ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅಬ್ದುರ್‍ರಹೀಂ ಬಿನ್ ಮುಹಮ್ಮದ್

ಪುಟ ಸಂಖ್ಯೆ:close

external-link copy
14 : 9

قَاتِلُوْهُمْ یُعَذِّبْهُمُ اللّٰهُ بِاَیْدِیْكُمْ وَیُخْزِهِمْ وَیَنْصُرْكُمْ عَلَیْهِمْ وَیَشْفِ صُدُوْرَ قَوْمٍ مُّؤْمِنِیْنَ ۟ۙ

వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు; info
التفاسير:

external-link copy
15 : 9

وَیُذْهِبْ غَیْظَ قُلُوْبِهِمْ ؕ— وَیَتُوْبُ اللّٰهُ عَلٰی مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు. info
التفاسير:

external-link copy
16 : 9

اَمْ حَسِبْتُمْ اَنْ تُتْرَكُوْا وَلَمَّا یَعْلَمِ اللّٰهُ الَّذِیْنَ جٰهَدُوْا مِنْكُمْ وَلَمْ یَتَّخِذُوْا مِنْ دُوْنِ اللّٰهِ وَلَا رَسُوْلِهٖ وَلَا الْمُؤْمِنِیْنَ وَلِیْجَةً ؕ— وَاللّٰهُ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟۠

ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును. info
التفاسير:

external-link copy
17 : 9

مَا كَانَ لِلْمُشْرِكِیْنَ اَنْ یَّعْمُرُوْا مَسٰجِدَ اللّٰهِ شٰهِدِیْنَ عَلٰۤی اَنْفُسِهِمْ بِالْكُفْرِ ؕ— اُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ ۖۚ— وَفِی النَّارِ هُمْ خٰلِدُوْنَ ۟

బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. info
التفاسير:

external-link copy
18 : 9

اِنَّمَا یَعْمُرُ مَسٰجِدَ اللّٰهِ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَی الزَّكٰوةَ وَلَمْ یَخْشَ اِلَّا اللّٰهَ ۫— فَعَسٰۤی اُولٰٓىِٕكَ اَنْ یَّكُوْنُوْا مِنَ الْمُهْتَدِیْنَ ۟

నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు![1] info

[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఒకవేళ మీరు ఒక వ్యక్తిని సక్రమంగా మస్జిద్ కు వస్తూ ఉండేది చూస్తే, అతని విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వండి.' (తిర్మిజీ', తఫ్సీర్ 'సూ. అత్-తౌబహ్). ఖుర్ఆన్ లో ఇక్కడ కూడా అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాత చేయవలసిన పనులలో నమా'జ్, దాని తరువాత 'జకాత్ అని పేర్కొనబడ్డాయి. మరొక 'హదీస్' ముత్తఫిఖ్ అలైహి ఉంది. అబూ-బక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ) అన్నారు: 'అల్లాహ్ తోడు, నేను అలాంటి వారితో తప్పక పోరాడుతాను, ఎవరైతే నమా'జ్ మరియు 'జకాత్ ల మధ్య భేదం చూపుతారో!' అంటే నమా'జ్ చేస్తారు కాని 'జకాత్ ఇవ్వడానికి వెనుకంజవేస్తారో! (చూడండి, 9:5).

التفاسير:

external-link copy
19 : 9

اَجَعَلْتُمْ سِقَایَةَ الْحَآجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَجٰهَدَ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— لَا یَسْتَوٗنَ عِنْدَ اللّٰهِ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۘ

ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు.[1] మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు. info

[1] ఈ ఆయత్ అవతరింపజేయబడిన సందర్భాన్ని గురించి, 'స'హాబా ('ర.ది.'అన్హుమ్)ల మధ్య మస్జిదె నబవీలో శుక్రవారం మింబర్ దగ్గర జరిగిన ఈ సంభాషణ కారణం అంటారు. ఒక 'సహాబీ (ర'ది.'అ) అంటారు: "నేను ఇస్లాం స్వీకరించిన తరువాత నా దృష్టిలో అన్నిటి కంటే ఉత్తమమైన కార్యం 'హాజీలకు 'జమ్'జమ్ త్రావపడం." రెండో అతను అంటాడు: "నా దగ్గర మస్జిద్ అల్-'హరాం సేవ చేయడం." మూడవ అతను అంటారు: "అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ చేయడం." ఈ 'హదీస్' కథకుడు నూమూన్ బిన్-బషీర్ (ర.'ది.'అ.) నేను ఆరోజు జుమ'అహ్ నమాజ్' తరువాత వెళ్ళి దైవప్రవక్త ('స'అస)కు ఈ విషయం తెలిపాను. అప్పుడు ఈ ఆయత్ అవతరింప జేయబడింది. ('స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ ఇమారహ్, బాబ్ ఫజ్ల్ అష్షహాదహ్ ఫీ సబీలిల్లాహ్). అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాతనే అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ స్వీకరించబడుతుంది. ఈమాన్ లేనిదే ఎంత గొప్ప కార్యం చేసినా దాని ఫలితం శూన్యమే. విశ్వాసుని జిహద్ సర్వకార్యాలలో గొప్పది. ఈ విషయం దీని తరువాత ఉన్న ఆయత్ లో స్పష్టంగా ఉంది.

التفاسير:

external-link copy
20 : 9

اَلَّذِیْنَ اٰمَنُوْا وَهَاجَرُوْا وَجٰهَدُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ ۙ— اَعْظَمُ دَرَجَةً عِنْدَ اللّٰهِ ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْفَآىِٕزُوْنَ ۟

విశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు.[1] info

[1] చూడండి, 'స. బు'ఖారీ, పు - 4, 'హ. 48, 54.

التفاسير: