ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
18 : 23

وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ فَاَسْكَنّٰهُ فِی الْاَرْضِ ۖۗ— وَاِنَّا عَلٰی ذَهَابٍ بِهٖ لَقٰدِرُوْنَ ۟ۚ

మరియు మేము ఆకాశం నుండి ఒక పరిమాణంతో వర్షాన్ని (నీటిని) కురిపించాము, పిదప దానిని భూమిలో నిలువ జేశాము. మరియు నిశ్చయంగా, దానిని వెనక్కి తీసుకునే శక్తి మాకుంది. info
التفاسير:

external-link copy
19 : 23

فَاَنْشَاْنَا لَكُمْ بِهٖ جَنّٰتٍ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ ۘ— لَكُمْ فِیْهَا فَوَاكِهُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ

తరువాత దాని ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్షతోటలను ఉత్పత్తి చేశాము; అందులో మీకు ఎన్నో ఫలాలు దొరుకుతాయి. మరియు వాటి నుండి మీరు తింటారు. info
التفاسير:

external-link copy
20 : 23

وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُوْرِ سَیْنَآءَ تَنْۢبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْاٰكِلِیْنَ ۟

మరియు సినాయి కొండ ప్రాంతంలో ఒక వృక్షం పెరుగుతున్నది. అది నూనె ఇస్తుంది మరియు (దాని ఫలం) తినేవారికి రుచికరమైన (కూరగా) ఉపయోగపడుతుంది.[1] info

[1] ఇది 'జైతూన్ వృక్షం.

التفاسير:

external-link copy
21 : 23

وَاِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ— نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَلَكُمْ فِیْهَا مَنَافِعُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ

మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపుతున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు. info
التفاسير:

external-link copy
22 : 23

وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟۠

మరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారీ చేస్తారు. info
التفاسير:

external-link copy
23 : 23

وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟

మరియు వాస్తవానికి మేము నూహ్ ను తన జాతి ప్రజల వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! ఏమీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండరా?" info
التفاسير:

external-link copy
24 : 23

فَقَالَ الْمَلَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یُرِیْدُ اَنْ یَّتَفَضَّلَ عَلَیْكُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً ۖۚ— مَّا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآىِٕنَا الْاَوَّلِیْنَ ۟ۚۖ

అతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాతముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే!"[1] info

[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48.

التفاسير:

external-link copy
25 : 23

اِنْ هُوَ اِلَّا رَجُلٌۢ بِهٖ جِنَّةٌ فَتَرَبَّصُوْا بِهٖ حَتّٰی حِیْنٍ ۟

"ఇతడు కేవలం పిచ్చి పట్టిన మనిషి కావున కొంత కాలం ఇతనిని సహించండి." info
التفاسير:

external-link copy
26 : 23

قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟

(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."[1] info

[1] చూడండి, 54:10

التفاسير:

external-link copy
27 : 23

فَاَوْحَیْنَاۤ اِلَیْهِ اَنِ اصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَوَحْیِنَا فَاِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ ۙ— فَاسْلُكْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ مِنْهُمْ ۚ— وَلَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ— اِنَّهُمْ مُّغْرَقُوْنَ ۟

కావున మేము అతనికి ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వహీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు)[1], ఆ నావలో ప్రతిరకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరివారపు వారిని ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవి చేయకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు." info

[1] ఫారత్తన్నూరు: కొందరు వ్యాఖ్యాతలు దీనిని భూమి ప్రతిభాగం నుండి నీటి ఊటలు ఉబికి రావటం, అని అన్నారు.

التفاسير: