[1] ఇక్కడ ఇతర బంధువులు అంటే వాసత్వానికి హక్కుదారులు కాని వారు. వారికి కూడా కొంత ఇవ్వాలి. ఆస్తిపరుడు తలుచుకుంటే, తన జీవితకాలంలో, తన ఆస్తిలో మూడో భాగం, వీలు ద్వారా అతని ఆస్తికి హక్కుదారులు కాని, ఇతర బంధువులకు గానీ, పేదలకు గానీ, పుణ్యకార్యాలకు గానీ ఇవ్వవచ్చు. మూడో భాగం కంటే, ఎక్కువ వీలు ద్వారా ఇచ్చే హక్కు ఆస్తిపరునికి లేదు. ఆస్తికి హక్కుదారులైన వారికి ఆస్తి ఇవ్వకూడదని వీలు వ్రాసే అధికారం కూడా అతనికి షరీయత్ లో లేదు. మూడవ భాగం ఆస్తి చాలా తక్కువ ఉంటే, ఇతరులకు ఇచ్చే అవసరం లేదు. తన ఆస్తిని పేరు కొరకు ఇతరులకు పంచి, హక్కుదారులైన తన దగ్గరి బంధువులను, పేదరికంలో ముంచటం తగినది కాదు. (ఫత్హ అల్ ఖదీర్).