[1] అల్లాహ్ (సు.తా.) చివరకు అయ్యూబ్ ('అ.స.) ప్రార్థనను అంగీకరించి అతని రోగాన్ని దూరం చేశాడు. మరియు అతను కోల్పోయిన ధనాన్ని, సంతానాన్ని తిరిగి ఇచ్చాడు. అంతేగాక అతనికి రెండింతలు అధికంగా ప్రసాదించాడు.
[1] రోగపీడుతుడుగా ఉన్న కాలంలో అయ్యూబ్ ('అ.స.) కోపంతో తన భార్యను - ఆమె తెలియకుండా చేసిన ఒక అపరాధానికి క్రోధితుడై - నూరు కొరడా దెబ్బలు కొడతానని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం పూర్తి చేయటానికి అల్లాహ్ (సు.తా.) అతనితో నూరు పుల్లల కట్టతో ఒకసారి నీ భార్యను కొట్టి నీ ప్రమాణం పూర్తి చేసుకో అని ఆదేశిస్తాడు. చూడండి, 5:89. ఈ ఆజ్ఞ కేవలం అయ్యూబ్ ('అ.స.) కొరకేనా, లేక అందరి కొరకా అనే విషయంలో వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. కొందరు అంటారు : ఒకవేళ మొదట ప్రమాణం చేసినప్పుడు కఠినంగా శిక్షించదలిచే అభిప్రాయం లేకుంటే ఇలా చేయవచ్చు, (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఒక 'హదీస్' ద్వారా తెలుస్తోంది : ఒకసారి దైవప్రవక్త ('స'అస) ఒక బలహీనుడైన వ్యభిచారికి, నూరు కొరడా దెబ్బలకు బదులుగా నూరు పుల్లల్లున్న చీపురు కట్టతో ఒకేసారి కొట్టి వదిలారు (ముస్నద్ అ'హ్మద్, 5/222, ఇబ్నె మాజా).
[1] అల్-యస'అ (Elisha 'అ.స.), ఇల్యాస్ (Elijah, 'అ.స.) తరువాత వచ్చిన ప్రవక్త. యస'అ, 'అరబ్బీ పదం కాదు. జు'ల్-కిఫ్ల్ కొరకు చూడండి, 21:85.
[1] ఇలాంటి వివరణ ఖుర్ఆన్ లో మూడు సార్లు వచ్చింది. ఇక్కడ, 37:48 మరియు 55:56లలో. ఇంకా చూడండి, 4:124, 16:97 మరియు 40:40 9:72 విశ్వసించి సత్కార్యాలు చేసే వారంతా (పురుషులు, స్త్రీలు) స్వర్గవాసులవుతారు. కావున ప్రతి పురుషునికి శీలవతి, విశ్వాసురాలైన తన భార్య స్వర్గంలో సహవాసి ( 'జౌజ)గా ఉంటుంది. ఇంకా చూడండి, 36:56: 'వారు మరియు వారి సహవాసులు (అ'జ్వాజ్), చల్లని నీడలలో, ఆసనాల మీద ఆనుకొని హాయిగా కూర్చొని ఉంటారు.'