ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
59 : 17

وَمَا مَنَعَنَاۤ اَنْ نُّرْسِلَ بِالْاٰیٰتِ اِلَّاۤ اَنْ كَذَّبَ بِهَا الْاَوَّلُوْنَ ؕ— وَاٰتَیْنَا ثَمُوْدَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوْا بِهَا ؕ— وَمَا نُرْسِلُ بِالْاٰیٰتِ اِلَّا تَخْوِیْفًا ۟

మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప![1] మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు.[2] మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే! info

[1] పూర్వకాలపు ప్రజలు తమ ప్రవక్తల నుండి నిదర్శనాలు (ఆయాత్) కోరారు. ఆ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు విశ్వాసులు కాలేదు. దాని ఫలితంగా వారిపై అల్లాహ్ (సు.తా.) శిక్ష పడి వారు నాశనం చేయబడ్డారు. ఇదే విధంగా మక్కా ముష్రిక్ లు కూడా దైవప్రవక్త ('స'అస) నుండి నిదర్శనాలు కోరారు. మక్కా పర్వతాలను బంగారంగా మార్చమన్నారు. పూర్వ జాతి వారి వలే వీరూ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విశ్వసించరని మరియు వారంతా నాశనం చేయబడతారని అతను ('స'అస) నిదర్శనాలను కోరలేదు. (వివరాలకు చూడండి, ముస్నద్ అ'హ్మద్, పుస్తకం-1, పేజీ 258) [2] ఆ ఆడ ఒంటె నిదర్శనం కొరకు చూడండి, 7:73 మరియు 54:27.

التفاسير:

external-link copy
60 : 17

وَاِذْ قُلْنَا لَكَ اِنَّ رَبَّكَ اَحَاطَ بِالنَّاسِ ؕ— وَمَا جَعَلْنَا الرُّءْیَا الَّتِیْۤ اَرَیْنٰكَ اِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُوْنَةَ فِی الْقُرْاٰنِ ؕ— وَنُخَوِّفُهُمْ ۙ— فَمَا یَزِیْدُهُمْ اِلَّا طُغْیَانًا كَبِیْرًا ۟۠

"నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు." అని మేము నీతో చెప్పిన విషయం (జ్ఞాపకం చేసుకో)! మేము నీకు (ఇస్రా రాత్రిలో) చూపిన దృశ్యం[1] - మరియు ఖుర్ఆన్ లో శపించబడిన (నరక) వృక్షం[2] - మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయ పెట్టడం, వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది. info

[1] దైవప్రవక్త ('స'అస) యొక్క రాత్రివేళ మస్జిద్ అల్-'హరాం నుండి మస్జిద్ అల్ అ'ఖ్సా మరియు అక్కడ నుండి సప్తాకాశాలలోనికి పోవటం మరియు తమ ప్రయాణాలలో సాక్షాత్తుగా చూసిన దృశ్యాల వివరణ విశ్వాసులకు వారి విశ్వాసాన్ని అధికం చేసింది మరియు సత్యతిరస్కారులకు వారి తలబిరుసుతనాన్ని. [2] ఆ నరకవృక్షఫలాలు, నరకవాసులకు ఆహారంగా ఇవ్వబడతాయి. దాని పేరు 'జఖ్ఖూమ్ (జెముడు వృక్షం). దాని వివరాలకు చూడండి, 37:62-66 44:43-44.

التفاسير:

external-link copy
61 : 17

وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— قَالَ ءَاَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِیْنًا ۟ۚ

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని చెప్పినపుడు; ఒక్క ఇబ్లీస్ తప్ప, అందరూ సాష్టాంగపడ్డారు.[1] అతడు అన్నాడు: "ఏమీ? నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం (సజ్దా) చేయాలా?" info

[1] ఆదమ్ ('అ.స.) వివరాలక కొరకు చూడండి, 2:30-34, 7:11-18, 15:26-41 మరియు సూరహ్ లు 18, 20, 38 కూడా.

التفاسير:

external-link copy
62 : 17

قَالَ اَرَءَیْتَكَ هٰذَا الَّذِیْ كَرَّمْتَ عَلَیَّ ؗ— لَىِٕنْ اَخَّرْتَنِ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ لَاَحْتَنِكَنَّ ذُرِّیَّتَهٗۤ اِلَّا قَلِیْلًا ۟

ఇంకా ఇలా అన్నాడు: "ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను."[1] info

[1] ఇబ్లీస్ మాటల కొరకు చూడండి, 7:16-17

التفاسير:

external-link copy
63 : 17

قَالَ اذْهَبْ فَمَنْ تَبِعَكَ مِنْهُمْ فَاِنَّ جَهَنَّمَ جَزَآؤُكُمْ جَزَآءً مَّوْفُوْرًا ۟

ఆయన (అల్లాహ్) అన్నాడు: "సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది. పరిపూర్ణ ప్రతిఫలం! info
التفاسير:

external-link copy
64 : 17

وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُمْ بِصَوْتِكَ وَاَجْلِبْ عَلَیْهِمْ بِخَیْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِی الْاَمْوَالِ وَالْاَوْلَادِ وَعِدْهُمْ ؕ— وَمَا یَعِدُهُمُ الشَّیْطٰنُ اِلَّا غُرُوْرًا ۟

మరియు నీవు నీ ధ్వనితో (మాటలతో) వారిలో ఎవరెవరిని ఆశ చూపి (ఆకర్షించగలవో) ఆకర్షించు.[1] మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు.[2] మరియు వారికి సంపదలో, సంతానంలో భాగస్వామివికా[3] మరియు వారితో వాగ్దానాలు చెయ్యి.[4] మరియు షైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి.[5] info

[1] 'సౌతిక: నీ ధ్వని అంటే పాటలు, వాద్యాలు మరియు ఇతర మోసపుచ్చే మాటలు, అని అర్థం. వీటితో ష'తాన్ మానవులను మోసపుచ్చుతాడు. [2] దళాలు అంటే - షైతాను అడుగు జాడలను అనుసరించే మానవులు, జిన్నాతులు. [3] అమ్వాల్ వ అవ్ లాద్: అంటే సంపదలు మరియు సంతానం. అంటే నిషిద్ధ ( 'హరామ్) మార్గాలతో సంపాదించి, 'హరామ్ చేష్టలలో ఖర్చు చేసే ధనసంపత్తులు మరియు వ్యభారం వల్ల వచ్చే సంతానం. [4] 'షైతాన్ వాగ్దానాలు అంటే స్వర్గనరకాలు అనేవి ఏమీ లేవు, మరణించిన తరువాత పునరుత్థానం అనేది లేదు. మన జీవితం ఈ భూలోక జీవితం మాత్రమే. కావున వీలైనంత వరకు దీని సుఖసంతోషాలను మీకు తోచినట్లు అనుభవించండి, అని ప్రజలను మోసపుచ్చటం. [5] చూడండి, 4:120

التفاسير:

external-link copy
65 : 17

اِنَّ عِبَادِیْ لَیْسَ لَكَ عَلَیْهِمْ سُلْطٰنٌ ؕ— وَكَفٰی بِرَبِّكَ وَكِیْلًا ۟

నిశ్చయంగా, నా దాసులు! వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు.[1] మరియు వారికి కార్యకర్తగా (రక్షకునిగా) నీ ప్రభువే చాలు!" info

[1] నా దాసులు: అంటే అల్లాహ్ (సు.తా.) ను నమ్ముకుని ఆయనపై ఆధారపడి, ఆయన చూపిన మార్గం మీదనే నడిచే సద్పురుషులు. అల్లాహ్ (సు.తా.) అలాంటి వారి, రక్షకుడు మరియు కార్యకర్త. షై'తాన్ కు అలాంటి వారిపై ఎలాంటి అధికారం ఉండదు. చూడండి, 14:22 మరియు 15:42

التفاسير:

external-link copy
66 : 17

رَبُّكُمُ الَّذِیْ یُزْجِیْ لَكُمُ الْفُلْكَ فِی الْبَحْرِ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ ؕ— اِنَّهٗ كَانَ بِكُمْ رَحِیْمًا ۟

మీ ప్రభువు, ఆయనే - ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి - మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా, ఆయన మీ పట్ల అపార కరుణా ప్రదాత. info
التفاسير: