ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

external-link copy
117 : 20

فَقُلْنَا یٰۤاٰدَمُ اِنَّ هٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا یُخْرِجَنَّكُمَا مِنَ الْجَنَّةِ فَتَشْقٰی ۟

అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు.[1] info

[1] తష్ఖా: అంటే ప్రయాస, కష్టం, కఠినం. ఏమిటంటే, స్వర్గంలో మానవుని అత్యవసర వసతులు అంటే ఆహారపానీయాలు, వస్త్రాలు మరియు నివాసం అన్నీ కోరిన వెంటనే లభిస్తాయి. వాటి కొరకు కష్టపడే అవసరం వుండదు. కాని, ఇహలోకంలో వాటి కొరకు మానవుడు ప్రయాస పడుతూ వుంటాడు. అదే దీని అర్థం.

التفاسير: