ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
68 : 39

وَنُفِخَ فِی الصُّوْرِ فَصَعِقَ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ ؕ— ثُمَّ نُفِخَ فِیْهِ اُخْرٰی فَاِذَا هُمْ قِیَامٌ یَّنْظُرُوْنَ ۟

మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. [1] info

[1] రెండవసారి ఊదబడే బాకాకై చూడండి, 37:19. అబూ-హురైరహ్ కథనం. దైవప్రవక్త ('స'అస) అన్నారు : "రెండవ బాకా ఊదబడిన తరువాత, నేనే అందరి కంటే ముందు తలెత్తి చూస్తాను. అప్పుడు మూసా ('అ.స.) 'అర్ష్ ను పట్టుకొని ఉంటారు. అతను ('అ.స.) ఆ స్థితిలో మొదటి నుండే ఉన్నారా లేక రెండవ బాకా ఊదబడిన తరువాతనా అనేది, నాకు తెలియదు." ('స'హీ'హ్ బు'ఖారీ పు. 6 'హ. నం. 337).

التفاسير:

external-link copy
69 : 39

وَاَشْرَقَتِ الْاَرْضُ بِنُوْرِ رَبِّهَا وَوُضِعَ الْكِتٰبُ وَجِایْٓءَ بِالنَّبِیّٖنَ وَالشُّهَدَآءِ وَقُضِیَ بَیْنَهُمْ بِالْحَقِّ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟

మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది [1] మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, [2] ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. [3] మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు. info

[1] చూడండి, 14:48. "పునరుత్థాన దినమున ఈ భూమి మరొక భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశాలు కూడా." ఇంకా చూడండి 20:105-107.
[2] చూడండి 17:13-14 మరియు 18:49.
[3] చూడండి 6:130, 17:14, 24:24, 36:65 మరియు 41:20 వీటన్నింటిలో మానవుని అవయవాలు, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయని ఉంది. ఇక 4:41 లో ప్రవక్తలందరూ తమ తమ సమాజం వారికి సాక్ష్యులుగా ఉంటారని ఉంది.

التفاسير:

external-link copy
70 : 39

وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ اَعْلَمُ بِمَا یَفْعَلُوْنَ ۟۠

మరియు ప్రతి వ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. [1] ఎందుకంటే వారు చేస్తున్న దంతా ఆయనకు బాగా తెలుసు. info

[1] చూడండి, 99:7-8.

التفاسير:

external-link copy
71 : 39

وَسِیْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی جَهَنَّمَ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا فُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ یَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ یَتْلُوْنَ عَلَیْكُمْ اٰیٰتِ رَبِّكُمْ وَیُنْذِرُوْنَكُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا ؕ— قَالُوْا بَلٰی وَلٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَی الْكٰفِرِیْنَ ۟

సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువబడతాయి మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు: "ఏమీ? మీలో నుండి, మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశహరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈనాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా?" వారంటారు: "అవును (హెచ్చరించారు)!" కాని (అప్పటికే) సత్యతిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది. [1] info

[1] చూడండి, 67:8-10 చూడండి,.

التفاسير:

external-link copy
72 : 39

قِیْلَ ادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟

వారితో ఇలా అనబడుతుంది: "నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది!" info
التفاسير:

external-link copy
73 : 39

وَسِیْقَ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ اِلَی الْجَنَّةِ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا وَفُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلٰمٌ عَلَیْكُمْ طِبْتُمْ فَادْخُلُوْهَا خٰلِدِیْنَ ۟

మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి [1] మరియు దాని రక్షకులు వారితో అంటారు: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి!" info

[1] చూడండి, 38:50 స్వర్గానికి ఎనిమిది ద్వారాలున్నాయి. వాటిలో ఒకటి 'రయ్యాన్' దాని గుండా ఉపవాసాలు ఉండే వారు ప్రవేశిస్తారు. ('స'హీ'హ్ బు'ఖారీ, నం. 2257, ముస్లిం నం. 808) ఇతర ద్వారాలకు కూడా పేర్లున్నాయి. బాబ్ అ'స్సలాహ్, బాబ్ అ'స్సదఖహ్, బాబ్ అజ్జిహాద్ మొదలైనవి ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).

التفاسير:

external-link copy
74 : 39

وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ صَدَقَنَا وَعْدَهٗ وَاَوْرَثَنَا الْاَرْضَ نَتَبَوَّاُ مِنَ الْجَنَّةِ حَیْثُ نَشَآءُ ۚ— فَنِعْمَ اَجْرُ الْعٰمِلِیْنَ ۟

మరియు వారంటారు: "మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది!" info
التفاسير: