ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

అర్-రహ్మాన్

external-link copy
1 : 55

اَلرَّحْمٰنُ ۟ۙ

అనంత కరుణామయుడు (అల్లాహ్)! info
التفاسير:

external-link copy
2 : 55

عَلَّمَ الْقُرْاٰنَ ۟ؕ

ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.[1] info

[1] ఇది మక్కా ముష్రికులకు ఇవ్వబడిన జవాబు. ఎందుకంటే వారు, దైవప్రవక్త (సఅస) మీద, ఈ ఖుర్ఆన్ ను అతనికి ఒక మానవుడు నేర్పాడు అనే అపనింద మోపారు. కాని వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దీనిని తన సందేశహరునికి నేర్పాడు మరియు అతను తమ అనుచరులకు (ర'ది.'అన్హుమ్) నేర్పారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

التفاسير:

external-link copy
3 : 55

خَلَقَ الْاِنْسَانَ ۟ۙ

ఆయనే మానవుణ్ణి సృష్టించాడు. info
التفاسير:

external-link copy
4 : 55

عَلَّمَهُ الْبَیَانَ ۟

ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు. info
التفاسير:

external-link copy
5 : 55

اَلشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ ۟ۙ

సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు. info
التفاسير:

external-link copy
6 : 55

وَّالنَّجْمُ وَالشَّجَرُ یَسْجُدٰنِ ۟

మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.[1] info

[1] చూడండి, 22:18.

التفاسير:

external-link copy
7 : 55

وَالسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ الْمِیْزَانَ ۟ۙ

మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.[1] info

[1] అంటే ప్రపంచంలో న్యాయాన్ని నెలకొల్పాడు, చూడండి, 57:25, 42:17.

التفاسير:

external-link copy
8 : 55

اَلَّا تَطْغَوْا فِی الْمِیْزَانِ ۟

తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని![1] info

[1] అంటే న్యాయానికి విరుద్ధంగా పోకండి, న్యాయాన్ని భంగపరచకండి.

التفاسير:

external-link copy
9 : 55

وَاَقِیْمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِیْزَانَ ۟

మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి. info
التفاسير:

external-link copy
10 : 55

وَالْاَرْضَ وَضَعَهَا لِلْاَنَامِ ۟ۙ

మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు. info
التفاسير:

external-link copy
11 : 55

فِیْهَا فَاكِهَةٌ وَّالنَّخْلُ ذَاتُ الْاَكْمَامِ ۟ۖ

అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి. info
التفاسير:

external-link copy
12 : 55

وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّیْحَانُ ۟ۚ

మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి)[1] ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా! info

[1] అల్-'అ'స్ఫు: అంటే ఎండిన గడ్డి, గడ్డి పరక, పొట్టు, ఊక, పొర, ధాన్యపు దంట్లు ఎండిపోయిన తరువాత 'అ'స్ఫుగా మారిపోతాయి. దానిని పశువులు తింటాయి.

التفاسير:

external-link copy
13 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
14 : 55

خَلَقَ الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ كَالْفَخَّارِ ۟ۙ

ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో[1] సృష్టించాడు. info

[1] 'సల్-'సాలిన్: అంటే ఎండిన మట్టి. ఫ'ఖ్ఖారున్: అంటే మంటలో కాలిన మట్టి. ఇంకా చూడండి, 15:26.

التفاسير:

external-link copy
15 : 55

وَخَلَقَ الْجَآنَّ مِنْ مَّارِجٍ مِّنْ نَّارٍ ۟ۚ

మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.[1] info

[1] చూడండి, 15:27, 6:100 మరియు 37:158.

التفاسير:

external-link copy
16 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
17 : 55

رَبُّ الْمَشْرِقَیْنِ وَرَبُّ الْمَغْرِبَیْنِ ۟ۚ

ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.[1] info

[1] చూడండి, 37:5 మరియు 70:40.

التفاسير:

external-link copy
18 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
19 : 55

مَرَجَ الْبَحْرَیْنِ یَلْتَقِیٰنِ ۟ۙ

ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు. info
التفاسير:

external-link copy
20 : 55

بَیْنَهُمَا بَرْزَخٌ لَّا یَبْغِیٰنِ ۟ۚ

ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.[1] info

[1] చూఈ విషయం ఎన్నో విధాలుగా బోధించబడింది: 1) భూమిపై మంచి నీళ్ళ నదులు, చెరువులు సరస్సులు మొదలైనవి మరియు ఉప్పునీటి సముద్రాలు, అన్నీ భూమి మీదనే ఉన్నా, వాటి రుచులు వేరువేరుగా ఉన్నాయి. 2) ఉప్పునీటి సముద్రాలలో మంచినీటి ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి. కాని అవి కలిసిపోవు. వాటి రుచి, భిన్నంగానే ఉంటుంది. 3) మరికొన్ని చోట్లలో నదుల నీరు సముద్రంలో పోయి కలుస్తుంది. చాలా దూరం వరకు ఒకవైపు సముద్రపు నీళ్ళు ఉప్పగానూ మరొక వైపు నది నీళ్ళు తియ్యగాను ఉంటాయి. ఇంకా చూడండి, 25:53.

التفاسير:

external-link copy
21 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
22 : 55

یَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ۟ۚ

ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి. info
التفاسير:

external-link copy
23 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
24 : 55

وَلَهُ الْجَوَارِ الْمُنْشَاٰتُ فِی الْبَحْرِ كَالْاَعْلَامِ ۟ۚ

మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే![1] info

[1] చూడండి, 42:32-34.

التفاسير:

external-link copy
25 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟۠

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
26 : 55

كُلُّ مَنْ عَلَیْهَا فَانٍ ۟ۚۖ

దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది. info
التفاسير:

external-link copy
27 : 55

وَّیَبْقٰی وَجْهُ رَبِّكَ ذُو الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟ۚ

మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు[1] మరియు పరమదాత[2] అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే![3] info

[1] జు'ల్-జలాల్: Majesty, Possessor of Glory, Greatness మహిమాన్వితుడు, ఘనత, వైభవం, విఖ్యాతి, ప్రతాపం గలవాడు, సార్వభౌముడు.
[2] అల్-ఇక్రామ్: Most Generous, Bountenous, Noble, Honourable పరమదాత, దాతృత్వుడు, ఆదరణీయుడు, మహోపకారి, ఉదారుడు, దివ్యుడు, చూడండి, 55:78.
జల్-జలాలి వల్-ఇక్రామ్: మహిమాన్వితుడు మరియు పరమదాత Lord of Majesty and Generosity ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[3] చూడండి, 28:88.

التفاسير:

external-link copy
28 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
29 : 55

یَسْـَٔلُهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلَّ یَوْمٍ هُوَ فِیْ شَاْنٍ ۟ۚ

భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు. info
التفاسير:

external-link copy
30 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
31 : 55

سَنَفْرُغُ لَكُمْ اَیُّهَ الثَّقَلٰنِ ۟ۚ

భారాలను మోసే మీరిద్దరు![1] త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము. info

[1] అస్-స'ఖలాన్: దీని మరొక తాత్పర్యం: 'భూమికి భారమైన మీరిద్దరు!' అని ఇవ్వబడింది. ఈ పదం జిన్నాతులు మరియు మానవుల కోసం వాడబడింది.

التفاسير:

external-link copy
32 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
33 : 55

یٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اِنِ اسْتَطَعْتُمْ اَنْ تَنْفُذُوْا مِنْ اَقْطَارِ السَّمٰوٰتِ وَالْاَرْضِ فَانْفُذُوْا ؕ— لَا تَنْفُذُوْنَ اِلَّا بِسُلْطٰنٍ ۟ۚ

ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.[1] info

[1] అల్లాహ్ (సు.తా.) యొక్క విధివ్రాత నుండి పారిపోగల శక్తి ఎవ్వరికీ లేదు. ఎక్కడికి పారిపోగలరు? అల్లాహ్ (సు.తా.) హద్దులలో లేని చోటు అనేదే లేదు!

التفاسير:

external-link copy
34 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
35 : 55

یُرْسَلُ عَلَیْكُمَا شُوَاظٌ مِّنْ نَّارٍ ۙ۬— وَّنُحَاسٌ فَلَا تَنْتَصِرٰنِ ۟ۚ

మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ[1] పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు). info

[1] ను'హాసున్: దీని మరొక అర్థం కరిగిన రాగి లేక ఇత్తడి.

التفاسير:

external-link copy
36 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
37 : 55

فَاِذَا انْشَقَّتِ السَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ۟ۚ

మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.[1] info

[1] అద్దిహాను: దీని మరొక అర్థం ఎర్రని చర్మం (పచ్చిది లేదా శుభ్రం చేసింది).

التفاسير:

external-link copy
38 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
39 : 55

فَیَوْمَىِٕذٍ لَّا یُسْـَٔلُ عَنْ ذَنْۢبِهٖۤ اِنْسٌ وَّلَا جَآنٌّ ۟ۚ

ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.[1] info

[1] చూడండి, 18:49. వారి నాలుకలు, చేతులు మరియు కాళ్ళు వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. ఇంకా చూడండి, 24:24.

التفاسير:

external-link copy
40 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
41 : 55

یُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِیْمٰهُمْ فَیُؤْخَذُ بِالنَّوَاصِیْ وَالْاَقْدَامِ ۟ۚ

ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.[1] info

[1] చూడండి, 96:15-16.

التفاسير:

external-link copy
42 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
43 : 55

هٰذِهٖ جَهَنَّمُ الَّتِیْ یُكَذِّبُ بِهَا الْمُجْرِمُوْنَ ۟ۘ

ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే! info
التفاسير:

external-link copy
44 : 55

یَطُوْفُوْنَ بَیْنَهَا وَبَیْنَ حَمِیْمٍ اٰنٍ ۟ۚ

వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. info
التفاسير:

external-link copy
45 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟۠

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
46 : 55

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهٖ جَنَّتٰنِ ۟ۚ

మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి. info
التفاسير:

external-link copy
47 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۙ

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
48 : 55

ذَوَاتَاۤ اَفْنَانٍ ۟ۚ

అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.[1] info

[1] చూడండి, 32:17. స్వర్గంలో ఉన్న భోగభాగ్యాలు ఎవ్వరూ ఊహించలేరు.

التفاسير:

external-link copy
49 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
50 : 55

فِیْهِمَا عَیْنٰنِ تَجْرِیٰنِ ۟ۚ

ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.[1] info

[1] ఒక సెలయేరు పేరు తస్ నీమ్, మరొక దాని పేరు సల్ సబీల్.

التفاسير:

external-link copy
51 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
52 : 55

فِیْهِمَا مِنْ كُلِّ فَاكِهَةٍ زَوْجٰنِ ۟ۚ

ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది. info
التفاسير:

external-link copy
53 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
54 : 55

مُتَّكِـِٕیْنَ عَلٰی فُرُشٍ بَطَآىِٕنُهَا مِنْ اِسْتَبْرَقٍ ؕ— وَجَنَا الْجَنَّتَیْنِ دَانٍ ۟ۚ

వారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.[1] info

[1] చూడండి, 18:31.

التفاسير:

external-link copy
55 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
56 : 55

فِیْهِنَّ قٰصِرٰتُ الطَّرْفِ ۙ— لَمْ یَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ۟ۚ

అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.[1] info

[1] చూడండి, 56:35-36, 38:52.

التفاسير:

external-link copy
57 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
58 : 55

كَاَنَّهُنَّ الْیَاقُوْتُ وَالْمَرْجَانُ ۟ۚ

వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు. info
التفاسير:

external-link copy
59 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
60 : 55

هَلْ جَزَآءُ الْاِحْسَانِ اِلَّا الْاِحْسَانُ ۟ۚ

సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా? info
التفاسير:

external-link copy
61 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
62 : 55

وَمِنْ دُوْنِهِمَا جَنَّتٰنِ ۟ۚ

మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి. info
التفاسير:

external-link copy
63 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۙ

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
64 : 55

مُدْهَآمَّتٰنِ ۟ۚ

అవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి. info
التفاسير:

external-link copy
65 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۚ

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
66 : 55

فِیْهِمَا عَیْنٰنِ نَضَّاخَتٰنِ ۟ۚ

ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి. info
التفاسير:

external-link copy
67 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۚ

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
68 : 55

فِیْهِمَا فَاكِهَةٌ وَّنَخْلٌ وَّرُمَّانٌ ۟ۚ

ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి. info
التفاسير:

external-link copy
69 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟ۚ

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
70 : 55

فِیْهِنَّ خَیْرٰتٌ حِسَانٌ ۟ۚ

వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు. info
التفاسير:

external-link copy
71 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
72 : 55

حُوْرٌ مَّقْصُوْرٰتٌ فِی الْخِیَامِ ۟ۚ

నిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.[1] info

[1] చూడండి, 55:56, 52:20, 44:54, 38:52 మరియు 37:48.

التفاسير:

external-link copy
73 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
74 : 55

لَمْ یَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ۟ۚ

ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు. info
التفاسير:

external-link copy
75 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు? info
التفاسير:

external-link copy
76 : 55

مُتَّكِـِٕیْنَ عَلٰی رَفْرَفٍ خُضْرٍ وَّعَبْقَرِیٍّ حِسَانٍ ۟ۚ

వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. info
التفاسير:

external-link copy
77 : 55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?[1] info

[1] ఈ ఆయత్ ఈ సూరహ్ లో 31 సార్లు వచ్చింది. అల్లాహ్ (సు.తా.) ఈ సూరహ్ లో స్వర్గంలో ప్రసాదించబడే అన్ని రకాల సౌకర్యాలను, భోగభాగ్యాలను వివరించిన తరువాత ఈ ప్రశ్న వేశాడు. అంకే కాక నరక శిక్ష తరువాత కూడా ఈ ప్రశ్న వేశాడు. అంటే మీరు దాని నుండి ఎందుకు తప్పించుకోవటానికి ప్రయత్నించరు? అని అర్థం. రెండవది: ఏమిటంటే, జిన్నాతులు కూడా మానవుల వలే బుద్ధి మరియు మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణాశక్తి కలిగి ఉన్నారు. కావున వారు కూడా ఏక దైవారాధన చేయటానికి ఆజ్ఞాపించబడ్డారు. సర్వసృష్టిలో కేవలం ఈ రెండురకాల జీవులు మాత్రమే - బుద్ధి మరియు విచక్షణాశక్తి ప్రసాదించబడటం వల్ల - పరీక్షకు గురిచేయబడ్డారు. అందులో నెగ్గిన వారికి స్వర్గం మరియు నెగ్గని వారికి నరకం. మూడవది: అల్లాహ్ (సు.తా.) ప్రసాదించిన సుఖసంతోషాలను అనుభవించటం ముస్త'హాబ్. ఈ ఆయత్ మళ్ళీ మళ్ళీ చెప్పే నాలుగవ ఉద్దేశ్యం: అల్లాహ్ కు అవిధేయులై ఉండటం నుండి ఆపటం. ఎందుకంటే ఆయనే (సు.తా.) ఈ అనుగ్రహాలన్నింటినీ ప్రసాదించాడు. కావున దైవప్రవక్త ('స'అస) దీనికి జవాబుగా అన్నారు: 'ఓ మా ప్రభూ! మేము నీ యొక్క ఏ అనుగ్రహాన్ని కూడా నిరాకరించడం లేదు, సర్వస్తోత్రాలకు అర్హుడవు నీవే!'(తిర్మిజీ' - అల్బానీ ప్రమాణీకం).

التفاسير:

external-link copy
78 : 55

تَبٰرَكَ اسْمُ رَبِّكَ ذِی الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟۠

మహిమాన్వితుడు మరియు పరమ దాత[1] అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.[2] info

[1] చూడండి, 55:27 వ్యాఖ్యానం 2.
[2] తబారక, బరకతున్: అంటే ఎల్లప్పుడు శాశ్వతంగా ఉండే మేలు. ఆయన దగ్గర ఎల్లప్పుడు మేలే ఉంది. కొందరు దీని అర్థం, ఎంతో శుభదాయకమైనది, సర్వశ్రేష్ఠమైనది అని అన్నారు. ఆయన పేరే ఇంత శ్రేష్ఠమనదైతే ఆయన స్వయంగా ఎంత గొప్పవాడు, మహిమగలవాడు మరియు శుభాలను ప్రసాదించేవాడు కాగలడు!

التفاسير: