ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
42 : 30

قُلْ سِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلُ ؕ— كَانَ اَكْثَرُهُمْ مُّشْرِكِیْنَ ۟

వారితో ఇలా అను: "భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో! వారిలో చాలా మంది బహుదైవారాధకు లుండిరి." info
التفاسير:

external-link copy
43 : 30

فَاَقِمْ وَجْهَكَ لِلدِّیْنِ الْقَیِّمِ مِنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا مَرَدَّ لَهٗ مِنَ اللّٰهِ یَوْمَىِٕذٍ یَّصَّدَّعُوْنَ ۟

కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు[1] - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు.[2] info

[1] అల్లాహ్ (సు.తా.) దృష్టిలో సత్యధర్మం: అంటే అల్లాహ్ (సు.తా.) కు దాస్యం - తనను తాను అల్లాహ్ (సు.తా.) అభీష్టానికి అప్పగించడం (ఇస్లాం) - మాత్రమే. చూడండి, 3:19.
[2] ఒకటి విశ్వాసులది, రెండవది సత్యతిరస్కారులది.

التفاسير:

external-link copy
44 : 30

مَنْ كَفَرَ فَعَلَیْهِ كُفْرُهٗ ۚ— وَمَنْ عَمِلَ صَالِحًا فَلِاَنْفُسِهِمْ یَمْهَدُوْنَ ۟ۙ

సత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే (సాఫల్యమార్గాన్ని) తయారు చేసుకుంటారు. info
التفاسير:

external-link copy
45 : 30

لِیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصَّلِحٰتِ مِنْ فَضْلِهٖ ؕ— اِنَّهٗ لَا یُحِبُّ الْكٰفِرِیْنَ ۟

ఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి.[1] నిశ్చయంగా, ఆయన సత్యతిరస్కారులను ప్రేమించడు. info

[1] స్వర్గం పొందటానికి కేవలం విశ్వసించి సత్కార్యాలు చేయటమే సరిపోదు. దానికి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం కూడా ఉండాలి. ఆయనయే సత్కార్యాల ప్రతిఫలాన్ని ఎన్నోరెట్లు అధికం చేసి ఇస్తాడు.

التفاسير:

external-link copy
46 : 30

وَمِنْ اٰیٰتِهٖۤ اَنْ یُّرْسِلَ الرِّیٰحَ مُبَشِّرٰتٍ وَّلِیُذِیْقَكُمْ مِّنْ رَّحْمَتِهٖ وَلِتَجْرِیَ الْفُلْكُ بِاَمْرِهٖ وَلِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

ఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి, మిమ్మల్ని ఆయన అనుగ్రహాన్ని అన్వేషించనివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని! info
التفاسير:

external-link copy
47 : 30

وَلَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ رُسُلًا اِلٰى قَوْمِهِمْ فَجَآءُوْهُمْ بِالْبَیِّنٰتِ فَانْتَقَمْنَا مِنَ الَّذِیْنَ اَجْرَمُوْا ؕ— وَكَانَ حَقًّا عَلَیْنَا نَصْرُ الْمُؤْمِنِیْنَ ۟

మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు పంపాము.[1] వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసిన వారికి తగిన ప్రతీకారం[2] చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం. info

[1] చూడండి, 10:74.
[2] అల్-ముంతఖిమ్ (సేకరించబడిన పదం): Retributor, Avenger of evil, ప్రతీకారం తీర్చుకునే, ప్రతీకారం చేసే, దుష్టులను శిక్షించేవాడు. చూడండి, 32:22.

التفاسير:

external-link copy
48 : 30

اَللّٰهُ الَّذِیْ یُرْسِلُ الرِّیٰحَ فَتُثِیْرُ سَحَابًا فَیَبْسُطُهٗ فِی السَّمَآءِ كَیْفَ یَشَآءُ وَیَجْعَلُهٗ كِسَفًا فَتَرَی الْوَدْقَ یَخْرُجُ مِنْ خِلٰلِهٖ ۚ— فَاِذَاۤ اَصَابَ بِهٖ مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖۤ اِذَا هُمْ یَسْتَبْشِرُوْنَ ۟

అల్లాహ్ యే గాలులను పంపేవాడు, కావున అవి మేఘాలను పైకి ఎత్తుతాయి, ఆ తరువాత ఆయన వాటిని తాను కోరినట్లు ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. మరియు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, తరువాత వాటి మధ్య నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దానిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించగా వారు సంతోషపడతారు! info
التفاسير:

external-link copy
49 : 30

وَاِنْ كَانُوْا مِنْ قَبْلِ اَنْ یُّنَزَّلَ عَلَیْهِمْ مِّنْ قَبْلِهٖ لَمُبْلِسِیْنَ ۟

మరియు వాస్తవానికి, అది (వర్షం) కురవక ముందు వారు ఎంతో నిరాశ చెంది ఉండేవారు. info
التفاسير:

external-link copy
50 : 30

فَانْظُرْ اِلٰۤی اٰثٰرِ رَحْمَتِ اللّٰهِ كَیْفَ یُحْیِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ— اِنَّ ذٰلِكَ لَمُحْیِ الْمَوْتٰى ۚ— وَهُوَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

కావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు. info
التفاسير: