[1] సూరహ్ (అధ్యాయం) ప్రారంభంలో ప్రస్తావించబడిన ఈ విడి విడి అక్షరాలు ఖున్ఆన్ యొక్క అద్భుత స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఇది బహుదైవారాధకుల ముందు పెట్టబడిన ఒక గొప్ప సవాలు, మరియు అరబ్బుల భాషలో ఈ అక్షరాలు ఉన్నప్పటికీ వారు ఈ విడి విడి అక్షరాలు ఇలా ప్రసావించబడటాన్ని వ్యతిరేకించ లేకపోయారు. అరబ్బులు ఆనాటి ప్రజలలో అత్యంత వాగ్ధాటి కలిగి ఉన్నప్పటికీ, వారు వీటికి సమానమైన దానిని తీసుకు రాలేకపోయారు. ఇది ఖుర్ఆన్ అల్లాహ్ నుండి అవతరించబడిన ఒక దివ్యావతరణ అని నిరూపిస్తున్నది.
[1] 'గైబున్: అగోచర యథార్థం, అంటే మానవ ఇంద్రియాలకు మరియు జ్ఞానానికి గోప్యంగా ఉన్న సత్యాలు. అంటే అల్లాహ్ (సు.తా.) ను దైవదూత ('అ.స.)లను, పునరుత్థానదినాన్ని, స్వర్గనరకాలను మొదలైన వాటిని విశ్వసించటం. [2] నమాజ్' స్థాపించడం అంటే, ప్రతిదినము ఐదుసార్లు నిర్ణీత సమయాలలో అల్లాహ్ (సు.తా.), దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) కు నేర్పిన విధంగా నమాజ్' చేయడం. ('స'హీ'హ్ బు'ఖారీ, పు-1, 'హదీస్' నం. 702, 703, 704, 723, 786, 787). [3] ''జకాతున్: అంటే, ఒక సంవత్సరం వరకు జమ ఉన్న, ధన సంపత్తుల నుండి ప్రతి సంవత్సరం, ఒక ప్రత్యేక శాతం విధిగా ఇవ్వవలసిన దానం. ఇది ఇస్లాం ధర్మంలోని ఐదు విధులలో ఒకటి. 'జకాత్, ముస్లిం సమాజపు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచటానికి, సమాజంలో ఎవ్వడు కూడా నిరాధారంగా లేకుండా ఉండటానికి నియమించబడిన, ఒక ఉత్తమమైన ధార్మిక మరియు సాంఘిక నియమం, ('స'హీ'హ్ బు'ఖారీ, పు. 2, అధ్యాయం-24).
[1] 'అబ్దుల్లాహ్ ఇబ్నె-'ఉమర్ (ర'ది.'అ.) కథనం, మహాప్రవక్త )'స'అస) ప్రవచనం: "ఇస్లాం ఈ ఐదు ప్రధాన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. అవి: '1. అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు మరియు ము'హమ్మద్ ('స'అస), అల్లాహుతా'ఆలా యొక్క ప్రవక్త అనే దృఢవిశ్వాసం ప్రకటించటం, 2. రోజుకు ఐదుసార్లు విధిగా నమాజ్' చేయటం, 3. విధిదానం ('జకాత్) చెల్లించటం, 4. రమ'దాన్ నెలలో ఉపవాసముండటం, 5. శారీరక మరియు ఆర్థిక స్తోమత ఉంటే జీవితంలో ఒకసారి 'హజ్ చేయటం.' '' ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-1, 'హదీస్' నెం.7).
[1] ఇది సత్యతిరస్కారానికి ఫలితంగా, అల్లాహుతా'ఆలా బలవంతంగా ఎవరిని కూడా తప్పుదారిలో వేయడు, (చూడండి, 2:26 వ్యాఖ్యానం 1)
[1] అంటే సత్యాన్ని నమ్మలేకపోవటం మరియు దుర్భుద్ధి.
[1] మస'లున్: అంటే ఉపమానం, పోలిక, సాదృశ్యం, దృష్టాంతం అనే అర్థాలున్నాలు. [2] 'అబ్దుల్లాహ్ బిన్-మస్'ఊద్ (ర'ది. 'అ.) కథనం (ఫ'త్హ్ అల్-ఖదీర్): మహాప్రవక్త ('స'అస), మదీనాకు వచ్చిన తరువాత విశ్వసించిన వారిలో కొందరు కాపట్యానికి లోనవుతారు. అంటే వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత దానిని విడిచి మరల అంధకారంలో చిక్కుకు పోతారు. ఆ విషయం ఈ విధంగా బోధించబడింది. ఒక వ్యక్తి రాత్రిలో ఎడారిలో మంట వెలిగించి కాపుకుంటాడు. అది వారి పరిసరాలను వెలిగిస్తుంది. కాని ఆ అగ్ని ఆరి పోగానే వారు మళ్ళీ అంధకారంలో చిక్కు కుంటారు. ఏమీ చూడ లేక పోతారు. అదే విధంగా బాహ్యంగా మాత్రమే ఇస్లాం స్వీకరించిన వారి హృదయాలు అంధకారంలో ఉండి పోతాయి. వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత కూడా అంధకారంలోనే ఉండి పోతారు.
[1] ముహీతున్: One Who Econpasseth, Encloseth, Surroundeth. సర్వాన్ని పరివేష్టించి ఆవరించి, చుట్టుముట్టి ఉన్నవాడు, ఆయన జ్ఞానపరిరిధికీ శక్థికీ వెలుపల ఏదీ లేదు. చూడండి, 85:20.
[1] అల్లాహుతా 'ఆలా తలుచుకుంటే ఎప్పుడైనా తాను ప్రసాదించే అనుగ్రహాలను ఆపుకోవచ్చు! కావున మానవులు ఎల్లప్పుడు అల్లాహుతా 'ఆలా యందే భయభక్తులు కలిగి వుండి, ఆయన శిక్షకూ, ప్రతీకారానికీ భయపడుతూ ఉండాలి. [2] అలా కుల్లి ,షయ్ఇ'న్ ఖదీర్: ఈ వాక్యాన్ని కొందరు: "అన్నింటిపై అధికారం (ఆధిపత్యం) గలవాడు." అని కూడా అనువదించారు.
[1] ల'అల్లకుమ్ తత్తఖూన్: దీనికి ము'హమ్మద్ జూనాగఢి గారు ఇలా తాత్పర్యమిచ్చారు: "తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు."
[1] మిమ్మల్ని మరియు సర్వసృష్టిని సృష్టించినవాడు అల్లాహ్ (సు.తా.) యే! మీకు జీవనోపాధిని సమకూర్చేవాడు కూడా ఆయనయే. అలాంటప్పుడు ఆయనను వదలి మీరు ఇతరులను ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా ఎందుకు నిలబెడుతున్నారు? మీరు ఆయన శిక్ష నుండి తప్పించు కోవాలనుకుంటే! కేవలం ఆయననే ఆరాధించండి, ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ. నం. 4)
[1] ఈ విధమైన ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మనే ప్రశ్న రెండు చోట్లలో ఇక్కడ మరియు 10:38 లలో ఉంది. 11:13లో పది సూరాహ్ లు రచించి తెమ్మనీ మరియు 17:88, 52:34లలో ఇట్టి గ్రంథాన్ని రచించి తెమ్మనీ ఉంది. ఈ దివ్యఖుర్ఆన్ అల్లాహుతా 'ఆలా దగ్గరి నుండి అవతరింప జేయబడింది, కాబట్టి ఎవ్వరు కూడా ఇంత వరకు ఈ ఛాలెంజీని ఎదుర్కోలేక పోయారు.
[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది. 'అ.) కథనం: "మీరు మరియు మీరు ఆరాధించే రాళ్ళ దేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతారు." చూడండి, 21:98.
[1] ఫాసిఖున్: అంటే దైవవిధేయతా హద్దులను అతిక్రమించిన వాడు (అవిధేయుడు), మార్గభ్రష్టుడు, దుష్టుడు, దుర్జనుడు, భక్తి లేని వాడు అనే అర్థాలున్నాయి. "ఎవడు ఏ వైపునకు పోదలచు కుంటాడో మేము అతనిని ఆ వైపునకే మరల్చుతాము." చూడండి, 4:115. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడులను తెలుసుకునే విచక్షణా శక్తీ, బుద్ధీ ఇచ్చాడు. కాబట్టి, వారికి పరలోక జీవితంలో, వారి కర్మల ప్రకారం, స్వర్గ/నరకాలు ఉన్నాయి. అల్లాహుతా' ఆలా ప్రవక్తల మరియు దివ్యగ్రంథాల ద్వారా వారికి సత్యాసత్యాలను, మంచి / చెడులను బోధించాడు. వాటిని అనుసరించటం వల్ల పొందే పరలోక ప్రతిఫలాలను (స్వర్గ / నరకాలను) కూడా విశదం చేశాడు. కావున వారిని మంచి / చెడు మార్గాలను అనుసరించటానికి బలవంతం చేయడు. వారిని వారి మార్గాలలో వదలి పెడతాడు. అల్లాహ్ (సు.తా.) కు జరిగిపోయింది, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అంతా తెలుసు కాబట్టి ఎవరు నరకవాసులు కానున్నారో మరియు ఎవరు స్వర్గవాసులు కానున్నారో కూడా తెలుసు. ఇదంతా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా పేర్కొనబడింది. అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా బలవంతంగా నరకంలోకి త్రోయడు. వారి కర్మలే, వారిని దానికి అర్హులుగా చేస్తాయి. ఇలాంటి వాక్యం ఖుర్ఆన్ లో అనేక సార్లు వచ్చింది. ప్రతి చోటా దీని తాత్పర్యం ఇదే.
[1] 'అహ్ దుల్లాహి: అంటే ఆదమ్ ('అ.స.)ను సృష్టించే సమయంలో సమస్త మానవజాతి నుంచి అల్లాహుతా 'ఆలా తీసుకున్న ప్రమాణం. అది ఏమిటంటే: అల్లాహ్ (సు.తా.) దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ.
[1] అంటే మీరు ఏమీ లేకున్నపుడు మొదటిసారి సృష్టించబడ్డారు. ఆ తరువాత మీకు ఇవ్వబడిన గడువు పూర్తి అయిన తరువాత మీరు మరణింపజేయబడి, పునరుత్థాన దినమున మళ్ళీ సజీవులుగా లేపబడతారు. అది మీ రెండవ జీవితం. దానికి అంతముండదు. అందు మీకు, మీరు భూలోకంలో చేసిన కర్మలకు తగిన ప్రతిఫలమివ్వబడుతుంది.
[1] 'ఖలీఫా: అంటే భూమిలో తరతరాలుగా వచ్చే జనపదం, ఉత్తరాధికారి. చూడండి, 6:165, 27:62, 35:39. మానవుడు భూమిలో అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రతినిధి అనటం సరైనది కాదు.
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ.నం. 3.
[1] సుబ్'హానున్: Extolled be his absolute perfection. Hallowed, Exalted, Glirified, సర్వలోపాలకు అతీతుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, పానవుడు, ప్రశంసనీయుడు, శ్లాఘింప, పొగడ, స్తుతింప దగిన వాడు. చూడండి, 2:116, 12:108, 59:23. [2] అల్-'అలీము: The All -knowing, The Omniscient. సర్వజ్ఞుడు, జ్ఞానసంపన్నుడు, సర్వం ఎరిగిన వాడు, జ్ఞానం గల, నేర్పు గల, తన దాసుల ప్రతిమాటనూ, ప్రతి పనినీ, భావాన్నీ, అభిప్రాయాన్నీ, ప్రత్యక్షంగా ఎరిగినవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 2:127. [3] అల్ హకీము: All-Wise, possessing Knowledge or Science, The Omniscient, మహా వివేకవంతుడు, వివేచనాపరుడు. ఈ పేరు దివ్యఖుర్ఆన్ కొరకు కూడా వాడబడుతుంది. అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 59:24
[1] ఇబ్లీస్: అంటే, He Despaired, ఆశ వదులుకొన్న, నిరాశ చెందిన వాడు. ఇది షై'తాన్ పేరు. అతడు జిన్నాతులలోని వాడు. షై'తాన్: He was, or became, distant or remote (from the mercy of Allah) అంటే, అల్లాహ్ (సు.తా.), సానుభూతి, లేక దయ నుండి దూరమై పోయిన వాడు, Rebelious, తిరగబడిన, అవిధేయుడైన, ఎదురు తిరిగిన వాడు, అధికారాన్ని ప్రతిఘటించిన వాడు. [2] సజ్దా: నుదుటితో సహా ఎనిమిది అంగాలను భూమికి ఆనించటం (సాష్టాంగం చేయటం). దీనిలో నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళ వ్రేళ్ళు భూమికి తగులుతూ ఉండాలి. ఇది కేవలం అల్లాహుతా'లా కొరకే ప్రత్యేకించబడింది. ఇక్కడ దైవదూతలు అల్లాహ్ (సు.తా.) ఆదేశాన్ని శిరసావహించటానికే ఆదమ్ ('అస) కు సజ్దా చేశారు. ము'హమ్మద్ ('స'అస) షరీయత్ లో, మానవుడు గౌరవార్థం కూడా ఎవ్వరికీ సజ్దా చేయగూడదు.
[1] ఆ చెట్టు ఏ రకమైనదో ఖుర్ఆన్ మరియు 'హదీస్'లలో పేర్కొనబడలేదు. కాబట్టి దానిని గురించి అనుమానాల పాలు కాగూడదు. ఇంకా చూడండి, 20:120. [2] "జుల్ మున్: Wrong doing, Injustice, Oppression. ఈ పదానికి దుర్మార్గం, అన్యాయం, అధర్మం, అక్రమం, దోషం, అపచారం మొదలైన అర్థాలు ఉన్నాయి.
[1] అంటే ఆదమ్ ('అ.స.) మరియు షై'తాన్ కావచ్చు; లేక మానవులు పరస్పరం (ఒకరికొకరు) విరోధులవుతారని అర్థం కావచ్చు!
[1] ఆదమ్ ('అ.స.) చేసిన దు'ఆ కొరకు చూడండి, 7:23.
[1] ఇస్రాయీ'ల్: హీబ్రూ భాష పదం. 'అరబ్బీలో దీని అర్థం 'అబ్దుల్లాహ్ (అల్లాహ్ దాసుడు). ఇది య'అఖూబ్ ('అ.స.) యొక్క బిరుదు. అతనికి 12 మంది కుమారులు. వారితో 12 తెగలుగా యూదుల సంతతి పెరిగింది. వారిని బనీ ఇస్రాయీ'ల్ (ఇస్రాయీ'ల్ సంతతివారు) అని అంటారు. వారిలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు.
[1] ఆయత్ : Sign, అంటే సూచన, సూక్తి, చిహ్నం, సంకేతం. కొన్ని చోట్లలో అద్భుత సూచన, అద్భుత సంకేతం, అద్భుత నిదర్శనం అనే అర్థాలు వస్తాయి. ఈ అనువాదంలో చాలా వరకు సూచన అనే పదమే వాడబడింది. వీటిని వాక్యాలనటం సరికాదు. ఇవి అల్లాహుతా 'ఆలా సూచనలు. ఆ ఖుర్ఆన్ లోని ఆయతుల సంఖ్య కూఫీ 'ఉలమాలు అనుసరించిన ఇమామ్ అ'ష్షాతబీ యొక్క నా" జిమతు'జ్జుహ్ర్ లో వ్రాసినట్లు ఉంది. అంటే అబీ-'అబ్దుర్రహ్మాన్ 'అబ్దుల్లాహ్ ఇబ్నె 'హబీబ్ అస్సులమీ' అనుసరించిన, అలీ ఇబ్నె అబీ-'తాలిబ్ (ర'ది.'అ) విధానం. దీని ప్రకారం ఈ ఖుర్ఆన్ లోని ఆయతుల సంఖ్య 6236.
[1] చూడండి, ఖుర్ఆన్, 2:76, 101. ఇంకా చూడండి: 'అల్లాహ్ (సు.తా.), మీ సహోదరులలో నుండి ఒక ప్రవక్తను, తెస్తాడు. అప్పుడు మీరు అతనిని అనుసరించాలి.' అని పూర్వ గ్రంథాలలో వ్రాయబడిన సత్యానికి, బైబిల్, ద్వితీయోపదేశ కాండము - (Deuteronomy) 18:15, 18.
[1] రుకూ'ఉ: అంటే నమాజ్ లో అరచేతులను మోకాళ్ళపై పెట్టి వంగడం.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 9, 'హ.నం. 218.
[1] "జన్న: అంటే Imagined, thought, భావించాడు, ఊహించాడు, అనే అర్థాలు ఉన్నాయి. కాని కొన్ని సార్లు, believed, sure నమ్మాడు, విశ్వసించాడు అనే అర్థాలు వస్తాయి.
[1] చూడండి, 20:77-78 మరియు 26:63-66.
[1] చూడండి, 7:142-148, 20:85.
[1] 'అఫవ్నా (అల్-'అఫువ్వు) : Pardoning, Effacing, Erasing, Obliterating, Very Forgiving. మన్నించే, రద్దు చేసే, క్షమించేవాడు. చూడండి, 4:149. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] అల్ బారిఉ': The Maker, నిర్మాత, ఎట్టి పోలిక, సామ్యం లేకుండా ప్రతి దానిని సృజించే వాడు. లేమి నుండి ఉనికిలోకి తెచ్చే వాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ.నం. 5, మన్న - ఒక రకమైన జిగురు మిఠాయి (తీపిగల పదార్థము). సల్వా - ఒక రకమైన పక్షి. (ఫ'త్హ అల్ ఖదీర్).
[1] వారు 'హి'త్తతున్ అనే మాటకు బదులుగా - 'హబ్బ ఫీ ష'అరతిన్ - అని అన్నారు. ( 'స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స'హీ'హ్ ముస్లిం). [2] 'స'హీ'హ్ ముస్లిం, 'హ.నం. 2218, ఆ శిక్ష ఒక భయంకరమైన ప్లేగు రోగం.
[1] బైబిల్ లో మత్తయి సువార్త - (Mathew), 23:34, 35, 37; లూకా - (Luke), 11:51; I థెస్సలోనికయులు - (I Thessalonians), 2:15లు 'జకరియ్యా మరియు ఇతర ప్రవక్త('అ.స.)లను చంపిన సంఘటనకు సాక్ష్యమిస్తున్నాయి.
[1] 'సాబీయీ'న్: ఒక గతించిన సమాజం. వారు ము'సల్ ('ఇరాఖ్)లో నివసించేవారు. "అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు." అని నమ్మేవారు. వారు 'జబూర్ గ్రంథాన్ని చదివే వారని కొందరి అభిప్రాయం. వారు యూదులు గానీ, క్రైస్తవులు గానీ కారు. తరువాత వారి ధర్మంలో కూడా మార్పులు వచ్చాయి. వారు దైవదూతలను మరియు నక్షత్రాలను ఆరాధించసాగారు. వారు తరువాత ఏ ధర్మాన్ని కూడా అనుసరించకుండా ఉండసాగారు. వారు నాస్తికులు (Atheists) అయ్యారని కొందరి అభిప్రాయం. [2] చూడండి 5:69. ఇక్కడ యూదులు, క్రైస్తవులు మరియు 'సాబీయులు, అంటే తమ గ్రంథాలలో ఎట్టి మార్పులు చేయక, వాటి అవతరింప జేయబడిన నిజరూపంలో వాటిని అనుసరించిన వారని అర్థం. మహాప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరి చేతిలోనయితే నా ప్రాణం ఉందో ఆ పరమ పవిత్రుని సాక్షి, నా ఈ సమాజంలో నా మాట విన్న వ్యక్తి, వాడు యూదుడు గానీ, క్రైస్తవుడు గానీ నన్ను (నా ధర్మాన్ని) విశ్వసించకపోతే! అతడు నరకవాసి అవుతాడు." (స'హీ'హ్ ముస్లిం). అంటే ము'హమ్మద్ ('స.అస) తరువాత, ఇస్లాం తప్ప మరొక ధర్మాన్ని అల్లాహ్ (సు.తా.) సమ్మతించడు. ఇక్కడ మరొక విషయం స్పష్టమయ్యేది ఏమిటంటే 'స'హీ 'హ్ 'హదీసు'లను విడిచి ఖుర్ఆన్ ను సరిగ్గా అర్థం చేసుకోవటం అసాధ్యం, ('తబరీ, పు-1, పేజీ - 323). చూ. 3:19, 3:85.
[1] యూదులకు శనివారం (సబ్ త్) రోజున చేపలు పట్టటం నిషేధించబడింది. వారు ఆ శాసనాన్ని ఉల్లంఘించటం వలన: 'నీచులైన కోతులు కండి.' అని శపించ బడ్డారు. చూడండి, 5:60, 7:166.
[1] ఇస్రాయీ'ల్ సంతతి వారిలో ఒక ధనవంతుడు - ఒకే ఒక్క వారసునిగా ఉన్న - అతని సోదరుని కుమారుణ్ణి హత్య చేసి, శవాన్ని ఇతరుని ఇంటి ముందు వేస్తాడు. ఉదయం ఆ యిద్దరి మధ్య వాదులాట జరుగుతుంది. పరిష్కారానికి వారు మూసా ('అ.స.) దగ్గరికి వస్తారు. అతను వారిని ఒక ఆవును బలి ఇచ్చి దాని మాంసపు ముక్కతో ఆ మృతుని శరీరాన్ని కొడితే, అతడు తన హతుణ్ణి చూపిస్తాడంటారు. ఎంతో వాదులాడిన తరువాత వారు ఈ విధంగా చేస్తారు. ఆ మృతుడు లేచి హతుణ్ణి చూపించి తిరిగి మరణిస్తాడు (ఫ'త్హ అల్-ఖదీర్).
[1] వారికి మొదట ఒక ఆవును బలి చేయమని మాత్రమే ఆజ్ఞ ఇవ్వబడింది. కాబట్టి వారు ఏదో ఒక ఆవును బలిచేసి ఉంటే, అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ నెరవేరేది. కానీ వారలా చేయక వివిధ రకాల ప్రశ్నలడగసాగారు. కావున అల్లాహుతా'ఆలా వారి సమస్యలను పెంచాడు. దానితో వారికి ఆవును కనుగొనటంలో కష్టం కలిగింది. కావున ధర్మవిషయాలలో కఠిన విధానాన్ని అనుసరించటం నిషేధించబడింది.
[1] పైన పేర్కొన్న ఆవు బలి ఈ వ్యక్తి మరణం వల్లనే సంభవించింది. దీని భావం ఏమిటంటే, మంచీ, చెడూ ఏ కార్యమైనా అది బయట పడక తప్పదు. కావున ప్రతి ఒక్కడు ఎల్లప్పుడు మంచి కార్యాలే చేయాలి. చేసిన చెడు బయటబడితే అవమానం తప్పదు.
[1] చూడండి, 57:16 మరియు 17:44.
[1] 'అబ్దుల్లాహ్ బిన్- 'అమ్ర్ బిన్ అల్-'అసాస్ (ర.ది.'అ.), కథనం ఆదారంగా - 'అతా బిన్-యాసిర్ (ర'ది. 'అ.) వివరించిన - వారి గ్రంథం (తౌరాత్)లో రాబోయే ప్రవక్త ము'హమ్మద్ ('స 'అస) ను గురించి ఇవ్వబడిన లక్షణాల వివరాలకు చూడండి, ('స. బు'ఖారీ, పుస్తకం-3, 'హ.నం. 335) ఇంకా చూడండి, 2:42, 101.
[1] మిస్కీన్: నిత్యావసరాలకు తగినంత ఆదాయం లేకున్నా యాచించని పేదవాడు. ఫఖీర్: ఆదాయం లేనందుకు విధి లేక యాచించే నిరుపేదలు.
[1] ఇస్లాంకు ముందు మదీనాలో ముష్రిక్ అన్సార్లలో రెండు తెగలుండేవి: 1) 'ఔస్, 2) 'ఖ'జ్ రజ్ మరియు యూదులలో మూడు: 1) బనూ - ఖైనుఖా'అ, 2) బనూ-న'దీర్, 3) బనూ - ఖురై"జహ్. 1. బనూ - ఖురై"జహ్ - 'ఔస్ వారి సమర్థీకు('హలీఫ్)లు. 2. బనూ - ఖైనుఖా'అ మరియు బనూ - న'దీర్ - 'ఖ'జ్ రజ్ వారి సమర్థీకు('హలీఫ్)లు. వీరి మధ్య శత్రుత్వం వల్ల యుద్ధాలు జరిగినపుడు వీరు (యూదులు) తమ జాతి సోదరులైన యూదులను చంపేవారు. వారిని, వారి ఇండ్ల నుండి వెడల గొట్టేవారు. మరియు వారి సంపదలను దోచుకునేవారు. కాని వారు యుద్ధఖైదీలే, వీరి సమర్థీకు('హలీఫ్)ల దగ్గరికి వచ్చినప్పుడు, విమోచన ధనం ఇచ్చి వారిని విడిపించుకునే వారు. ఈ విధంగా వారు తమ గ్రంథంలోని కొన్ని చట్టాలను పాటించేవారు. మరి కొన్నింటిని ఉల్లంఘించేవారు.
[1] 'ఈసా ('అ.స.)కు అల్లాహుతా'ఆలా ప్రసాదించిన అద్భుత సూచనలు: చచ్చిన వారిని బ్రతికించటం, కుష్ఠురోగులను బాగుచేయటం మరియు పుట్టుగ్రుడ్డి వారికి చూపునివ్వటం మొదలైనవి. చూడండి, 3:49. [2] పరిశుద్ధాత్మ అంటే జిబ్రీల్ ('అ.స.), (ఫ'త్హ అల్ - బయాన్, ఇబ్నె-కసీ'ర్ - బు'ఖారీ, ముస్లిం, (జిబ్రీల్ 'అ.స.) సమర్థన కొరకు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించారు. [3] 'ఈసా ('అ.స.)ను అబద్ధీకుడన్నారు. 'జకరియ్యా మరియు య'హ్యా ('అలైహిమ్ స.)లను చంపారు, (ము'హమ్మద్ జూనాగఢి). ఇంకా చూడండి, 2:61, వ్యాఖ్యానం 1.
[1] ల'అనతున్: Wrath, Banishment, Rejection, Deprivation అంటే అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాల నుండి బహిష్కరించబ, శపించ, నిషేధించ, త్రోసివేయ, దూషించ బడటం, మరియు అభిశాపం అనే అర్థాలున్నాయి.
[1] చూడండి, 2:61 మరియు 2:87.
[1] చూడండి, 2:111.
[1] అల్-బ'సీరు: The All - Seeing. సర్వదృష్టికర్త, అంతా చూడ, గమనించ గల వాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] కొందరు యూద మతాచారులు మహా ప్రవక్త ('స'అస) దగ్గరికి వచ్చి అన్నారు: "మీరు మా కొన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇస్తే మేము ఇస్లాం స్వీకరిస్తాము. ఎందుకంటే ఒక ప్రవక్త తప్ప మరొకరు వీటికి జవాబివ్వలేరు." మహాప్రవక్త ('స'అస) వారి ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చారు. వారు ఇలా అన్నారు: "మీ వద్దకు వ'హీ ఎవరు తెస్తారు?" అతను జవాబిచ్చారు: "జిబ్రీల్ ('అ.స.) వారన్నారు:"జిబ్రీల్ ('అ.స.) మా శత్రువు, అతనే మా పై యుద్ధాలను మరియు శిక్షలను అవతరింపజేశాడు, కాబట్టి మేము మిమ్మల్ని ప్రవక్తగా నమ్మము." అని అంటూ వెళ్ళి పోయారు, (ఇబ్నె-కసీ'ర్ మరియు ఫ"త్హ అల్ ఖదీర్, ర.'అలైహిమ్).
[1] యూదులు అంటారు: "మీకాయీ'ల్ ('అ.స.) మా స్నేహితుడు." అల్లాహ్ (సు.తా.) అంటాడు: "వీరంతా నాకు ప్రియమైన నా దాసులు. కావున ఏ వ్యక్తి అయినా వీరిలో ఏ ఒక్కరికీ శత్రువైనా వాడు నాకూ శత్రువే!"
[1] యూదుల దివ్యగ్రంథం ('తౌరాత్)లో: "అరేబీయాలో ఒక ప్రవక్త వస్తాడు, మీరు అతనిని అనుసరించాలి." అని, ప్రస్తావన ఉన్నా, వారు లెక్క చేయకుండా దానిని ('తౌరాత్ ను) తమ వీపుల వెనుకకు త్రోసి వేశారు. చూడండి, 2:42, 76.
[1] రా'ఇనా: అంటే, Be careful; Listen to us, we lsiten to you. ఆగండి! మా మాట వినండి, మేము మీ మాట వింటాము, అని అర్థం. కాని యూదులు ఈ పదాన్ని తమ నాలుకలను త్రిప్పి, హీబ్రూ భాషలో, 'రా'ఈనా' - మా పశువుల కాపరి, లేక మూర్ఖుడు అనే అర్థం ఇచ్చే దురుద్దేశంతో పలికి తమ కక్ష తీర్చుకునేవారు. కాబట్టి విశ్వాసులతో: మీరు 'ఉన్ జుర్ నా' అంటే 'మమ్మల్ని అర్థం చేసుకోనివ్వండి.'అని గౌరవంతో, అనమని ఆజ్ఞ ఇవ్వబడుతోంది. ఇదే విధంగా యూదులు 'అస్సలాము అలైకుమ్' (మీకు శాంతి కలుగు గాక!) అనే మాటను నాలుకలు త్రిప్పి 'అస్సాము అలైకుమ్' (మీకు చావు వచ్చు గాక!) అనే అర్థంలో వాడేవారు. ఇంకా చూడండి, ఖు. 4:46.
[1] అల్-'అ"జీము: అంటే అల్-కబీరు. The Greatest of All, The Supreme, The Incomparably Great. సర్వోత్తముడు, మహాత్ముడు, పరమశ్రేష్ఢుడు, సర్వోత్కృష్టుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] అల్-వలియ్యు: అంటే అస్-సయ్యద్, Patron, Protector, Owner, Defender, Friend, సంరక్షకుడు, ఆరాధ్యుడు, స్నేహితుడు, సహాయకుడు, రక్షించువాడు, స్వామి, అండగా నిలుచువాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 6:14.
[1] అంటే నమా'జ్ లను వాటి సమయాలలో, సరిగ్గా దినానికి ఐదు సార్లు, పురుషులు జమా'అత్ తో మరియు స్త్రీలు ఇండ్లలో పాటించాలి, అని అర్థం.
[1] "అస్లమ వహ్ హహు లిల్లాహ్." అంటే, కేవలం అల్లాహ్ (సు.తా.) ప్రసన్నత కొరకే ఏదైనా చేయాలి. "వహువ ము'హ్ సినున్:" అంటే ఏ పనైనా హృదయపూర్వకంగా, మహా ప్రవక్త ('స'అస) ఆదేశాల ప్రకారం చేయాలి. చేసిన కార్యాలకు మంచి ప్రతిఫలం పొందటానికి, ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవటం ఎంతో అవసరం. (ఇబ్నె-కసీ'ర్).
[1] అల్-వాసి'ఉ: The All-Embracing, Infinite, Pervading, Bountiful, Comprehending all, Having ample Powr or ability. Has full knowledge of all things, All-Sufficient, సర్వవ్యాప్తి, సర్వోపగతుడు, విస్తారుడు, అంతం లేనివాడు, అపారుడు, అత్యంత ఉదారుడు, సంపలొసంగు వాడు, అల్లాహ్ జ్ఞానం ప్రతి దానిని ఆవరించు (ఇముడ్చు)కొని ఉంది. దివ్యఖుర్ఆన్ లో, వాసి'ఉన్ 'అలీమున్ అనే పదాలు ఇంకా 6 చోట్లలో వచ్చాయి. అవి: 2:247, 261, 268, 3:73, 5:54, 24:32. ఈ రెండూ అల్లాహుతా'ఆలా అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, వాసి'ఉన్ కొరకు, 4:130, 7:156, 53:32.
[1] సుబ్ హాన: సర్వలోపాలకు అతీతుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, చూడండి, 2:32 [2] ఇబ్నె - 'అబ్బాస్ (ర'.ది.'అ.) కథనం. ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 9).
[1] బదీ'ఉ (అల్-బదీ'ఉ) : Innovator. ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు (ఆరంభకుడు), ప్రారంభకుడు, మొదటిసారి క్రొత్తగా సృష్టించినవాడు. ప్రభవింపబజేసేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 6:101. [2] అల్లాహుతా'ఆలా ఏదైనా చేయదలచుకుంటే దానిని కేవలం: 'అయిపో!' అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. అలాంటప్పుడు ఆయనకు సంతానం కనే అవసరం ఎందుకుంటుంది. ఈ విధమైన వాక్యం 'కున్ ఫ యకూన్' ఖుర్ఆన్ లో 8 సార్లు వచ్చింది. చూడండి, 3:47, 59, 6:73, 16:40, 19:35, 36:82, 40:68.
[1] చూడండి, 17:90-93.
[1] చూడండి, 3:85
[1] ఇక్కడ పూర్వ గ్రంథప్రజలు, అంటే యూదులు మరియు క్రైస్తవులలోని కొందరు సత్పరుషుల విషయం తెలుపబడింది. ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్, సల్మాన్ ఫార్సీ (ర'ది.'అన్హుమ్)ల వంటివారు. వారు తమ గ్రంథాలలో పేర్కొనబడిన రాబోయే ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) మే అన్న సత్యాన్ని గ్రహించి, విశ్వసించి సత్యధర్మమైన ఇస్లామ్ ను స్వీకరించారు. ఏ ధర్మాన్నైతే దైవప్రవక్తలు ఆదమ్, నూ'హ్, ఇబ్రాహీమ్, మూసా మరియు 'ఈసా మొదలైనవారు ('అలైహిమ్. స.) ఆచరించి, బోధించారో!
[1] అల్లాహ్ (సు.తా.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ విన్నపాన్ని పూర్తి చేశాడు. ఇది 29:27లో పేర్కొనబడింది. [2] "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అల్లాహ్ (సు.తా.) యొక్క ఈ ప్రవచనం ఎంతో ఆలోచింపదగినది. ఇక్కడ ఆయన విశదపరచింది ఏమిటంటే : ఒక మంచి సత్పురుషుని లేక ప్రవక్త సంతతికి చెందినంత మాత్రానా - వారు అవిశ్వాసులై, సత్కార్యాలు చేయని వారైతే - వారి వంశకీర్తి, వారి పెద్దల ప్రవక్తృత్వం వారికి ఏ విధంగానూ పనికిరాదు. ప్రతి ఒక్కడూ తన స్వంత విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగానే ప్రతిఫలం పొందుతాడు. మహా ప్రవక్త ('స'అస) 'హదీస్' ఇలా ఉంది : "ఏ వ్యక్తి వ్యవహారాలైతే అతనిని వెనుక విడిచాయో, అలాంటి వ్యక్తి పుట్టు పూర్యోత్తరాలు, వంశ ప్రతిష్ఠలు అతనిని ఏ మాత్రం ముందుకు తేలేవు." ('స'హీ'హ్ ముస్లిం).
[1] మసా'బతల్లిన్నాస్ : అంటే, ప్రజల కొరకు పుణ్యస్థలం. దీని మరొక అర్థం, మాటిమాటికీ సందర్శించే కేంద్రం. ఎందుకంటే ఒకసారి అల్లాహ్ (సు.తా.) గృహాన్ని సందర్శించినవాడు, మళ్ళీ మళ్ళీ దానిని దర్శించాలని కోరుతూ ఉంటాడు. దీని మరొక మహత్త్వమేమిటంటే, ఇది శాంతి కేంద్రం. అంటే ఇక్కడ ఏ శత్రువు భయం ఉండదు. అందుకే అజ్ఞాన కాలంలో కూడా ముష్రిక్ లు 'హరమ్ సరిహద్దులలో తమ శత్రువులతో పోరాడటం గానీ, హత్యలు గానీ చేసేవారు కాదు. [2] మఖామె ఇబ్రాహీమ్: అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) నిలబడిన రాయి. అతను దానిపైన నిలబడి క'అబహ్ గృహాన్ని నిర్మించారు. అది 'హరమ్ లో క'అబహ్ కు దగ్గరగా ఉంది. 'తవాఫ్ పూర్తి చేసిన వారు ప్రతి ఒక్కరూ, దాని దగ్గరలో రెండు రకా'అతులు నమా'జ్ చేస్తారు.
[1] అస్-సమీ'ఉ: The All-Hearing. Who hears every thing. సర్వం వినేవాడు, సర్వశ్రవణ సమర్థుడు. అస్-సమీ'ఉన్ - 'అలీము, ఈ ద్వంద పదం ఖుర్ఆన్ లో ఎన్నో సార్లు వచ్చింది. 29 సార్లు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. [2] అల్-'అలీము: The All Knowing, సర్వజ్ఞుడు, చూడండి, 2:32.
[1] ఇది ఇబ్రాహీమ్ మరియు ఇస్మా'యీల్ ('అలైహిమ్. స.)ల యొక్క చివరి దు'ఆ. అల్లాహ్ (సు.తా.) దీనిని స్వీకరించి ఇస్మాయీ'ల్ ('అ.స.) సంతతి నుండి ము'హమ్మద్ ('స'అస) ను సందేశహరునిగా పంపాడు. కావున ము'హమ్మద్ ('స'అస) అన్నారు: 'నేను నా తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క దు'ఆను, 'ఈసా ('అ.స.) యొక్క శుభవార్తను మరియు నా తల్లి యొక్క కలను.' (ఫ'త్హ రబ్బాని). [2] అల్-'అజీ'జ్: సర్వశక్తిసంపన్నుడు, సర్వశక్తిమంతుడు, ఆయన అధికారం సర్వాన్ని పరివేష్ఠించి ఉన్నది, గౌరవానికి మూలాధారి.The Almighty
[1] ఇబ్రాహీమ్ మరియు య'అఖూబ్ ('అలైహిమ్ స.) కూడా తమ సంతానాన్ని అనుసరించమని బోధించిన ధర్మం ఇస్లామ్ మాత్రమే. ఈ ఇస్లాం ధర్మం అంటే అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే దాస్యం చేయటం (విధేయులుగా ఉండటం). ఇదే ఆదమ్ ('అ.స.) నుండి చిట్టచివరి ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) వరకూ ప్రవక్తలందరూ బోధించిన ధర్మం. (చూడండి, 3:19)
[1] ఇక్కడ యూదులు ప్రశ్నింపబడుతున్నారు: "య'అఖూబ్ ('అ.స.) మరణించినప్పుడు మీరైతే అక్కడ లేరు కదా! అలాంటప్పుడు మీకెలా తెలుసు, అతను తన కుమారులకు బోధించిన ధర్మమేమిటో?" అతనే గాక ప్రతి ప్రవక్త బోధించిన ధర్మం ఇస్లాం మాత్రమే. ('స'హీ'హ్ బు'ఖారీ). [2] అల్-వా'హిద్: The One, The Sole. అద్వితీయుడు, ఒకే ఒక్కడు. ఏకైకుడు ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 2:163, 12:39. అహదున్: The Unique and Alone, ఏకైకుడు, ఒకే ఒక్కడు. చూడండి, 112:1, 4.
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 5, 'హదీస్' నం. 169.
[1] దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది: 'అల్లాహ్ రంగును (ధర్మాన్ని) ఎంచుకోండి. మరియు అల్లాహ్ రంగు (ధర్మం) కంటే ఉత్తమమైన రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించే వారము.' క్రైస్తవులు ఒక పసుపురంగు చేసి ఉంచుతారు. బిడ్డ పుట్టినా లేక ఎవడైనా క్రైస్తవ మతం అవలంబించినా! వారు, అతనిని ఆ రంగులో ముంచి: 'పవిత్రమైన క్రైస్తవుడయ్యాడు.' అని అంటారు. దీనిని బాప్టిసం (Baptism) అంటారు. ఈ ఆచారాన్ని ఖండిస్తూ : అల్లాహ్ (సు.తా.) రంగు (ధర్మం) అంటే ఇస్లాం ధర్మమే, అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై కేవలం ఆయననే ఆరాధించడం. ఇదే ప్రవక్తలందరూ బోధించిన ధర్మం, అని విశదపరచబడింది.
[1] చూడండి, 35:18 మరియు 53:39.
[1] మ'హా ప్రవక్త ('స'అస) మదీనాకు వలస పోయిన తరువాత 16, 17 నెలలు బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి నమాజ్' చేసేవారు. కాని అతని కోరిక క'అబహ్ (మక్కా) వైపుకు మాత్రమే ముఖం చేసి నమాజ్' చేయాలని ఉండేది. ఇదే ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఖిబ్లా కూడాను. మహా ప్రవక్త ('స'అస) దీనికై ఎన్నోసార్లు అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థించారు. చివరకు అల్లాహుతా'ఆలా ఖిబ్లాను మార్చమని మహా ప్రవక్త ('స'అస)కు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు అవిశ్వాసులు ఈ విధంగా అన్నారు.
[1] చూడండి, 22:78 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 14. మథ్యస్థ సమాజం అంటే, ఇస్లాంకు ముందున్న మతస్థులలో కొందరు ఆత్మశుద్ధిని వదలి దేహాన్నే పోషించుకుంటూ పశుప్రాయులై ఉండేవారు. వారు యూదులు మొదలైన వారు. మరి కొందరు దేహాన్ని హింసించుకుంటూ అనేక బాధలు పడి, సంసారాన్ని వదలి అడవులలో నివసిస్తూ ఆత్మశుద్ధిని గురించి కృషి చేసేవారు. ఈ రెండు మార్గాలకు మధ్య ఇహ-పరాలను, దేహాన్ని-ఆత్మశుద్ధిని అనుసరించేవారు శ్రేష్టులు. ఇదే ఇస్లాం బోధన, ఉత్తమమైన మధ్యస్థ మార్గము. [2] ఇక్కడ దీని అర్థం : ఇంత వరకు ము'హమ్మద్ ('స'అస) మరియు అతని అనుచరులు (ర'ది.'అన్హుమ్) బైతుల్ మఖ్దిస్ వైపునకు ముఖం చేసి, చేసిన నమాజులు వ్యర్థం కావు. వాటి ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడుతుంది.
[1] పూర్వ గ్రంథాలలో మక్కాలోని కాబాయే చివరి ప్రవక్త యొక్క భిబ్లా కాగలదని పేర్కొనబడింది. వారికిది తెలిసి కూడా అసూయ వల్ల వారిలా ముస్లింలతో వాదులాడారు.
[1] యూదుల భిబ్లా బైతుల్ మఖ్దిస్ కు పడమర దిక్కులో ఉన్న 'బండ' మరియు క్రైస్తవుల ఖిబ్లా బైతుల్ మఖ్దిస్ కు తూర్పు దిక్కులో ఉంది. చూడండి, 2:115, 142, 177.
[1] మక్కాలోని క'అబహ్, ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఖిబ్లాగా ఉండేది. చూడండి, ఖు. 61:6.
[1] చూడండి, 5:48. అల్లాహుతా'ఆలా మానవులకు మంచిచెడులను సూచించి, వాటి వ్యత్యాసాన్ని చూపి, వాటి ఫలితాలను కూడా స్పష్టం చేశాడు. కావున ప్రతివాడు తాను ఎన్నుకున్న మార్గానికి బాధ్యత వహించి తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు.
[1] చూడండి, ఖు. 14:7 'స.బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 415; పుస్తకం - 9, 'హదీస్' నం. 502.
[1] మంచి విశ్వాసి సంతోషం కలిగినపుడు అల్లాహుతా'ఆలాకు కృతజ్ఞుడై ఉంటాడు మరియు బాధలో ఉన్నప్పుడు సహనం వహిస్తాడు. ('స'హీ'హ్ ముస్లిం, 'హ.నం. 2999).
[1] అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ (ధర్మపోరాటం) చేసి చంపబడిన వారు మృతులు కారు. వారు అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో సజీవులుగా ఉంటారు. చూడండి, 3:169.
[1] 'సలవాతున్: అంటే blessings, bendictions, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, వరాలు మరియు శుభాకాంక్షలు అనే అర్థాలున్నాయి. [2] నష్టం కలిగినపుడు : 'ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి'ఊన్.' మరియు, 'అల్లాహుమ్మ అజుర్నీ ఫీ ము'సీబతీ, వ అ'ఖ్ లిఫ్ లీ ఖైరమ్మిన్ హా.' చదవాలి, ('స.ముస్లిం, 'హదీస్' నం. 918).
[1] 'సఫా-మర్వాలు మక్కాలో క'అబహ్ కు కొంత దూరంలో ఉన్న చిన్న గుట్టలు. 'హజ్ లేక 'ఉమ్రా చేసేవారు క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు ('తవాఫ్) చేసిన తరువాత 'సఫా-మర్వా గుట్టల మధ్య ఏడు సార్లు పచార్లు (స'యీ) చేయాలి. ఇది తప్పకుండా చేయాలి (వాజిబ్). ఇబ్రాహీమ్ ('అ.స.) భార్య - ఇస్మా'యీల్ ('అ.స.) యొక్క తల్లి - అయిన సయ్యిదా హాజర్, ఇస్మా'యీల్ ('అ.స.)ను కాబా దగ్గర పరుండబెట్టి, నీటి కొరకు ఈ రెండు గుట్టల మధ్య పరుగెత్తుతూ, తన కుమారుణ్ణి ఈ గుట్టలెక్కి చూసేది. అదే కార్యాన్ని అల్లాహ్ (సు.తా.) ముస్లింలకు 'హజ్ లేక 'ఉమ్రా చేసేటప్పుడు, ఆచరించమని ఆజ్ఞాపించాడు.ఇవే కాకుండా 'హజ్ చేసే వారి కొరకు ఇతర ఆచారాలు అంటే బలి (ఖుర్బానీ) ఇవ్వటం, మీనాలోని మూడు జమరాతుల మీద ప్రతిదానిపై ఏడేసి గులక రాళ్ళు రువ్వటం, మొదలైనవి ఉన్నాయి. సయ్యిదా హాజర్ యొక్క ప్రార్థనను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) ఇస్మా'యీల్ (అ.స.) కాళ్ళ దగ్గర 'జమ్ 'జమ్ నీటి బుగ్గను పుట్టించాడు. అందులో ఈనాటి వరకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. బైతుల్లాహ్ ను సందర్శించే వారు ఈ నీటిని త్రాగి, అల్లాహుతా'ఆలాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకా అక్కడ తమ కోరికల పూర్తికై, పాపవిమోచనకై, ఉత్తమ ప్రతిఫలాలకై అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. [2] 'హజ్ అంటే జుల్-'హజ్ నెలలో 8-13 తేదీల వరకు క'అబహ్, మీనా, 'అరఫాత్ మరియు ము'జ్దలిఫాలను సందర్శించటం. 'ఉమ్రా అంటే ఈ తేదీలలో కాక ఇతర కాలంలో ఎప్పుడైనా క;అబహ్ ను దర్శించటం. చూడండి' 14:37). 'ఉమ్రా చేయదలుచుకున్నవారు: 'హరమ్ సరిహద్దుల బయటి నుండి (మీఖాత్ బయట ఉండేవారు మీఖాత్ నుండి) 'ఉమ్రా దీక్ష (నియ్యత్)తో, ఇ'హ్రామ్ ధరించి, క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు చేసి, తరువాత 'సఫా-మర్వాల మధ్య ఏడు సార్లు పచార్లు చేసి, ఆ తరువాత శరోముండనం చేయించుకొని, ఇ'హ్రామ్ విడుస్తారు. మీఖాత్ మరియు 'హరమ్ సరిహద్దులను మహా ప్రవక్త ('స'అస) సూచించారు. [3] షాకిరున్ (అష్-షకూరు): One who approves or Rewards or Forgives much or largely. అంటే కృతజ్ఞతలను ఆమోదించే, అంగీకరించే, ఆదరించే, విలువనిచ్చే వాడు. తన దాసుల మంచి కార్యాలకు అమితంగా ప్రతిఫలమిచ్చేవాడు. All-Appreciative, యోగ్యతను గుర్తించే, పరిగణించే వాడు. అష్-షుకూర్ కు చూడండి, 4:147. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] ఇబ్నె 'అబ్బాస్ ('ర.ది.'అ.) కథనం : ఈ ఆయతులో - తౌరాత్ గ్రంథంలో దైవ ప్రవక్త ('స'అస) గురించి వచ్చిన స్పష్టమైన సూచనలను - యూదులు మరియు క్రైస్తవులు దాచిన విషయం గురించి చెప్పబడింది. (అబూ-దావూద్, మరియు సునన్ తిర్మిజీ', 'హదీస్' నం. 651.
[1] అత్-తవ్వాబు: Oft-Returning. తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరించే, స్వీకరించే, కటాక్షించే, మన్నించే వాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] అల్-వా'హిద్: The One, The Sole. అద్వితీయుడు, ఒకే ఒక్కడు. చూడండి 2:133, 12:39.
[1] ఈ ఆయతులో అల్లాహ్ (సు.తా.) సృష్టించి, నడిపిస్తున్న ప్రకృతి నియమాలను గురించి వివరించడమైనది. 1) భూమ్యాకాశాల సృష్టి, 2) రాత్రింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటం మరియు వాటి కాలాలలో హెచ్చు తగ్గులు, 3) సముద్రాలలో నావలు ఎంతో భారాన్ని తీసుకొని పయనించటం, 4) వర్షం కురిసి జీవం లేని భూమికి జీవమివ్వటం, 5) వివిధ రకాల జీవరాసుల సృష్టి, 6) చల్లని, వెచ్చని వివిధ దిక్కుల నుండి వీచే గాలి, 7) అల్లాహుతా'ఆలా తాను కోరిన చోట వర్షం కురిపించటానికి, తనకు నియమబద్ధులుగా సృష్టించిన మేఘాలు; వీటన్నింటిలో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి. ఈ కార్యాలలో ఆయనకు మరెవ్వరూ భాగస్వాములు లేరనేది కూడా వ్యక్తమౌతోంది. ఎందుకంటే ఎవరైనా ఆయనకు భాగస్వాములుంటే ఈ సృష్టిలో అల్లకల్లోలం చెలరేగి ఉండేది.
[1] చూడండి, 39:45, 29:65, 17:67 మరియు 'స.బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 24.
[1] అంటే ఈ సత్యతిరస్కారులు, సత్యధర్మం యొక్క పిలుపు విన్నా దానిని అర్థం చేసుకోలేక పోతున్నారు. ఏవిధంగానైతే పశువులు - వాటి కాపరి యొక్క కేకలు అర్థం చేసుకోలేవో!
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 49
[1] ఈ 'హరాం చేయబడిన విషయాలు ఇంకా మూడు చోట్లలో పేర్కొనబడ్డాయి. చూడండి, 5:3, 6:145, 16:115. [2] ఈ నాలుగు గాక 'హదీస్'లో 'హరామ్ గా పేర్కొనబడినవి ఇవి: 1) గోళ్ళతో వేటాడి చంపే మృగాలు, 2) తమ గోళ్ళతో వేటాడే పక్షులు, 3) గాడిద, కుక్క మొదలైనవి. ఇంకా వివరాలకు చూడండి 5:3. 'హదీస్'లో మరణించిన చేప 'హలాల్ గా పరిగణింపబడింది. అల్లాహుతా'ఆలా తప్ప, ఇతరులను సంతృప్తి పరచడానికి వారి పేరున ఒక పశువును జి'బ్'హ్ చేయటం - జి'బ్'హ్ చేసేటప్పుడు అల్లాహ్ (సు.తా.) పేరు తీసుకున్నా- వారి సంకల్పం (నియ్యత్) అల్లాహ్ (సు.తా.) కాక, ప్రత్యేకమైన వేరే ఇతరుణ్ణి సంతోషింపజేయటానికైతే, అలాంటి దానిని తినటం కూడా 'హరామ్. అంతేగాక అల్లాహ్ యేతరులకు అర్పించబడినది (నజ'ర్, నియా'జ్, చఢావా చేసింది) ఏదైనా తినటం కూడా 'హరామ్. ('స'హీ'హ్ అల్ - జామె, అస్స'గీర్ వ జ్యాదతహు, అల్ బానీ పుస్తకం - 2 పేజీ - 1024. [3] అల్ 'గఫూరు: Oft-Forgiving, Most Forgiving, క్షమాశీలుడు, పాపాలను ఎక్కువగా క్షమించేవాడు. అల్-'గప్ఫారు: క్షమించేవాడు, చూడండి 20:82. అల్-'గప్ఫారు మరియు అల్-'గఫూరు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. అల్-'గాఫిర్: క్షమాగుణ పరిపూర్ణుడు, చూడండి, 40:3.
[1] వంకర అక్షరాలలో ఉన్నదాని తాత్పర్యం ఈ విధంగా కూడా ఉంది: 'తమ విరోధంలో సత్యం నుండి చాలా దూరం వెళ్ళిపోయారు.'
[1] అల్ బిర్రు: piety, to act well, virtue, అంటే ధర్మ ఆచరణ, ధర్మనిష్ఠాపరత్వం, దైవభక్తి, నీతిపరత్వం, పుణ్యం అనే అర్థాలున్నాయి. [2] చూడండి, అల్ బఖర 2:145 వ్యాక్యానం 2. దీని ఉద్దేశ్యం ఏమిటంటే, అల్లాహ్ (సు.తా.) ఆదేశాన్ని శిపసావహించి, విశ్వాసులందరూ, వారు ప్రపంచంలో ఎక్కడున్నా, ఎల్లప్పుడూఒకే ఒక్క ఖిబ్లా (క'అబహ్) అయిన మక్కా ముకర్రమా వైపునకు మాత్రమే అభిముకులై నమాజ్ చేయాలి. [3] మసాకీన్, మిస్కీన్ (ఏ.వ.): అంటే, ఆదాయం ఉన్నా అది వారి నిత్యావసరాలకు సరి పోనివారు. ఇలాంటి వారు తమ ఆత్మాభిమానం వల్ల యాచించటానికి ఇష్ట పడరు. ఫుఖరా - అంటే ఏమీ ఆదాయం లేక గత్యంతరం లేక భిక్షమడిగే వారు. [4] ఖుర్ఆన్ అవతరింపజేయబడే కాలంలో బానిసత్వం, బానిసలను కొనటం, అమ్మటం ఎంతో ఎక్కువగా ఉండేది. ఇస్లాం ధర్మం యొక్క ముక్య లక్ష్యాలలో ఒకటి ఇలాంటి బానిసత్వాన్ని రూపుమాపటం. కేవలం ధర్మ యుద్ధ ఖైదీలను మాత్రమే ఇస్లాం చట్టం ప్రకారం బానిసలుగా ఉంచుకోవచ్చు. చూడండి, 8:67. ఖుర్ఆన్ లో బానిసలను విడిపించటం పుణ్యకార్యమని ఎన్నోచోట్లలో పేర్కొనబడింది. చూడండి, 4:92, 5:89, 58:3.
[1] ఇది ఇస్లాంకు ముందు అరబ్బులలో ఉన్న దురాచారాన్ని ఖండిస్తోంది. వారు ఒక మగ హంతకునికి బదులుగా అతని కుటుంబంలో అనేక మంది మగవారిని, ఒక స్త్రీ హంతకురాలికి బదులుగా ఆమె కుటుంబంలోని పురుషుణ్ణి లేక ఒక బానిస హంతకునికి బదులుగా ఒక స్వతంత్ర పురుషుణ్ణి హత్య చేసేవారు. [2] చూడండి, 55:60.
[1] హత్య చేయగోరే వానికి మొదటి నుండే వాడు కూడా మరణశిక్షకు గురి అయ్యే శాసనముందని తెలిస్తే! వాడు ఎన్నడూ హత్యకు పూనుకోడు. ఈ విధమైన న్యాయప్రతీకారం వల్ల రాజ్యంలో శాంతి సుఖాలు వర్దిల్లుతాయి. ఉదా: ఇప్పుడు స'ఊదీ 'అరేబియాలో ఉన్న స్థితి.
[1] ఆస్తుల పంపక విషయానికై చూడండి, 4:11-12, ఈ ఆయత్ వాటి కంటే ముందు అవతరించబడింది. వీలునామా కేవలం 1/3 భాగపు ఆస్తి కొరకు మాత్రమే చేయవచ్చు. 2/3 భాగపు ఆస్తి మృతుని ప్రథమ శ్రేణి బంధువుల (వారసుల) హక్కు. ఆస్తికి హక్కుదారులైన ప్రథమ శ్రేణి బంధువులు (వారసులు) వీలునామాకు హక్కుదారులు కారు. ఈ 1/3 భాగం ఆస్తిపరుడు తన వీలునామాలో ఆస్తికి హక్కుదారులు కానటువంటి దూరబంధువులకు, స్నేహితులకు లేక ధర్మ కార్యాలకు ఇవ్వవచ్చు. 1/3 భాగం కంటే ఎక్కువ భాగానికి వీలునామా వ్రాయటం ధర్మ సమ్మతం కాదు. ('స. బు'ఖారీ, కితాబుల్ ఫరాయ'ద్, బాబ్ మీరాస్' అల్-బనాత్). ఆస్తి తక్కువ ఉంటే - కేవలం పేరు ప్రతిష్ఠల కొరకు - హక్కుదారులను పేదరీకంలో వదలి, ధర్మకార్యాలకు లేక హక్కులేని వారి కొరకు - 1/3 భాగానికి కూడా - వీలునామా వ్రాయటం సమ్మతించదగినది కాదు. ఒక విశ్వాసి - ఒక విశ్వాసి, ఉభయులూ ఒకరికొకరు వారసులు కాలేరు. కాని వీలునామా (వ'సియ్యత్) ద్వారా వారికి ధన సహాయం చేయవచ్చు.
[1] సమీ'ఉన్-అలీమున్: సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. చూడండి, 2:127.
[1] అ'స్-'సౌమ్ : ఉపవాసం అంటే, మానుకోవటం. ప్రాతఃకాలం నుండి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా త్రాగకుండా మరియు భార్యలతో రతిక్రీడలు జరగకుండా ఉండటమే గాక, తమ పంచేంద్రియాలను, చూపులను, నాలుకను, చెవులను, ఆలోచనలను మరియు చేష్టలను మొదలైన వాటిని కూడా అదుపులో ఉంచుకొని చెడుకు దూరంగా ఉండటం.
[1] అతివృద్ధులు, దీర్ఘవ్యాధితో పీడితులైనవారు, గర్భవతులైన స్త్రీలు, బిడ్డలకు పాలిచ్చే స్త్రీలు మొదలైనవారు, ఉపవాసముండటం వారికి అతి కష్టతరమైతే, పరిహారంగా ప్రతిరోజూ ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని గర్భవతులైన స్త్రీలు , పిల్లలకు పాలిచ్చే స్త్రీలు మరియు కొద్దికాలానికి మాత్రమే వ్యాధి గ్రస్థులైన వారు మాత్రం విడిచిన ఉపవాసాలను తరువాత పూర్తి చేసుకోవాలి.
[1] ఖుర్ఆన్, లైలతుల్ ఖద్ర్ లో లౌ'హెమ'హ్ ఫూ"జ్ నుండి ఈ ప్రపంచపు ఆకాశం మీద దింపబడింది. అక్కడ బైతుల్ - ఇ'జ్జత్ లో పెట్టబడింది. అక్కడి నుంచి 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవసరాన్ని బట్టి మహాప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింపజేయబడింది, (ఇబ్నె-కసీ'ర్). మొట్టమొదటి వ'హీ 'హిరా గుహలో రమ'దాన్ నెలలో అవతరింపజేయబడింది. మరియు దైవప్రవక్త ('స'అస), తమ మరణానికి ముందు రమ'దాన్ నెలలోనే ఖుర్ఆన్ ను జిబ్రీల్ ('అ.స.) సమక్షంలో, రెండు సార్లు పూర్తిగా చదివి వినిపించారు. మరియు దైవప్రవక్త ('స'అస), అదే రమ'దాన్ నెలలో 23, 25, 27 రాత్రులలో, స'హాబీలకు తరావీ'హ్ నమా'జ్ (ఖియామ్ అల్లైల్) కూడా జమా'అతో చేయించారు. ('స.తిర్మిజీ', 'స. ఇబ్నె-మాజా, అల్బానీ ప్రమాణీకం). ఆ తరావీ'హ్ నమా'జ్ ఎనిమిది రకాతులు, వి'తర్ తో పాటు పదకొండు రకాతులు, అవి జాబిర్ (ర'ది.'అ.) మరియు సయ్యిదా 'ఆయిషహ్ (ర.'అన్హా)ల, ఉల్లేఖనా (రివాయతు)లు ఉన్నాయి. ('స.బు'ఖారీ).
[1] ఉపవాసం విరమించే వేళలో చేసే ప్రార్థన (దు'ఆ) అంగీకరించబడుతుంది. (ముస్నద్ అ'హ్ మద్, తిర్మిజీ', నసాయీ', ఇబ్నె-మాజా - ఇబ్నె-కసీ'ర్ వ్యాఖ్యానం). [2] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 509.
[1] చూడండి, 7:189. ఏ'తెకాఫ్: అంటే మస్జిద్ లో అల్లాహ్ (సు.తా.) ను ధ్యానిస్తూ ఏకాంతంగా గడపటం. ఏ'తెకాఫ్ పాటించేవారు స్త్రీలతో సంభోగించరాదు. కాలకృత్యాలకు తప్ప, మస్జిద్ విడిచి బయటికి పోరాదు. తోటివారితో అనవరమైన మాట్లలో పడరాదు.
[1] ఈ ఆయత్ లో జిహాద్: ధర్మపోరాటం, అంటే ఎవరైతే మీతో పోరాడుతారో, అలాంటి వారితో మీరు పోరాడండని అనుమతి ఇవ్వబడింది. చూడండి 22:39. ఆ ఆయత్ జిహాద్ ను గురించి మొదటి సారిగా అవతరింపబడిందని చాలా మంది 'హదీస్' వేత్తలు వ్రాశారు, ('తబరీ, ఇబ్నె-కసీ'ర్). హద్దులను అతిక్రమించకూడదు అంటే, స్త్రీల, పిల్లల, వృద్ధుల హత్య చేయకూడదు. ఎవరైతే మీతో పోరాడుతారో, వారినే వధించాలి. ఇదే విధంగాపంట పొలాలను, చెట్లుచేమలను, పశువులను, అనవసరంగా పాడు చేయరాదు. జిహాద్ గురించి 4:91, 60:8 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 4 చూడండి.
[1] ఇక్కడ ఫిత్నా - అంటే సత్యతిరస్కారం, షిర్క్, సత్యధర్మానికి అడ్డుగా నిలవటం. సత్యాన్ని స్వీకరించిన వారిని హింసా, దౌర్జన్యాలకు గురి చేయడం. చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 797. ఫిత్నతున్ : యొక్క ఇతర అర్థాలు పీడన, ఉపద్రవం, పరీక్ష, ప్రేరేపించటం, కలతలు రేకెత్తించటం, శోధన, పురికొల్పటం మరియు దుష్కృత్యం మొదలైనవి ఉన్నాయి. [2] మస్జిద్ అల్ - 'హరామ్ సరిహద్దులలో యుద్ధం చేయటం నిషేధించబడింది. అది శాంతినిలయం, కాని ఎవరైనా దానిని లెక్క చేయక మీపై దాడి చేసి మిమ్మల్ని చంపగోరితే, అలాంటి వారితో మీరు అక్కడ యుద్థం చేసి వారిని చంపవచ్చు!
[1] చూడండి, 2:191 వ్యాఖ్యానం 2. [2] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 24.
[1] నిషిద్ధ మాసాలు: జు'ల్ - ఖాఇదహ్, జు'ల్ హిజ్జహ్, ము'హర్రం మరియు రజబ్ (హిజ్రీ శకపు 11, 12, 1, 7 మాసాలు). ఈ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు పూర్వం నుండి కూడా అరేబియా వాసులలో నిషేధించబడి ఉండింది. చూడండి, 2:217. ఈ నిషేధాలను దరూ గౌరవించాలి. ఎదుటి వారు వాటిని గౌరవించని పక్షంలో వారితో పోరాడి ప్రతీకారం తీర్చుకోవచ్చు.
[1] 'ఉమ్రా: 'హజ్ సమయంలో కాకుండా వేరే దినాలలో కూడా 'ఉమ్రా చేయవచ్చు. 'ఉమ్రా చేయగోరే వారు 'హరమ్ సరిహద్దుల నుండి, (మీఖాత్ సరిహద్దుల బయట నుండి వచ్చే వారు మీఖాత్ నుండి) ఇ'హ్రామ్ ధరించి, (అంటే పురుషులు, ఒక తెల్లని లుంగీ కట్టుకొని మరొక తెల్లని దుప్పటిని శరీరంపై కప్పుకోవటం. స్త్రీలకు, వారు ధరించిన బట్టలే ఇ'హ్రామ్; మగవారివలే వారికి ప్రత్యేకమైన ఇ'హ్రామ్ దుస్తులు లేవు) 'హరమ్ కు వచ్చి, క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు ('తవాఫ్) చేసి, రెండు రకాతులు నమాజ్' చేసి, తరువాత 'సఫా, మర్వాల మధ్య ఏడుసార్లు పచార్లు (స'యీ) చేసి, ఆ తరువాత (స్త్రీలు) తల వెంట్రుకలను కొంత మట్టుకు కత్తిరించుకోవాలి. పురుషులు శిరోముండనం చేయించుకొని లేక తల వెంట్రుకలను కొంత మట్టుకు కత్తిరించుకొని ఇ'హ్రామ్ విడిచి పెట్టాలి. మీఖాత్ మరియు 'హరమ్ సరిహద్దులను మహా ప్రవక్త ('స'అస) సూచించారు. [2] దైవప్రవక్త ('స'అస) 6వ హిజ్రీలో 'ఉమ్రా కొరకు వచ్చినప్పుడు 'హుదైబియహ్ దగ్గరగా ఆగారు. అప్పుడు మక్కాలోని ముష్రిక్ ఖురైషులతో సంధి చేసుకున్నారు. 'హుదైబియహ్ లోనే తమ బలి (ఖుర్బానీ) చేసి తమ శిరోముండనాలు చేయించుకొని ఇ'హ్రాం వదిలారు. తరువాత 7వ హిజ్రీలో వచ్చి 'ఉమ్రా చేశారు. [3] శాంతి సమయాలలో 'హజ్ యొక్క అన్ని మనాసిక్ లు పూర్తి చేయనంత వరకు శిరోముండనం చేయించుకోగూడదు అంటే, ఇ'హ్రీమ్ విడువగూడదు. [4] తమత్తు' - అంటే 'హజ్ కాలంలో 'ఉమ్రా కొరకు ఇ'హ్రామ్ ధరించి 'ఉమ్రా చేసి శిరోముండనం చేసి, ఇ'హ్రామ్ విడవాలి. మరల 8వ జి'ల్-'హిజ్ రోజున 'హజ్ కొరకు ఇ'హ్రామ్ ధరించాలి. దీనికి బలి ఇవ్వ వలసి ఉంటుంది. బలి ఇవ్వలేని వారు 10 రోజులు ('హజ్ కాలంలో 3 రోజులు 'హజ్ తరువాత 7 రోజులు), ఉపవాసాలుండాలి. 'హజ్ 3 రకాలుగా చేయవచ్చు: అవి 1)ఇఫ్రాద్: అంటే 'హజ్ సంకల్పంతో ఇ'హ్రాం ధరించి కేవలం 'హజ్ మాత్రమే చేయటం. దీనికి బలి అవసరం లేదు. ఇది 'హరమ్ ప్రాంతంలో నివసించే వారు చేసే 'హజ్, 2) తమత్తు : పైన వివరించిన విధానం. 'హజ్జె తమత్తు'కు బలి (ఖుర్బానీ) ఇవ్వటం వాజిబ్. 3) ఖిరన్ : ఒకే ఇ'హ్రామ్ తో 'ఉమ్రా మరియు 'హజ్ నెరవేర్చటం. 'ఉమ్రా చేసిన తరువాత తలవెంట్రుకలు కత్తిరించుకోకుండా 'హజ్ వరకు ఇ'హ్రాంలోనే ఉండి 'హజ్ విదులు నెరవేర్చిన పిదప ఇ'హ్రామ్ విడవటం. 'హజ్జె ఖిరన్ కు కూడా బలి (ఖుర్బానీ) ఇవ్వటం వాజిబ్. [5] హద్ యున్, బలి (ఖుర్బానీ): ఒక వ్యక్తి ఒక మేక లేక గొర్రె; లేక ఏడుగురు కలిసి ఒక ఆవు, ఎద్దు, లేక ఒంటె బలి చేయవచ్చు.
[1] అనుగ్రహాలు అంటే 'హిజ్ యాత్రలో వ్యాపారం మొదలైనవి చేయటం ధర్మసమ్మతమే. [2] 'అరఫాత్: మక్కా నుండి దాదాపు 12 కి.మీ. దూరంలో 'హరమ్ సరిహద్దులకు బయటనున్న ఒక మైదానం. అందులో ఒక చిన్న కొండ ఉంది దాని పేరు జబలె - ర'హ్మ. దైవప్రవక్త ('స'అస) 'హజ్ చేసినప్పుడు దాని దగ్గర నుంచొని 'హజ్ ఉపన్యాసం (ఖు'త్బా) ఇచ్చారు. 'హజ్ చేయాలని సంకల్పించిన వారు జు'ల్-'హిజ్జహ్ 9వ తేదీన మధ్యాహ్నం నుండి 10వ తేదీ ఫజ్ర్ అ'జాన్ సమయం వరకు 'హజ్ నియ్యత్ తో ఇ'హ్రాం ధరించి కొంత సమయం ఈ మైదానంలో గడపడం మరియు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించడం విధి. 'హదీస్' ప్రకారం 'అరఫాత్ లో ఆగడమే 'హజ్. 'అరఫాత్ మైదానం 'హరం సరిహద్దుల బయట ఉంది. [3] మస్జిద్ మష్అరిల్ - 'హరామ్ ము'జ్దలిఫాలో ఉంది. జు'ల్ - 'హిజ్జహ్ 9వ తేదీన 'హాజీలు 'అరఫాత్ మైదానంలో కొంతకాలం గడిపిన తరువాత ఇక్కడకు చేరుకొని, మ'గ్రిబ్ మరియు 'ఇషా నమాజ్' లు కలిపి చేయడం మస్నూన్. వారు రాత్రి ఇక్కడ గడిపి, 10వ తేదీ ఫజ్ర్ నమా'జ్ తరువాత మీనాకు చేరుకుంటారు. ఇక్కడి నుండి జమరాత్ లపై విసరటానికి, చిన్న చిన్న కంకర రాళ్ళు ఏరుకుంటారు. ము'జ్దలిఫా 'హరమ్ సరిహద్దులలోనే ఉంది.
[1] మిగిలిన 'హజ్ విధులు 10,11,12 మరియు 13 జిల్ 'హజ్ లో తేదీలలో పూర్తి చేయాలి. ఈ రోజులలో ఇ'హ్రామ్ లేకుండానే మక్కాకు పోయి తవాఫె 'జియారహ్ మరియు స'యీ అల్ - 'హజ్ పూర్తి చేసుకోవాలి. ఈ మూడు రోజులు మీనాలోనే ఉండి, అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించాలి. 10వ తేదీన సూర్యోదయం తరువాత కేవలం చివరి (జమరతుల్ - 'అఖబహ్)పై - ఏదైతే మక్కా వైపుకు ఉందో 7 చిన్న చిన్న కంకర రాళ్ళు రువ్వాలి. 11 మరియు 12 తేదీలలో "జుహ్ర్ నమా'జ్ తరువాత మూడు జమరాత్ ల పైననూ ఒక్కొక్క దానిపై 7 చొప్పున కంకర రాళ్ళు రువ్వాలి. జమరాత్ : అంటే ఇస్మా'ఈల్ ('అ.స.)ను అతని తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.), అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జి'బ్హ్ చేయటానికి తీసుకొని పోయేటప్పుడు, షై'తాన్ వారిని, అల్లాహుతా'ఆలా ఆజ్ఞను ఉల్లంఘించటానికి, ప్రేరేపించిన మూడు చోట్లలో నియమించిన గుర్తులు.
[1] తష్రీక్ దినాలలో అంటే జు'ల్-'హిజ్జహ్ 11, 12, 13 తేదీలలో ఫ'ర్ద్ నమా'జ్ ల తరువాత తక్బీర్ చదవాలి : "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్." కంకర రాళ్ళు విసురునపుడు ప్రతి కంకరరాయి విసిరిన తర్వాత ఈ తక్బీర్ చదవటం సున్నత్. (నీల్ అల్ అవ్ తార్ పుస్తకం - 5, పేజీ - 86. [2] మూడు జమరాతులపై 11 మరియు 12 జు'ల్ - 'హిజ్జహ్ తేదీలలో కంకర రాళ్ళను రువ్వాలి. 12వ తేదీన మ'గ్రిబ్ కు ముందు మీనా విడువ లేక పోతే, 13వ తేదీన కూడా "జుహ్ర్ నమా'జ్ తరువాత మూడు జమరాతులపై కంకరరాళ్ళను విసిరి మీనాను విడవాలి.
[1] 'స. బు'ఖారీ, పుస్తకం - 3, 'హదీస్' నం. 637. ఇలాంటి వారి ఉదాహరణకు చూడండి, 2:8-12.
[1] అర్-రవూ'ఫు: = అర-ర'హీము, Compassionate, Kind, Merciful. చాల కనికరుడు. ఇవి రెండూ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[1] ఈ సూచనలు ఉదాహరణకు: కర్ర, మాంత్రికులను ఓడించింది, సముద్రంలో త్రోవ చేసింది, బండ నుండి 12 ఊటలను ప్రవహింపజేసింది, మేఘాల ఛాయలు ఏర్పరచింది, మన్న మరియు 'సల్వాలను దింపింది మొదలైనవి. ఇవన్నీ అల్లాహుతా'ఆలా మహిమను మరియు దైవప్రవక్త నిజాయితీలను తెలుపుతున్నాయి. అయినా సత్యతిరస్కారులు విశ్వసించలేదు.
[1] అంటే తౌ'హీద్: ఏకదైవ సిద్ధాంతంపై ఉండటం. ఆదమ్ ('అ.స.) నుండి నూ'హ్ ('అ.స.) వరకు ప్రజలంతా ఏకదైవ సిద్ధాంతంపై, తమ ప్రవక్తలను అనుసరిస్తూ వచ్చారు. నూ'హ్ ('అ.స.) కాలంలో షై'తాన్ కలతలు రేకెత్తించటం వలన వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సత్యతిరస్కారం మరియు షిర్క్ వ్యాపించాయి. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) ప్రవక్తలను దివ్యగ్రంథాలతో - వారి భేదాభిప్రాయాలను దూరం చేయటానికి - పంపాడు (ఇబ్నె - కసీ'ర్).
[1] విశ్వాసులకు అల్లాహ్ (సు.తా.) సహాయం తప్పక లభిస్తుంది.
[1] ఈ ఖర్చు, నఫిల్ 'సదఖాత్ గురించి ఉంది. విధిగా ఇవ్వవలసిన 'జకాత్ కాదు. ఎందుకంటే, తల్లిదండ్రులకు 'జకాత్ చెల్లదు. వారిని పోషించటం కుమారుల బాధ్యత. మైమూన్ బిన్ మహ్రాన్ అన్నారు: 'గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ఖర్చు చేయటంలో, ఇంట్లో పెట్టే డ్రాయింగ్స్ గానీ, లేక సంగీత సాధనాలు గానీ, లేక ఇంటి అలంకరణకు వేసే పర్దాలు గానీ లేవు.' అంటే ఇలాంటి వస్తువుల మీద ఖర్చు చేయటం అవాంఛనీయమైన వ్యర్థపు ఖర్చే.
[1] చూడండి, 2:190-193, 22:39.
[1] నిషిద్ధ మాసాలు హిజ్రీ శకపు 1, 7, 11 మరియు 12వ నెలలు, వివరాలకు చూడండి, 2:194 మరియు దాని వ్యాఖ్యానం 1. పైన పేర్కొన్న నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు ముందు కూడా అరేబియాలో నిషిద్ధంగా ఉండేది. ఈ ఆయత్ అవతరణను గురించి ఇలా ఉంది : ఒక 'స'హాబీల దళం రజబ్ నెలలో ఒక సత్య తిరస్కారిని చంపి మరికొందరిని ఖైదీలుగా తీసుకుంటారు. అప్పుడు ఆ 'స'హాబీలకు రజబ్ నెల ప్రారంభమైనది తెలియదు. అప్పుడు సత్యతిరస్కారులు : "ఈ ముస్లింలు నిషిద్ధ మాసాలను కూడా లెక్క చేయడం లేదు." ని నిందిస్తారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. [2] చూడండి, 2:191 వ్యాఖ్యానం 2.
[1] చూడండి, 4:43, 5:90-91. 'స. బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 383, 'స. బు'ఖారీ, పుస్తకం - 7, 'హదీస్' నం. 481, 483, 484. [2] అంటే తమ పోషణలో ఉన్న వారి అవసరాలను పూర్తి చేసిన తరువాత. ఉన్నదంతా ఖర్చు పెట్టి, తరువాత అవసరం పడితే ఇతరుల ముందు చేయి చాపవలసిన పరిస్థితి కూడా తెచ్చుకోరాదు.
[1] తు'ఖాలి'తూహుమ్: వారితో కలసి మెలసి ఉండండి. అంటే ఆదాయాలు మరియు ఖర్చులలో, వ్యాపారంలో మొదలైన వాటిలో కలిసి మెలిసి ఉంటే, ఫర్వాలేదు, కాని వారి సంపదలను కబళించుకోవటానికి ప్రయత్నించరాదు. వారి మేలును మీ మేలుగా పరిగణించాలి.
[1] దైవప్రవక్త 'స'అస) ప్రవచనం : "స్త్రీని వివాహమాడటానికి నాలుగు విషయాలను గమనించాలి. అవి: 1)ఆస్తిపాస్తులు, 2)పుట్టుపూర్వోత్తరాలు, వంశం 3) అందం, ఆకర్షణీయత మరియు 4) ధర్మపరాయణత." మీరు ధర్మపరాణురాలైన స్త్రీనే ఎంచుకోండి. ('స. బు'ఖారీ, కితాబ్ అన్నికా'హ్, 'స. ముస్లిం, కితాబ్ అర్ర'దా'అ).
[1] స్త్రీల ఋతుకాలం: ప్రతి చంద్ర మాసంలో 4-5 రోజుల వరకు రక్తం ప్రసరించే కాలం. యూదులు మరియు ఇతర జాతుల వారు ఋతుకాలంలో స్త్రీలను వేరే గదులలో దూరంగా ఉంచేవారు. వారిని వంటింటిలోకి కూడా పోనిచ్చేవారు కాదు. కావున ఈ విషయం గురించి, 'స'హాబీలు ప్రవక్త ('స'అస) గారిని ప్రశ్నించగా, ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఇందులో స్త్రీలతో ఋతుకాలంలో సంభోగం మాత్రమే నిషేధించబడింది. వారు వంట చేయటం, ఒకే గదిలో భర్తతో కలిసి ఒకే మంచంపై పరుండటం నిషేధించబడలేదు. [2] అల్లాహ్ (సు.తా.) ఆదేశించిన చోటు నుండి అంటే సంతానం పుట్టే చోటు నుండి మాత్రమే. ఇతర ఏ చోట్ల నుండి కూడా కాదు. దీనితో విశదమయ్యేది ఏమిటంటే, భార్యతో కూడా మలమార్గం ద్వారా సంభోగం చేయటం నిషిద్ధం ('హరాం).
[1] ఇక్కడ పంటపొలం అంటే సంతానం ఇచ్చేవారు. ఏ విధంగానైతే పొలం నుండి ఫలం లభిస్తుందో అదే విధంగా స్త్రీల నుండి సంతతి ఫలిస్తుంది. ఇక్కడ కూడా మీరు కొరిన పద్ధతిలో పంటపొలంలోకి మాత్రమే పొండి, కాని ఇతర చోట్ల నుండి పోకండి అంటే స్త్రీ మర్మాంగం నుండే సంభోగం చేయండి. ఇతర మార్గాల ద్వారా చేయకండి అని భావం. (ఇబ్నె-కసీ'ర్).
[1] మీరు కోపంలో ఉన్నప్పుడు కూడా ఫలానా వ్యక్తికి ఉపకారం చేయనని అల్లాహుతా'ఆలా పేరుతో ప్రమాణం చేయకండి. దీని కఫ్ఫారా 5:89లో విశదీకరించబడింది. చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 621.
[1] 'హలీమున్: The Fore-Bearing, Clement. సహనశీలుడు, ఓర్పు గలవాడు, సౌమ్యుడు, విశాల హృదయుడు, శిక్షించటంలో తొందరపడనివాడు. అల్ - 'హమీము, అర్ - రషీదు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. చూడండి, 11:87.
[1] ఈలా: అంటే శపథం. ఏ వ్యక్తి అయినా తన భార్యతో ఇన్ని నెలలు కలువనని శపథం చేసి ఆ గడువు పూర్తి కాక ముందే ఆమెతో కలిస్తే కఫ్ఫారా చేయాలి. ఒకవేళ ఆ గడువు 4 నెలల కంటే ఎక్కువ ఉంటే - అతడు ఆమెను 4 నెలల కంటే ఎక్కువ కాలం వ్రేలాడ నివ్వలేడు కావున - నాలుగు నెలల తరువాత ఆమెతో ఆదరంగా దాంపత్య జీవితం సాగించాలి. లేదా ఆదరంగా సాగనంపాలి. (ఇబ్నె - కసీ'ర్).
[1] ఈ శాసనం గర్భవతి అయిన స్త్రీకి వర్తించదు. వారి వేచి యుండే సమయం ('ఇద్దత్) కాన్పు వరకు ఉంటుంది. మరియు నికా'హ్ తరువాత సంభోగం కాని స్త్రీకి కూడా వర్తించదు. ఆమెకు 'ఇద్దత్ గడువు ఉండదు. మరియు ఋతుస్రావం ప్రారంభం కాని స్త్రీ మరియు ఋతుస్రావం ఆగిన స్త్రీకి కూడా వర్తించదు. వారి గడువు మూడు మాసాలు, (ఇబ్నె-కసీ'ర్). చూడండి, 65:1-7. ఇతర స్త్రీలు భర్త మరణించిన తరువాత నాలుగు మాసాల పది రోజులు వేచి ఉండాలి. (2:234) [2] ఇక్కడ గర్భం మరియు ఋతుస్రావం రెండింటిని కూడా దాచ వద్దని అర్థం. [3] మగవారికి ఉన్న ఆధిక్యత, వారి శారీరక బలం, వారికున్న జిహాద్ అనుమతి, వారసత్వంలో ఆధిక్యత మరియు భార్యాపిల్లలను మరియు కుటుంబం వారిని పోషించే బాధ్యత మొదలైనవి.
[1] భర్త తన భార్యను 'ఇద్దత్ గడువులోపల కేవలం రెండుసార్లు మాత్రమే తిరిగి స్వీకరించవచ్చు. అంటే మొదటిసారి ఇచ్చిన విడాకుల తరువాత మరియు రెండవసారి ఇచ్చిన విడాకుల తరువాత. మూడవసారి విడాకులిచ్చిన తరువాత 'ఇద్దత్ గడువులోపల భార్యను తిరిగి స్వీకరించే అనుమతి లేదు. 'అ'త్తలాఖు మర్రతాన్' దీని అర్థం ఏమిటంటే ఒకేసారి మూడు విడాకులు పూర్తికావు. అంటే ఒకే సమయంలో 'తలాఖ్ అని ఎన్నిసార్లు పలికినా అది ఒకే 'తలాఖ్ గా పరిగణించబడాలి. [2] స్త్రీ విడాకులు కోరితే, సమంజసమైన కారణం చూపి, పరిహారమిచ్చి లేక మహ్ర్ వాపసు ఇచ్చి, ఖుల'అ తీసుకోవచ్చు. న్యాయస్థానం ఈ విషయంలో ఆమెకు తోడ్పడుతుంది. పురుషుడు అంగీకరించని పక్షంలో న్యాయాధికారి స్త్రీ చూపిన కారణాలతో ఏకీభవిస్తే, వారి వివాహబంధాన్ని రద్దు చేయవచ్చు (అబూ - దావూద్, తిర్మిజీ', నసాయీ' - ఫ'త్హ అల్ - ఖదీర్). [3] 'స. బు'ఖారీ, పుస్తకం - 7, 'హదీస్' నం. 197.
[1] ఈ 'ఇద్దత్ గడువు ప్రతి స్తీకి వర్తిస్తుంది. సంభోగం కాని స్త్రీ అయినా లేక ముసలిది అయినా సరే! కాని గర్భవతి అయిన స్త్రీ మాత్రం కాన్పు వరకు వేచి ఉండాలి, (65:4). ఈ గడువు కాలంలో వారు తమ మృత భర్త ఇంటిలోనే ఉండాలి. (ఇబ్నె - కసీ'ర్).
[1] అంటే భర్త, ఎందుకంటే వివాహబంధాన్ని త్రెంచటం అతని అధికారంలో ఉంది. కావున అతడు స్త్రీకి మహ్ర్ చెల్లించి ఉంటే, ఆమెను తాకక పూర్వమే విడాకులిస్తే అందులో నుండి ధర్మసమ్మతంగా సగం తీసుకోవచ్చు, లేదా పూర్తిగా విడిచి పెట్టవచ్చు.
[1] అంటే అ'స్ర్ నమా'జ్, దైవప్రవక్త ('స'అస) కందక యుద్ధ దినమున 'అ'స్ర్ నమా'జ్ ను మధ్య నమా'జ్ గా పేర్కొన్నారు. 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 527, 528.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 5, 'హదీస్' నం. 451. అంటే శత్రుభయం ఉంటే.
[1] భర్త మరణిస్తే 'ఇద్దత్ గడువు 4 నెలల 10 రోజులు. చూడండి, 4:12వ ఆయతులో భర్త ఆస్తిలో భార్యకు విధిగా భాగం నిర్ణయించబడి ఉంది. కాబట్టి వీలునామా వ్రాసే అవసరం లేదు.
[1] ఇది ఒక ప్రాచీన సమాజపు కథ, దీనిని గురించి ఏ 'హదీస్' లేదు. కొందరు దీనిని ఇస్రాయీ'ల్ సంతతి వారిలోని ఒక ప్రవక్త కాలపు కథ, కావచ్చని అంటారు. బహుశా, హిజ్కీల్ ('అ.స.) కాలపు విషయమై ఉండవచ్చు.
[1] అంటే అల్లాహ్ (సు.తా.) మార్గంలో మరియు జిహాద్ కొరకు ధనాన్ని ఖర్చు చేయడం.
[1] ఇక్కడ ప్రవక్త ఉండగా; బనీ ఇస్రాయీ'ల్ వారు, తమ ప్రవక్త సామ్యూల్ (అ.స.)తో: "మాకొక రాజును నియమించు." అని అడగటం, అల్లాహుతా'ఆలాకు అంగీకారమైనదే కాబట్టి ఖుర్ఆన్ లో పేర్కొనబడింది. కాని అట్టి రాజు దైవభీతి గలవాడు, న్యావంతుడు అయితే, అది ధర్మసమ్మతమే కాక వాంఛనీయం కూడాను. చూడండి, 5:20
[1] చూడండి, 2:115 వ్యాఖ్యానం 1.
[1] ఈ నది జొర్డాన్ మరియు ఫల'స్తీన్ ల మధ్య ఉంది.
[1] దావూద్ ('అ.స.) 'తాలూత్ సైన్యంలో ఒక సిపాయి. అతను జాలూత్ ను సంహరించారు. [2] ఇందులో అల్లాహ్ (సు.తా.) యొక్క ఒక సంప్రదాయం (సున్నత్) ఉన్నది. ఆయన మానవులలోని ఒక వర్గం ద్వారా, అధికారం మరియు దుర్మార్గం మీద ఉన్న, మరొక వర్గాన్ని అంతమొందిస్తాడు. చూడండి, 22:38-40.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 331; 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 735.
[1] చూడండి, 17:55. [2] మూసా ('అ.స.) తో అల్లాహ్ (సు.తా.) మాట్లాడిన దానికి చూడండి, 4:164. 'ఈసా ('అ.స.) సూచనల కొరకు చూడండి, 3:46, 49. [3] ఈ విధమైన ఆయత్ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. అల్లాహ్ (సు.తా.)కు తాను అవతరింపజేసిన ధర్మంలో భేదాభిప్రాయాలు కల్పించటం ఏ మాత్రం నచ్చదు. ప్రజలంతా ఆయన అవతరింపజేసిన ధర్మాన్నే అనుసరించి నరకాగ్ని నుండి రక్షించబడాలనే అల్లాహుతా'ఆలా కోరిక. కావున ఆయన ప్రవక్తలను మానవుల నుండి ఎన్నుకొని వారిపై దివ్యగ్రంథాలను అవతరింపజేస్తాడు మరియు మ'హమ్మద్ ('స' అస) ను చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అతని తరువాత ఖలీఫాలు మరియు ధర్మశాస్త్రవేత్తలు, ద'వఅహ్ తో అల్లాహ్ (సు.తా.) ధర్మం (ఇస్లాం) ను వ్యాపింపజేస్తున్నారు.
[1] చూడండి, 21:28.
[1] ఈ ఆయత్ ఆయతుల్ - కుర్సీ అనబడుతుంది. 'హదీస్' లలో దీని యొక్క ఎన్నో శుభాలు పేర్కొనబడ్డాయి. దీనిని రాత్రి నిద్రపోవటానికి ముందు చదువటం వలన రాత్రంతా షై'తాన్ నుండి రక్షణ దొరుకుతుంది. ప్రతి నమా'జ్ తర్వాత కూడా చదివితే ఎన్నో పుణ్యాలు ఉన్నాయి. ఇందులో అల్లాహుతా'ఆలా యొక్క ఏకత్వం మరియు ఆయన మహిమలు చెప్పబడ్డాయి. [2] అల్ - 'హయ్యు: The Ever-Living. సజీవుడు, నిత్యుడు, నిత్యజీవుడు. [3] అల్ - ఖయ్యూమ్: By whom all things subsist. విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు, శాశ్వితుడు. [4] తఫ్సీర్ అల్ - ముయస్సర్ లో దీని తాత్పర్యం ఈ విధంగా ఇవ్వబడింది: "వారికి ముందు సంభవించనున్నది మరియు ఇంతకు ముందు సంభవించిందీ అన్నీ అల్లాహ్ (సు.తా.) కు బాగా తెలుసు." దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది : "వారికి ముందు (పరలోకంలో) సంభవించనున్నదీ మరియు వెనక (ఇహలోకంలో) సంభవించిందీ, అన్నీ అల్లాహుతా'ఆలా కు బాగా తెలుసు." [5] కుర్సీ: కొందరు వ్యాఖ్యాతలు దీనిని, పాదాలు పెట్టే చోటన్నారు. కొందరు జ్ఞానం, మరికొందరు విశ్వసామ్రాజ్యాధిపత్యం, మరికొందరు సింహాసనం ('అర్ష్) అన్నారు. కాని అల్లాహ్ (సు.తా.) యొక్క 'సిఫాత్ లను దివ్యఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్' లలో బోధించినట్లుగా, వాటికి ఏ విధమైన తాత్పర్యాలు ఇవ్వకుండా వాటిని విశ్వసించాలి. అంటే ఇది ఒక కుర్సీ, 'అర్ష్ కాదు, మరొకటి. అది ఎలా ఉంటుంది, దానిపై అల్లాహుతా'ఆలా ఎలా కూర్చుంటాడు మేము వివరించలేము, ఎందుకంటే ఆ వాస్తవం మనకు తెలియదు. [6] అల్ - 'అలియ్యు : The Most High, He above whom is nothing. మహోన్నతుడు, అత్యున్నతుడు. చూడండి, 6:100. ఇంకా చూడండి, అల్ - ముత'ఆలి, 13:9, సర్వోన్నతుడు, ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, అల్ - అ'అలా, 87:1.
[1] ఇస్లాం ధర్మం స్వీకరించమని ఎవ్వరినీ బలవంతం చేయరాదు. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) మంచీ-చెడూ, అనే రెండు మార్గాలను చూపి, వాటిని అనుసరించటం వల్ల లభించే ప్రతిఫలాలను కూడా స్పష్టపరచాడు. కాని అల్లాహ్ (సు.తా.) మార్గాన్ని అనుసరిస్తూ దానిని ఇతరులకు బోధించటాన్ని విరోధించే వారి, అత్యాచారాన్ని నిర్మూలించటానికి ధర్మపోరాటం (జిహాద్) చేయాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైన ధర్మాన్ని అనుసరించే స్వాతంత్ర్యం ఉంది. [2] 'తా గూత్ కు ఎన్నో అర్థాలున్నాయి. ముఖ్యంగా అల్లాహుతా'ఆలాకు బదులుగా ఆరాధించే ప్రతి వస్తువు, అంటే షై'తాన్, విగ్రహం, రాయి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దైవదూతలు, మానవులు, జిన్నాతులు, గోరీలు, సాధు సన్యాసులు, సత్పురుషులు, మొదలైనవి.
[1] ఈ వ్యక్తి 'ఉజైర్ ('అ.స.) అని కొందరు స'హాబీల మరియు తాబయీన్ ల అభిప్రాయం. నిజం అల్లాహ్ (సు.తా.)కే తెలుసు.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం:"పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) మూడు రకాల వ్యక్తులతో మాట్లాడడు. వారిలో ఒకడు, తాను చేసిన మేలును మాటిమాటికి చెప్పుకునేవాడు." ('స. ముస్లిం).
[1] మహాప్రవక్త ('స'అస) ప్రవచనం: "అల్ కలిమతు తయ్యిబ్ సదఖా!" మంచి మాట పలుకటం కూడా దానమే. ('స. ముస్లిం, కితాబ్ అ'జ్ 'జకాత్). [2] 'గనియ్యున్ (అల్ - 'గనియ్యు): Self-Sufficient, Free from Want. స్వయంసమృద్ధుడు, నిరపేక్షాపరుడు, సర్వసంపన్నుడు. 6:133. అల్ - ముగ్ ని: (సేకరించబడిన పదం) భాగ్యదాత, ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[1] దీని అర్థం : ఒకడు బండ మీద ఉన్న మట్టిలో విత్తనం నాటిన తరువాత పెద్ద వర్షం కురిసి ఆ మట్టి అంతా కొట్టుకొని పోతే, ఆ విత్తనం ఏ విధంగా ఫలించగలదు ? అదే విధంగా దానధర్మాలు చేసేవారు తాము చేసిన మేలు పదే పదే చెప్పి, ఉపకారం పొందిన వ్యక్తిని బాధ పెడితే వారి కెట్టి ప్రతిఫలం దొరుకదు.
[1] ఇబ్నె - 'అబ్బాస్ మరియు 'ఉమర్ (ర'ది.'అన్హుమ్) ల కథనం: "ఇది ఆ వ్యక్తి ఉదాహరణ, ఎవడైతే తన జీవితమంతా మంచికార్యాలు చేసి చివరి రోజులలో షై'తాన్ వలలో చిక్కుకొని అల్లాహ్ (సు.తా.)కు అవిధేయుడై పోతాడో! అలాంటి వాడు చేసిన పుణ్యకార్యాలన్నీ వ్యర్థమై పోతాయి." ('స. 'బుఖారీ, కితాబ్ అల్ తఫ్సీర్).
[1] 'హమీదున్ (అల్-'హమీదు): చూడండి, 14:1 Praiseworthy, He who is Praised, in every case. ప్రశంసనీయుడు, ప్రశంసార్హుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] వాసి'ఉన్: సర్వవ్యాప్తి, సర్వోపగతుడు, సర్వం తెలిసినవాడు, అపారుడు, ఉదారుడు. విస్తారుడు. చూడండి, 2:115.
[1] 'హిక్మతున్: అంటే, వివేకం, తెలివి, జ్ఞానం, సూక్ష్మబుద్ధి, నేర్పు, ప్రపంచజ్ఞానం మొదలైనవి అని అర్థం. ఇక్కడ ఖుర్ఆన్ ను మరియు దైవప్రవక్త ('స'అస) సంప్రదాయాలను అర్థం చేసుకొని, వాటి ప్రకారం నడచుకోవటం అని అర్థం. ఇద్దరు వ్యక్తులతో ఈర్ష్య పడవచ్చు. 1) అల్లాహ్ (సు.తా.) ధనం ప్రసాదించగా, అతడు దానిని అల్లాహుతా'ఆలా మార్గంలో ఖర్చు చేసేవాడు. 2) అల్లాహ్ (సు.తా.) వివేకం ప్రసాదించగా, అతడు దానితో న్యాయమైన తీర్పు చేసేవాడు మరియు ఇతరులకు దానిని బోధించేవాడు, ('స. బు'ఖారీ, కితాబ్ అల్ 'ఇల్మ్ వల్ 'హిక్మహ్).
[1] ఏదైనా మంచి పనికి పూనుకొని అది పూర్తి అయితే నేను అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఇంత ఖర్చు చేస్తాను, లేక సత్కార్యం చేస్తాను, అని మొక్కుబడి చేసుకుంటే! దానిని పూర్తి చేయాలి. అల్లాహ్ (సు.తా.) పేరట చేసే మొక్కుబడి కూడా, నమా'జ్ మరియు ఉపవాసం మాదిరిగా అల్లాహ్ (సు.తా.) ఆరాధనయే. కాబట్టి అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల పేరట మొక్కుబడి చేయటం షిర్క్ అంటే అల్లాహ్ (సు.తా.) క్షమించని మహాపాపం.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 504.
[1] రిబా': వడ్డీ, అంటే ఎక్కువ తీసుకోవటం. ఒకనికి అప్పు ఇచ్చి, స్వంత ఉపయోగానికైనా సరే లేక వ్యాపారానికైనా సరే - ఇచ్చిన దాని కంటే ఎక్కువ తీసుకోవటమే - వడ్డీ. అది 'హరామ్. అది డబ్బు అయినా సరే, లేక ఏ వస్తువు అయినా సరే. చూడండి, 30:39.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 3, 'హదీస్' నం. 299. మరియు 'స. బు'ఖారీ పుస్తకం - 7, 'హ. నం. 845.
[1] 'స. బు'ఖారీ, పుస్తకం - 3, 'హదీస్' నం. 506 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 9, 'హదీస్' నం. 171.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 687.
[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం: 'ఇది దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పై అవతరింపజేయబడిన చివరి ఆయత్ ('స. బు'ఖారీ మరియు ఫ'త్హ అల్ - బారీ).
[1] ఈ ఆయత్ ఖుర్ఆన్ లోని అన్ని ఆయత్ ల కంటే పెద్దది. దీనిని ఆయతె దైన్ అంటారు. అప్పు ఇచ్చి పుచ్చుకోవడం ఎంతో ముఖ్య విషయం. 'హదీస్'లలో : వడ్డీ దొరకదని అప్పు ఇవ్వడం మానుకోకూడదని మరియు అప్పు ఇచ్చే వానికి ఎంతో పుణ్యముందని పేర్కొనబడింది. కాని, ఇచ్చేవానికి అతని సొమ్ము తిరిగి రాగలదనే నమ్మకం కూడా ఉండాలి. దానికి మూడు విషయాలు సూచించబడ్డాయి. 1) దాని గడువు నిర్ణయించుకోవాలి. 2) దానిని వ్రాయించుకోవాలి. 3) ఇద్దరు ముస్లిం పురుషులు లేక ఒక ముస్లిం పురుషుడు మరియు ఇద్దరు ముస్లిం స్త్రీలను సాక్షులుగా పెట్టుకోవాలి.
[1] తాకట్టు యొక్క ఉద్దేశం, కేవలం అప్పు ఇచ్చేవాడి సొమ్ము తిరిగి అతనికి దొరుకు తుందనే యథార్థానికే! అతనికి తాకట్టు పెట్టుకొన్న వస్తువును ఉపయోగించుకునే హక్కు లేదు. అది వడ్డి అవుతుంది. కాని తాకట్టు పెట్టుకున్న వస్తువుపై ఆదాయం వస్తే దాని నుండి దాని ఖర్చు తీసి మిగిలింది దాని యజమానికి ఇవ్వాలి. చూడండి, 'స. బు'ఖారీ పుస్తకం - 3, 'హ. నం. 685.
[1] ఆ ఆయత్ అవతరింపజేయబడినపుడు స'హాబీలు దైవప్రవక్త ('స'అస) దగ్గర హాజరై ఇలా విన్నవించుకున్నారు: "ఓ ప్రవక్తా('స'అస)! నమా'జ్, ఉపవాసం, 'జకాత్ మరియు జిహాద్ మా శక్కికి మించినవి కావు. కాని మనస్సులో పుట్టే ఆలోచనలపై మాకు అదుపు లేదు కదా! అయినా అల్లాహుతా'ఆలా వాటి లెక్క తీసుకుంటానని అంటున్నాడు కదా!" అప్పుడు దైవప్రవక్త ('స'అస) ఇలా సెలవిచ్చారు: "మీరిప్పుడు కేవలం విన్నాము మరియు విధేయుల మయ్యాము" అని మాత్రమే అనండి. అప్పుడు అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ అవతరిపజేశాడు: "అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు." (ఇబ్నె - కసీ'ర్, ఫ'త్తహ అల్ ఖదీర్). దీనిని గురించి ఇంకా ఈ 'హదీస్' కూడా ఉంది: "అల్లాహుతా'ఆలా నా ఉమ్మత్ వారి మనస్సులలో వచ్చిన విషయాలను క్షమిస్తాడు. కాని నాలుకతో పలికిన దానిని మరియు అమలు పరచిన దానిని లెక్కలోకి తీసుకుంటాడు." (బు'ఖారీ, ముస్లిం).
[1] ఈ చివరి రెండు ఆయత్ లు ఎంతో ఘనత గలవి. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: ఎవరైనా రాత్రి ఈ రెండు ఆయత్ లను చదివితే చాలు. ('స. బు'ఖారీ, పుస్తకం - 5, 'హదీస్' నం. 345). అంటే అల్లాహ్ (సు.తా.) అతనిని రక్షిస్తాడు. మరొక 'హదీస్' లో మేరాజ్ రాత్రిలో దైవప్రవక్త ('స'అస) కు దొరికిన మూడు విషయాలలో ఒకటి, ఈ రెండు ఆయతులు. ('స. ముస్లిం).