[1] యూనుస్ ('అ.స.) యొక్క వివరాల కోసం చూడండి, 21:87 మరియు 37:140.
[1] దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది: "ఒకవేళ అతనిపై అతని ప్రభువు (సు.తా.) అనుగ్రహమే గనక లేకుంటే! నిశ్చయంగా, అతను అవమానకరమైన స్థితిలో బంజరు మైదానంలో విసరివేయబడేవాడు." మరొక వ్యాఖ్యానం: "అల్లాహ్ (సు.తా.) అతనికి పశ్చాత్తాపపడే సద్బుద్ధి గనక ఇవ్వకుండా ఉంటే మరియు అతని ప్రార్థన అంగీకరించబడకుండా ఉంటే అతను సముద్రపు అంచున వేయబడకుండా ఉంటే - ఎక్కడైతే అతనికి ఆహారం ఇచ్చాడో మరియు తీగ పెంచాడో - బంజరు భూమిలో విసిరివేయబడి ఉండేవాడు. మరియు అల్లాహ్ (సు.తా.) వద్ద అతని పరిస్థితి అవమానకరమైనదై ఉండేది. కాని అతని ప్రార్థన అంగీకరించబడిన తరువాత అతను అనుగ్రహించబడ్డాడు." ఇంకా చూడండి, 37:143.
[1] ఒకవేళ నీకు అల్లాహ్ (సు.తా.) రక్షణయే గనక లేకుంటా! వారిదిష్టి నీకు తగిలేది. (ఇబ్నె-కసీ'ర్). ఇబ్నె-కసీ'ర్ ఇంకా ఇలా వ్రాసారు. దిష్టి తగలటం మరియు అల్లాహ్ (సు.తా.) అనుమతితో దానివల్ల నష్టం కలగటం నిజమే. కావున 'హదీస్' లలో దీని నుండి విముక్తి పొందటానికి దు'ఆలు ఇవ్వబడ్డాయి మరియు ఈ సలహాలు కూడా ఇవ్వబడ్డాయి : ఏదైనా మంచి వస్తువును చూస్తే దిష్టి తగలకుండా ఉండటానికి : 'మాషా అల్లాహ్' లేక 'బారకల్లాహ్' అనాలి. ఒకవేళ దిష్టి తగిలితే : దిష్టి పెట్టినవాడు ఒక పాత్రలో స్నానం చేసి ఆ నీటిని దిష్టి తగిలినవాడి మీద పోయాలి. (ఇబ్నె-కసీ'ర్).