ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
17 : 8

فَلَمْ تَقْتُلُوْهُمْ وَلٰكِنَّ اللّٰهَ قَتَلَهُمْ ۪— وَمَا رَمَیْتَ اِذْ رَمَیْتَ وَلٰكِنَّ اللّٰهَ رَمٰی ۚ— وَلِیُبْلِیَ الْمُؤْمِنِیْنَ مِنْهُ بَلَآءً حَسَنًا ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟

మీరు వారిని చంపలేదు, కానీ అల్లాహ్ వారిని చంపాడు. (ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవు కాదు విసిరింది,[1] కాని అల్లాహ్ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి, వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. info

[1] బద్ర్ యుద్ధ రంగంలో దైవప్రవక్త ('స'అస) పిడికెడు దుమ్ము, అల్లాహ్ (సు.తా.) పేరుతో సత్యతిరస్కారులపై విసిరారు.

التفاسير:

external-link copy
18 : 8

ذٰلِكُمْ وَاَنَّ اللّٰهَ مُوْهِنُ كَیْدِ الْكٰفِرِیْنَ ۟

ఇదే (ఆయన ఇచ్ఛ!) మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల ఎత్తుగడలను బలహీనపరుస్తాడు. info
التفاسير:

external-link copy
19 : 8

اِنْ تَسْتَفْتِحُوْا فَقَدْ جَآءَكُمُ الْفَتْحُ ۚ— وَاِنْ تَنْتَهُوْا فَهُوَ خَیْرٌ لَّكُمْ ۚ— وَاِنْ تَعُوْدُوْا نَعُدْ ۚ— وَلَنْ تُغْنِیَ عَنْكُمْ فِئَتُكُمْ شَیْـًٔا وَّلَوْ كَثُرَتْ ۙ— وَاَنَّ اللّٰهَ مَعَ الْمُؤْمِنِیْنَ ۟۠

(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు. info
التفاسير:

external-link copy
20 : 8

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَا تَوَلَّوْا عَنْهُ وَاَنْتُمْ تَسْمَعُوْنَ ۟

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలి పోకండి. info
التفاسير:

external-link copy
21 : 8

وَلَا تَكُوْنُوْا كَالَّذِیْنَ قَالُوْا سَمِعْنَا وَهُمْ لَا یَسْمَعُوْنَ ۟ۚ

మరియు వాస్తవానికి వినకుండానే: "మేము విన్నాము!" అని అనే వారి వలే కాకండి.[1] info

[1] చూడండి, 2:93 మరియు 4:46.

التفاسير:

external-link copy
22 : 8

اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الصُّمُّ الْبُكْمُ الَّذِیْنَ لَا یَعْقِلُوْنَ ۟

తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే, నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన పశుజాతికి చెందినవారు.[1] info

[1] చూడండి, 7:179.

التفاسير:

external-link copy
23 : 8

وَلَوْ عَلِمَ اللّٰهُ فِیْهِمْ خَیْرًا لَّاَسْمَعَهُمْ ؕ— وَلَوْ اَسْمَعَهُمْ لَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ ۟

మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి), ఆయన వారిని వినేటట్లు చేసినా, వారు (తమ మూర్ఖత్వంలో) ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగి పోయేవారు. info
التفاسير:

external-link copy
24 : 8

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اسْتَجِیْبُوْا لِلّٰهِ وَلِلرَّسُوْلِ اِذَا دَعَاكُمْ لِمَا یُحْیِیْكُمْ ۚ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَحُوْلُ بَیْنَ الْمَرْءِ وَقَلْبِهٖ وَاَنَّهٗۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడనీ మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి. info

[1] అంటే ఖుర్ఆన్ మరియు షరీ'అత్ వైపుకు మరియి జిహాద్ కు. అంటే కేవలం అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త ('స'అస) ఆజ్ఞలనే అనుసరించండి, అని అర్థం.

التفاسير:

external-link copy
25 : 8

وَاتَّقُوْا فِتْنَةً لَّا تُصِیْبَنَّ الَّذِیْنَ ظَلَمُوْا مِنْكُمْ خَآصَّةً ۚ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟

మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి. info
التفاسير: