[1] ఈ బలి ఒక గొర్రె. అది ఇస్మా'యీల్ ('అ.స.) కు బదులుగా పంపబడింది. అది బలి చేయబడింది. దీని జ్ఞాపకార్థమే ముస్లింలు ప్రతి సంవత్సరం జు'ల్ 'హజ్ లో బలి (ఖుర్బానీ) ఇస్తారు. వివరాల కోసం చూడండి, 22:27-37 మరియు 2:196-203.
[1] ఒక కుమారుణ్ణి జి'బహ్ చేసిన గాథ తరువాత మరొక కుమారుని, ఇ'స్హాఖ్ ('అ.స.) యొక్క శుభవార్త ఇవ్వబుడుతోంది. దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే జి'బహ్ చేయబడిన కుమారుడు ఇస్మాయీల్ ('అ.స.) మాత్రమే. అప్పుడత ('అ.స.) ను ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఏకైక పుత్రుడు. (చూడండి, ఇబ్నె-కసీ'ర్ మరియు ఫ'తహ్ అల్-ఖదీర్).
[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, ఇ'స్హాఖ్ ('అ.స.) పుట్టక ముందే, ఇబ్రాహీమ్ ('అ.స.) తన రెండవ భార్య హాజర్ మరియు ఆమె కుమారుడు ఇస్మా'యీల్ ('అలైహిమ్ స.) లను మక్కాలో వదిలారు. ఇస్మా'యీల్ ('అ.స.) అక్కడ జుర్హుమ్ అనే 'అరబ్బు తెగ స్త్రీతో వివాహం చేసుకొని అక్కడే నివసిస్తూ 'అరబ్బులలో కలిసిపోయి 'అరబ్బు అయిపోయారు. అతని వంశంలో నుండి కేవలం ము'హమ్మద్ ('స'అస) మాత్రమే ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు.
ఇర ఇస్హా'ఖ్ ('అ.స.) కుమారుడు య'అఖూబ్ ('అ.స.) అతని మరొకపేరు ఇస్రాయీ'ల్. అదే పేరుతో అతని కుటుంబం వారు బనీ-ఇస్రాయీ'ల్ అనబడ్డారు. అతనికి 12 మంది కుమారులు. ప్రతి కుమారుని సంతతి నుండి ఒక బనీ-ఇస్రాయీ'ల్ తెగ ఏర్పడింది. యూసుఫ్ ('అ.స.) ఆ పన్నెండు కుమారులలో ఒకరు. బనీ-ఇస్రాయీ'ల్ సంతతిలో నుండి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్ స.) లు కూడా వారి సంతతిలోని వారే!
ఈ రెండు ప్రవక్తల సంతతిలో మంచి వారు పుట్టారు. ముష్రికులు కూడా పుట్టారు. కావున కేవలం తండ్రి తాతలు పుణ్యపురుషులు అయినంత మాత్రాన సంతానంలో అందరూ పుణ్యవంతులవటం తప్పనిసరి కాదు!
[1] ఇల్యాస్ (Elijah) ('అ.స.) హారూన్ ('అ.స.) సంతతి చెందిన వారు. అతని నివాసం బఅల్బక్ నగరం. ఇల్యాస్ (ఏలియా) హిబ్రూ (యూదుల) ప్రవక్త. ఇతను ఫలస్తీన్ ఉత్తర భాగంలో అహబ్ మరియు అహాజియా రాజుల కాలంలో ఉన్నారు, (దాదాపు క్రీ.శకానికి 9 సంవత్సరాలకు ముందు) ఇతని తరువాత అల్-యస'అ (Elisha,'అ.స.) ప్రవక్తగా వచ్చారు.