ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
69 : 9

كَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ كَانُوْۤا اَشَدَّ مِنْكُمْ قُوَّةً وَّاَكْثَرَ اَمْوَالًا وَّاَوْلَادًا ؕ— فَاسْتَمْتَعُوْا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِیْ خَاضُوْا ؕ— اُولٰٓىِٕكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟

(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడి నటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు! వీరే నష్టానికి గురి అయ్యేవారు. info
التفاسير:

external-link copy
70 : 9

اَلَمْ یَاْتِهِمْ نَبَاُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ ۙ۬— وَقَوْمِ اِبْرٰهِیْمَ وَاَصْحٰبِ مَدْیَنَ وَالْمُؤْتَفِكٰتِ ؕ— اَتَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ— فَمَا كَانَ اللّٰهُ لِیَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟

ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్,[1] ఇబ్రాహీమ్ జాతి వారి,[2] మద్ యన్ (షుఐబ్) ప్రజల[3] మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)?[4] వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు. info

[1] నూ'హ్, హూద్ మరియు 'సాలి'హ్ ('అలైహిమ్ స.) గాథల కొరకు చూడండి, 7:59-79. [2] ఇబ్రాహీమ్ ('అ.స.) జాతివారు, బాబిలోనియనులు. 1100 సంవత్సరాలు క్రీస్తు శకానికి ముందు వారు అస్సీరియన్ ల ద్వారా అపజయం పొంది నాశనం చేయబడ్డారు. [3] మద్ యన్ ప్రజల గాథలకు చూడండి, 7:85-93. [4] సోడోమ్ మరియు గొమోర్రాహ్ లు, లూ'త్ ('అ.స.) ప్రజల నగరాలు. చూడండి, 7:80-84, 11:69-83.

التفاسير:

external-link copy
71 : 9

وَالْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بَعْضُهُمْ اَوْلِیَآءُ بَعْضٍ ۘ— یَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَیُقِیْمُوْنَ الصَّلٰوةَ وَیُؤْتُوْنَ الزَّكٰوةَ وَیُطِیْعُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ— اُولٰٓىِٕكَ سَیَرْحَمُهُمُ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟

మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనా పరుడు. info
التفاسير:

external-link copy
72 : 9

وَعَدَ اللّٰهُ الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا وَمَسٰكِنَ طَیِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ ؕ— وَرِضْوَانٌ مِّنَ اللّٰهِ اَكْبَرُ ؕ— ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟۠

మరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి.[1] వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం). info

[1] చూడండి, 38:50. 'అద్న్: అవతరణ ప్రకారం ఈ శబ్దం మొట్టమొదట పై ఆయత్ లో వచ్చింది. 'అద్న్, అంటే శాశ్వతమైన అని అర్థం.

التفاسير: