సలాంను ఎప్పుడైతే తిరస్కరించారో ప్రవక్తలందరిని తిరస్కరించారు. info
التفاسير:

external-link copy
81 : 15

وَاٰتَیْنٰهُمْ اٰیٰتِنَا فَكَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟ۙ

మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి ఏవైతే తీసుకుని వచ్చారో అందులో ఆయన నిజాయితీపై వాదనలను,ఆధారాలను మేము వారికి ప్రసాధించాము. ఒంటె వాటిలోంచిదే.కాని వారు ఆ ఆధారాలతో గుణపాఠం నేర్చుకోలేదు,వారు వాటి గురించి పట్టించుకోలేదు. info
التفاسير:

external-link copy
82 : 15

وَكَانُوْا یَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا اٰمِنِیْنَ ۟

మరియు వారు తమ కొరకు గృహాలను నిర్మించుకోవటానికి పర్వతాలను తొలిచేవారు. తాము భయపడే వాటి నుండి నిశ్చింతగా వాటిలో నివాసముండేవారు. info
التفاسير:

external-link copy
83 : 15

فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُصْبِحِیْنَ ۟ۙ

వారిపై తెల్లవారుతుండగా భయంకర గర్జన శిక్ష వారిని పట్టుకుంది. info
التفاسير:

external-link copy
84 : 15

فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟ؕ

అప్పుడు వారు సంపాదించుకున్న వారి సంపదలు,నివాసాలు అల్లాహ్ శిక్షను వారిపై నుండి తొలగించలేక పోయాయి. info
التفاسير:

external-link copy
85 : 15

وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ ؕ— وَاِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِیْلَ ۟

మరియు మేము భూమ్యాకాశములను,వాటిలో ఉన్న వాటన్నింటిని విజ్ఞత లేకుండా శూన్యంగా సృష్టించలేదు. మేము వాటన్నింటిని సత్యంతో మాత్రమే సృష్టించాము. మరియు నిశ్చయంగా ప్రళయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓ ప్రవక్తా మిమ్మల్ని తిరస్కరించిన వారి నుండి మీరు విముఖత చూపండి,వారిని ఉత్తమ రీతిలో మన్నించండి. info
التفاسير:

external-link copy
86 : 15

اِنَّ رَبَّكَ هُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ ۟

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువే సర్వాన్ని సృష్టించి వాటి గురించి జ్ఞానం కలవాడు. info
التفاسير:

external-link copy
87 : 15

وَلَقَدْ اٰتَیْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِیْ وَالْقُرْاٰنَ الْعَظِیْمَ ۟

నిశ్చయంగా మేము ఏడు ఆయతులు కల ఫాతిహాను మీకు అనుగ్రహించాము. మరియు అది మహోన్నతమైన ఖుర్ఆన్. info
التفاسير:

external-link copy
88 : 15

لَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰی مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَیْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِیْنَ ۟

అవిశ్వాసపరుల్లోంచి పలు వర్గాల వారికి మేము ఇచ్చిన అంతమైపోయే ప్రాపంచిక సంపద వైపునకు నీవు నీ దృష్టిని సారించకు.మరియు నీవు వారి తిరస్కారముపై బాధపడకు,విశ్వాసపరుల కొరకు అణకువను చూపించు. info
التفاسير:

external-link copy
89 : 15

وَقُلْ اِنِّیْۤ اَنَا النَّذِیْرُ الْمُبِیْنُ ۟ۚ

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా నేనే శిక్ష నుండి స్పష్టమైన హెచ్చరిక చేసే వాడిని. info
التفاسير:

external-link copy
90 : 15

كَمَاۤ اَنْزَلْنَا عَلَی الْمُقْتَسِمِیْنَ ۟ۙ

అల్లాహ్ గ్రంధాలను వేరు వేరు భాగములుగా చేసుకుని కొన్నింటిని విశ్వసించి కొన్నింటిని తిరస్కరించిన వారిపై అల్లాహ్ కురిపించినట్లు మీపై కూడా సంభవిస్తుందని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. info
التفاسير:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أن الله تعالى إذا أراد أن يهلك قرية ازداد شرهم وطغيانهم، فإذا انتهى أوقع بهم من العقوبات ما يستحقونه.
• నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ఏదైన బస్తీ వారిని తుదిముట్టించాలని నిర్ణయించుకుంటే వారి చెడును,వారి అతిక్రమించటమును అధికం చేస్తాడు.అది ముగిసినప్పుడు వారికి తగినటువంటి శిక్షలను వారిపై కలిగిస్తాడు. info

• كراهة دخول مواطن العذاب، ومثلها دخول مقابر الكفار، فإن دخل الإنسان إلى تلك المواضع والمقابر فعليه الإسراع.
• శిక్షలు కలిగిన ప్రదేశములలో ప్రవేశించటం అయిష్టము,అలాగే అవిశ్వాసపరుల సమాదుల వద్దకు ప్రవేశము కూడా అలాంటిదే. ఒక వేళ ఎవరైన ఈ ప్రదేశాల నుండి,సమాదులపై నుండి వెళితే అతడు వేగంగా వెళ్ళిపోవటం తప్పనిసరి. info

• ينبغي للمؤمن ألا ينظر إلى زخارف الدنيا وزهرتها، وأن ينظر إلى ما عند الله من العطاء.
విశ్వాసి లోకపు అలంకరణలను దాని వైభోగాలను చూడకూడదు. అతడు అల్లా వద్ద ఉన్న ప్రసాదాలను చూడాలి. info

• على المؤمن أن يكون بعيدًا من المشركين، ولا يحزن إن لم يؤمنوا، قريبًا من المؤمنين، متواضعًا لهم، محبًّا لهم ولو كانوا فقراء.
• ముష్రికుల నుండి దూరంగా ఉండటం,ఒక వేళ వారు విశ్వసించకపోతే బాధపడక ఉండటం,విశ్వాసపరుల కొరకు అణకువను చూపిస్తూ, ఒక వేళ వారు పేదవారైతే వారిపై ప్రేమను చూపిస్తూ వారికి దగ్గరవటం విశ్వాసపరునిపై తప్పనిసరి. info