[1] వలి, వలియ - నుండి వచ్చింది. వలియ దగ్గరివాడు, స్నేహితుడు, ప్రియుడు, మిత్రుడు, సహాయకుడు, ఆధారమిచ్చే, కాపాడే, ఆశ్రయమిచ్చే, పోషించే వాడు. అల్లాహ్ (సు.తా.) విశ్వాసుల వలి, అని 2:257 మరియు 3:68 లో పేర్కొనబడింది. అదే విధంగా విశ్వాసులు అల్లాహ్ (సు.తా.)కు వలి అని 10:62లో ఉంది. మరియు తాగూత్ సత్యతిరస్కారుల అవ్ లియా అని 2:257లో పేర్కొనబడింది.