[1] వీరు ఫయ్అ'కు హక్కుదారులైన మరొకరకం వారు. వీరు సహాబీల తరువాత తరం వారు మరియు వారి అడుగుజాడలలో నడిచేవారు. వీరిలో తాబ'యీన్ మరియు వారిని అనుసరించిన వారూ మరియు పునరుత్థాన దినం వరకు ఈమాన్ లో ప్రవేశించే వారందరూ ఉన్నారు! ఇమామ్ మాలికి (ర'హ్మ) ఈ ఆయత్ వ్యాఖ్యానంలో అన్నారు: 'రాఫజీ, ఎవరైతే 'స'హాబా (ర'.ది.'అన్హుమ్) లను దూషిస్తారో, వారికి ఫయ్అ' ధనంలో భాగం లేదు. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) 'స'హాబా (ర'.ది.'అన్హుమ్)లను పొగుడుతున్నాడు. మరియు వారేమో స'హాబా (ర.'ది.'అన్హుమ్)లను దూషఇస్తున్నారు.' (ఇబ్నె-కసీ'ర్). 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం: మీరు స'హాబా (ర'.ది'అన్హుమ్) ల కొరకు ఇస్తి'గ్ ఫార్ చేయండని, దైవప్రవక్త ('స'అస) ఆజ్ఞాపించబడ్డారు. కాని మీరు వారిని దూషిస్తున్నారు. నేను మీ ప్రవక్త ('స'అస) ను ఇలా అంటూ ఉండగా విన్నాను: 'ఈ జాతిలోని చివరివారు తమ మొదటి వారిని శపించనంత వరకూ ఈ జాతి నశించదు!' (బ'గవీ ఈ 'హదీస్' ను ఉల్లేఖించారు.