ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅಬ್ದುರ್‍ರಹೀಂ ಬಿನ್ ಮುಹಮ್ಮದ್

ಪುಟ ಸಂಖ್ಯೆ: 19:2 close

external-link copy
127 : 2

وَاِذْ یَرْفَعُ اِبْرٰهٖمُ الْقَوَاعِدَ مِنَ الْبَیْتِ وَاِسْمٰعِیْلُ ؕ— رَبَّنَا تَقَبَّلْ مِنَّا ؕ— اِنَّكَ اَنْتَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ ఈ గృహపు (కఅబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మా ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వం వినేవాడవు,[1] సర్వజ్ఞుడవు[2]." info

[1] అస్-సమీ'ఉ: The All-Hearing. Who hears every thing. సర్వం వినేవాడు, సర్వశ్రవణ సమర్థుడు. అస్-సమీ'ఉన్ - 'అలీము, ఈ ద్వంద పదం ఖుర్ఆన్ లో ఎన్నో సార్లు వచ్చింది. 29 సార్లు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. [2] అల్-'అలీము: The All Knowing, సర్వజ్ఞుడు, చూడండి, 2:32.

التفاسير:

external-link copy
128 : 2

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَیْنِ لَكَ وَمِنْ ذُرِّیَّتِنَاۤ اُمَّةً مُّسْلِمَةً لَّكَ ۪— وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَیْنَا ۚ— اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِیْمُ ۟

"ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) ఉండునట్లు చేయి. మరియు మాకు, మా ఆరాధనారీతులను (మనాసిక్ లను) తెలుపు మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీకరించు. నిశ్చయంగా, నీవే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు." info
التفاسير:

external-link copy
129 : 2

رَبَّنَا وَابْعَثْ فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِكَ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَیُزَكِّیْهِمْ ؕ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠

"ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకునూ ఒక సందేశహరుణ్ణి పంపు.[1] నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు[2], మహా వివేకవంతుడవు." info

[1] ఇది ఇబ్రాహీమ్ మరియు ఇస్మా'యీల్ ('అలైహిమ్. స.)ల యొక్క చివరి దు'ఆ. అల్లాహ్ (సు.తా.) దీనిని స్వీకరించి ఇస్మాయీ'ల్ ('అ.స.) సంతతి నుండి ము'హమ్మద్ ('స'అస) ను సందేశహరునిగా పంపాడు. కావున ము'హమ్మద్ ('స'అస) అన్నారు: 'నేను నా తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క దు'ఆను, 'ఈసా ('అ.స.) యొక్క శుభవార్తను మరియు నా తల్లి యొక్క కలను.' (ఫ'త్హ రబ్బాని). [2] అల్-'అజీ'జ్: సర్వశక్తిసంపన్నుడు, సర్వశక్తిమంతుడు, ఆయన అధికారం సర్వాన్ని పరివేష్ఠించి ఉన్నది, గౌరవానికి మూలాధారి.The Almighty

التفاسير:

external-link copy
130 : 2

وَمَنْ یَّرْغَبُ عَنْ مِّلَّةِ اِبْرٰهٖمَ اِلَّا مَنْ سَفِهَ نَفْسَهٗ ؕ— وَلَقَدِ اصْطَفَیْنٰهُ فِی الدُّنْیَا ۚ— وَاِنَّهٗ فِی الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِیْنَ ۟

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు. info
التفاسير:

external-link copy
131 : 2

اِذْ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسْلِمْ ۙ— قَالَ اَسْلَمْتُ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟

అతని ప్రభువు అతనితో: "(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు." అని అన్నప్పుడు అతను: " నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయిపోయాను." అని జవాబిచ్చాడు. info
التفاسير:

external-link copy
132 : 2

وَوَصّٰی بِهَاۤ اِبْرٰهٖمُ بَنِیْهِ وَیَعْقُوْبُ ؕ— یٰبَنِیَّ اِنَّ اللّٰهَ اصْطَفٰی لَكُمُ الدِّیْنَ فَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ ۟ؕ

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ కూడా (తన సంతానంతో అన్నాడు): " నా బిడ్డలారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) కాకుండా మరణించకండి!"[1]. info

[1] ఇబ్రాహీమ్ మరియు య'అఖూబ్ ('అలైహిమ్ స.) కూడా తమ సంతానాన్ని అనుసరించమని బోధించిన ధర్మం ఇస్లామ్ మాత్రమే. ఈ ఇస్లాం ధర్మం అంటే అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే దాస్యం చేయటం (విధేయులుగా ఉండటం). ఇదే ఆదమ్ ('అ.స.) నుండి చిట్టచివరి ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) వరకూ ప్రవక్తలందరూ బోధించిన ధర్మం. (చూడండి, 3:19)

التفاسير:

external-link copy
133 : 2

اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ حَضَرَ یَعْقُوْبَ الْمَوْتُ ۙ— اِذْ قَالَ لِبَنِیْهِ مَا تَعْبُدُوْنَ مِنْ بَعْدِیْ ؕ— قَالُوْا نَعْبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآىِٕكَ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— وَّنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟

ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?[1]" అప్పుడతను తన కుమారులతో: "నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" అని అడిగినప్పుడు. వారన్నారు: "నీ ఆరాధ్యదైవం మరియు నీ పూర్వీకులగు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఆ ఏకైక[2] దేవుణ్ణి (అల్లాహ్ నే) మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము." info

[1] ఇక్కడ యూదులు ప్రశ్నింపబడుతున్నారు: "య'అఖూబ్ ('అ.స.) మరణించినప్పుడు మీరైతే అక్కడ లేరు కదా! అలాంటప్పుడు మీకెలా తెలుసు, అతను తన కుమారులకు బోధించిన ధర్మమేమిటో?" అతనే గాక ప్రతి ప్రవక్త బోధించిన ధర్మం ఇస్లాం మాత్రమే. ('స'హీ'హ్ బు'ఖారీ). [2] అల్-వా'హిద్: The One, The Sole. అద్వితీయుడు, ఒకే ఒక్కడు. ఏకైకుడు ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 2:163, 12:39. అహదున్: The Unique and Alone, ఏకైకుడు, ఒకే ఒక్కడు. చూడండి, 112:1, 4.

التفاسير:

external-link copy
134 : 2

تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟

అది ఒక గతించిన సమాజం. దాని కర్మల ఫలితం దానికి మరియు మీ కర్మలది మీకు. మరియు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు. info
التفاسير: