ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
17 : 79

اِذْهَبْ اِلٰی فِرْعَوْنَ اِنَّهٗ طَغٰی ۟ؗۖ

(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు. info
التفاسير:

external-link copy
18 : 79

فَقُلْ هَلْ لَّكَ اِلٰۤی اَنْ تَزَكّٰی ۟ۙ

"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా? info
التفاسير:

external-link copy
19 : 79

وَاَهْدِیَكَ اِلٰی رَبِّكَ فَتَخْشٰی ۟ۚ

మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'" info
التفاسير:

external-link copy
20 : 79

فَاَرٰىهُ الْاٰیَةَ الْكُبْرٰی ۟ؗۖ

తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు. info
التفاسير:

external-link copy
21 : 79

فَكَذَّبَ وَعَصٰی ۟ؗۖ

కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు. info
التفاسير:

external-link copy
22 : 79

ثُمَّ اَدْبَرَ یَسْعٰی ۟ؗۖ

ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు. info
التفاسير:

external-link copy
23 : 79

فَحَشَرَ ۫— فَنَادٰی ۟ؗۖ

పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ; info
التفاسير:

external-link copy
24 : 79

فَقَالَ اَنَا رَبُّكُمُ الْاَعْلٰی ۟ؗۖ

ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"[1] info

[1] చూడండి, 28:38 ఫిర్'ఔన్ తనను తాను దేవుడని చెప్పుకున్నాడు మరియు హద్దులు మీరి ప్రవర్తించాడు మరియు సత్యాన్ని ధిక్కరించాడు.

التفاسير:

external-link copy
25 : 79

فَاَخَذَهُ اللّٰهُ نَكَالَ الْاٰخِرَةِ وَالْاُوْلٰی ۟ؕ

కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.[1] info

[1] చూడండి, 7:137 అతని ఇహలోక శిక్షకు.

التفاسير:

external-link copy
26 : 79

اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّمَنْ یَّخْشٰی ۟ؕ۠

నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది. info
التفاسير:

external-link copy
27 : 79

ءَاَنْتُمْ اَشَدُّ خَلْقًا اَمِ السَّمَآءُ ؕ— بَنٰىهَا ۟۫

ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది![1] info

[1] చూడండి, 2:29 మరియు 40:57.

التفاسير:

external-link copy
28 : 79

رَفَعَ سَمْكَهَا فَسَوّٰىهَا ۟ۙ

ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు; info
التفاسير:

external-link copy
29 : 79

وَاَغْطَشَ لَیْلَهَا وَاَخْرَجَ ضُحٰىهَا ۪۟

మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు. info
التفاسير:

external-link copy
30 : 79

وَالْاَرْضَ بَعْدَ ذٰلِكَ دَحٰىهَا ۟ؕ

మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు[1]. info

[1] ద'హాహున్: అంటే నిప్పుకోడి గ్రుడ్డు ఆకారం అని కొందరు వ్యాఖ్యానించారు. ఈ రోజు సైంటిష్టులు భూమి ఆకారం నిప్పుకోడి గ్రుడ్డు ఆకారంలో ఉందని నిరూపించారు.

التفاسير:

external-link copy
31 : 79

اَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعٰىهَا ۪۟

దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు; info
التفاسير:

external-link copy
32 : 79

وَالْجِبَالَ اَرْسٰىهَا ۟ۙ

మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు; info
التفاسير:

external-link copy
33 : 79

مَتَاعًا لَّكُمْ وَلِاَنْعَامِكُمْ ۟ؕ

మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా[1]! info

[1] చూడండి, 80:24-32.

التفاسير:

external-link copy
34 : 79

فَاِذَا جَآءَتِ الطَّآمَّةُ الْكُبْرٰی ۟ؗۖ

ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు; info
التفاسير:

external-link copy
35 : 79

یَوْمَ یَتَذَكَّرُ الْاِنْسَانُ مَا سَعٰی ۟ۙ

ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు; info
التفاسير:

external-link copy
36 : 79

وَبُرِّزَتِ الْجَحِیْمُ لِمَنْ یَّرٰی ۟

మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. [1] info

[1] చూడండి, 26:91.

التفاسير:

external-link copy
37 : 79

فَاَمَّا مَنْ طَغٰی ۟ۙ

ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి; info
التفاسير:

external-link copy
38 : 79

وَاٰثَرَ الْحَیٰوةَ الدُّنْیَا ۟ۙ

మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి; info
التفاسير:

external-link copy
39 : 79

فَاِنَّ الْجَحِیْمَ هِیَ الْمَاْوٰی ۟ؕ

నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది! info
التفاسير:

external-link copy
40 : 79

وَاَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهٖ وَنَهَی النَّفْسَ عَنِ الْهَوٰی ۟ۙ

మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి; info
التفاسير:

external-link copy
41 : 79

فَاِنَّ الْجَنَّةَ هِیَ الْمَاْوٰی ۟ؕ

నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది! info
التفاسير:

external-link copy
42 : 79

یَسْـَٔلُوْنَكَ عَنِ السَّاعَةِ اَیَّانَ مُرْسٰىهَا ۟ؕ

(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు. info
التفاسير:

external-link copy
43 : 79

فِیْمَ اَنْتَ مِنْ ذِكْرٰىهَا ۟ؕ

దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం? info
التفاسير:

external-link copy
44 : 79

اِلٰی رَبِّكَ مُنْتَهٰىهَا ۟ؕ

దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది! info
التفاسير:

external-link copy
45 : 79

اِنَّمَاۤ اَنْتَ مُنْذِرُ مَنْ یَّخْشٰىهَا ۟ؕ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే! info
التفاسير:

external-link copy
46 : 79

كَاَنَّهُمْ یَوْمَ یَرَوْنَهَا لَمْ یَلْبَثُوْۤا اِلَّا عَشِیَّةً اَوْ ضُحٰىهَا ۟۠

వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు[1]. info

[1] మానవుడు చేసే భూమికి చెందిన కాల పరిమాణం పరలోకంలో ఉండదు. ఇంకా చూడండి, 2:259, 17:52, 18:19, 20:103-104, 23:112-113, 30:55. 'అషియ్యతున్: అంటే "జుహ్ర్ నుండి సూర్యాస్తమయం వరకు మరియు 'దుహా: అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు.

التفاسير: