[1] మద్ యన్ అక్కడ నివసించే ప్రజల తెగ పేరు. వారు అమోరైట్ (Amorite) తెగకు చెందిన 'అరబ్బులు. యూదుల సంతతితో వారికి దగ్గరి సంబంధం ఉండెను. చూడండి, 7:8. ఇబ్రాహీమ్ ('అ.స.) కుమారుడైన ఇస్'హాఖ్ ('అ.స.) యొక్క కుమారుడగు య'అఖూబ్ ('అ.స.) మరొక పేరు ఇస్లాయీ'ల్. ఆ పేరుతోనే పిలువబడే అతని పన్నెండుమంది కుమారుల సంతతి వారే ఇస్రాయీ'ల్ సంతతి వారు (బనీ ఇస్రాయీ'ల్).
[1] ఆ ఇద్దరు స్త్రీల తండ్రి పేరు ఖుర్ఆన్ పేర్కొనలేదు. ఇమామ్ షౌకాని మరియు ఇతర చాలామంది వ్యాఖ్యాతలు అతని పేరు షు'ఐబ్ ('అ.స.) అని అన్నారు. ఎందుకంటే అతను మద్ యన్ జాతి వారివైపునకే ప్రవక్తగా పంపబడి ఉండెను. కాని ఇబ్నె-కసీ'ర్ అభిప్రాయం వేరుంది. అతను అంటారు: 'షు'ఐబ్ ('అ.స.) మరియు మూసా ('అ.స.) కాలాలలో చాలా గడువు ఉంది. కాబట్టి ఇతను షు'ఐబ్ ('అ.స.) తెగకు చెందిన మరొక వ్యక్తి కావచ్చు.' అల్లాహు ఆలమ్.
[1] మన సాంఘిక సంప్రదాయంలో ఆడబిడ్డ (వధువు) ఇంటివారు తమ బిడ్డ కొరకు వరుని (పెండ్లి కుమారుని) వారితో వివాహసంబంధం గురించి మొదట మాట ప్రారంభించటం అనుచితమైన విషయంగా భావిస్తారు. కాని అల్లాహ్ (సు.తా.) షరీయత్ లో ఇది అనుచితం కాదు. ఒకవేళ సద్వర్తనుడు, సుశీలుడు అయిన వరుడు ఉంటే అతనితో గానీ, లేక అతని కుటుంబంవారితో గానీ, వధువు ఇంటివారు మాట్లాడితే తప్పులేదు. దైవప్రవక్త ('స'అస) మరియు సహాబీల (ర'ది.'అన్హుమ్)లలో కూడా ఈ ఆచారం ఉండెను.