[1] చూఇక్కడ 'ఖౌలహ్ బిన్త్ మాలిక్ బిన్ స' 'అలబహ్ (ర.'అన్హా) ను ఆమె భర్త ఔస్ బిన్ 'సామిత్ (రజి.'అ.) "జిహార్ చేసినందుకు ఆమె మొరపెట్టుకుంటుంది. దానికి అల్లాహ్ (సు.తా.) ఆదేశం వచ్చిన తరువాత, అది నిర్మూలించబడిన విషయం ఈ సూరహ్ యొక్క 1-4వ ఆయతులలో పేర్కొనబడింది. "జిహార్ - అంటే, "నీ వీపు నాకు నా తల్లి వీపు వంటిది" అని తన భార్యను తాకకుండా దూరముండటం. మరియు ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా ఉండటం. ఆమె దైవప్రవక్త ('స'అస) దగ్గరకు వచ్చి ఈ ఆచారాన్ని గురించి వాదులాడింది. అప్పుడు ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. (అబూ-దావూద్) ఇంకా చూడండి, 33:4. స్త్రీ తన భర్త నుంచి విడాకులు తీసుకోగోరితే దానికి సంబంధించిన ఆదేశానికి చూడండి, 2:229. దానిని ఖుల్'అ అంటారు.
[1] మీరు "జీహార్ అన్నంత మాత్రాన్నే మీ భార్యలు మీ తల్లులు కారు, మిమ్మల్ని కన్నవారే మీ తల్లులు.
[1] ఇక్కడ దాని పరిహారం చెప్పబడుతోంది. ఒక బానిస విడుదల చేయించాలి, లేక రెండు నెలల ఎడతెగకుండా ఉపవాసాలుండాలి, లేక 60 మంది పేదలకు, ప్రతివానికి 2 ముద్ లు అంటే 1.25 కిలోగ్రాముల ధాన్యం ఇవ్వాలి లేక కడుపునిండా అన్నం తినిపించాలి. వారందరినీ ఒకే సారి తినిపించనవసరం లేదు. వేర్వేరు సమయాలలో తినిపించవచ్చు. (ఫ'త్హ్ అల్ ఖదీర్)
[1] అంటే అల్లాహ్ (సు.తా.) తన జ్ఞానంతో వారితో ఉంటాడు.
[1] ఈ ఆయత్ మదీనా యొక్క యూదులను మరియు కపటవిశ్వాసులను గురించి పలుకుతుంది. వారు ఉన్నచోట నుండి ముస్లింలు పోతూ ఉంటే, వారు గుసగుసలాడే వారు, దానికి ముస్లింలు, వారు తమను గురించి ఏదైనా దురాలోచనలు చేస్తున్నారేమో! లేక ముస్లింల సైన్యం మీద ఏదైనా శత్రువుల సైన్యం దాడిచేసి వారికి నష్టం కలిగించేదేమో! అని భయపడేవారు, కావున దైవప్రవక్త ('స'అస) ఇట్టి గుసగుసలను నిషేధించారు. అయినా వారు కొంతకాలం తరువాత మళ్ళీ ప్రారంభించారు. ఆ సందర్భంలోనే ఈ ఆయత్ అవతరింపబడింది. చూడండి, 4:114.
[2] అల్లాహ్ (సు.తా.), మిమ్మల్ని పరస్పరం 'అస్సలాము అలైకుమ్ వ ర'హ్ మతుల్లాహ్', మీకు శాంతి కలుగుగాక! అని చెప్పుకోండి. అని ఆజ్ఞాపించాడు. కాని యూదులు దైవప్రవక్త ('స'అస)ను చూసినప్పుడు: 'అస్సాము అలైకుమ్' అంటే మీకు చావు వచ్చుగాక! అని అనేవారు. కావున దైవప్రవక్త ('స'అస) అలాంటి వారికి: 'వ అలైకుమ్.' అని జవాబు ఇవ్వండి, అని అన్నారు. అంటే మీరన్నదే మీకు! ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).
[1] ఒకవేళ మీరు ముగ్గురు ఒకేచోట ఉంటే, మీరు మీలో ఒకడిని విడిచి మిగతా ఇద్దరు పరస్పరం గుసగుసలాడుకోరాదు! ఎందుకంటే అది, మూడోవాణ్ణి చింతకు గురిచేస్తుంది. ('స'హీ'హ్ ముస్లిం, 'స'హీ'హ్ బు'ఖారీ) అతడు అనుమతిస్తే, మిగతా ఇద్దరు ఏకాంతంలో మాట్లాడుకోవచ్చు!
[2] చూడండి, 14:22.
[1] ఈ సమావేశాలు ధర్మసమావేశాలు జుమ'అహ్ లేక ఇతర సమావేశాలు కావచ్చు! మొదట వచ్చినవారు విడివిడిగా దూరం దూరంగా కూర్చుంటే తరువాత వచ్చే వారికి చోటు దొరుకుతుంది. దైవప్రవక్త ప్రవచనం: 'ఏ వ్యక్తికి కూడా మరొక వ్యక్తిని అతని చోటు నుండి లేపి కూర్చోవటం సభ్యత కాదు. కావున మీరు సమావేశంలో కూర్చున్నప్పుడు దూరం దూరంగా కూర్చోండి.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం)
[2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: ఒక భక్తిపరుని ('ఆబిద్)పై ఒక జ్ఞానవంతుని ('ఆలిమ్) యొక్క ఆధిక్యత పూర్ణిమ రాత్రిలో, నక్షత్రాలపై చంద్రునికి ఉండే ఆధిక్యత వంటిది. (ఇబ్నె-'హంబల్, అబూ-దావూద్, తిర్మిజీ', నసాయీ', ఇబ్నె-మాజా. మరియు దారిమీ.
[1] లౌ'హె-మ'హ్ ఫూ"జ్ లో వ్రాసిపెట్టబడిన విధివ్రాతలో ఎలాంటి మార్పు జరుగదు. ఇంకా చూడండి, 40:51-52.
[1] చూడండి, 3:28, 9:24 మొదలైనవి.
[2] చూడండి, 8:67.