ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅಬ್ದುರ್‍ರಹೀಂ ಬಿನ್ ಮುಹಮ್ಮದ್

external-link copy
40 : 2

یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَوْفُوْا بِعَهْدِیْۤ اُوْفِ بِعَهْدِكُمْ ۚ— وَاِیَّایَ فَارْهَبُوْنِ ۟

ఓ ఇస్రాయీల్ సంతతివారలారా![1] నేను మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి! info

[1] ఇస్రాయీ'ల్: హీబ్రూ భాష పదం. 'అరబ్బీలో దీని అర్థం 'అబ్దుల్లాహ్ (అల్లాహ్ దాసుడు). ఇది య'అఖూబ్ ('అ.స.) యొక్క బిరుదు. అతనికి 12 మంది కుమారులు. వారితో 12 తెగలుగా యూదుల సంతతి పెరిగింది. వారిని బనీ ఇస్రాయీ'ల్ (ఇస్రాయీ'ల్ సంతతివారు) అని అంటారు. వారిలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు.

التفاسير: