[1] ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి వారికే మార్గదర్శకత్వం లభిస్తుంది, ఎవరైతే మార్గదర్శకత్వాన్ని ఆపేక్షిస్తారో! ఇక ఎవరైతే హృదయపూర్వకంగా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వాన్ని అపేక్షించరో ఆయన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. ఇదే సున్నతుల్లాహ్ - అల్లాహ్ (సు.తా.) సంప్రదాయం. ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడుల మధ్య విచక్షణా జ్ఞాననాన్నొసంగి; విశ్వసించి, మంచి పనులు చేసేవారికి స్వర్గం మరియు చెడుదారి పట్టేవారికి నరకం, అని వ్యక్తం చేశాడు. మరియు ప్రతి యుగం వారికి, అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే ఆరాధించమని మరియు మంచిని చేయమని ఆదేశించటానికి, చెడునుండి నివారించటానికి మార్గదర్శకులుగా ప్రవక్తలను పంపి, వారి వద్దకు దివ్యజ్ఞానం (వ'హీ) పంపుతూ వచ్చాడు. చూడండి, 14:4 మరియు 2:7.