[1] హిజ్రతున్: Migration, Exodus, వలసపోవటం, ప్రస్థానం, అంటే అల్లాహ్ ధర్మం కొరకు, అల్లాహ్ ప్రీతి కొరకు, తన దేశాన్ని బంధు స్నేహితులను విడిచి - అల్లాహ్ ధర్మం మీద ఉండటానికి ఆటంకాలు లేని - ఇతర దేశాలకు వెళ్ళిపోవటం. ఈ ఆయత్ లో ఇలాంటి ముహాజిర్ ల ప్రస్తావన వచ్చింది. బహుశా ఈ ఆయత్ ఆ ముహాజిర్ లను గరించి అవతరింపజేయబడి ఉండవచ్చు, ఎవరైతే మక్కా ముష్రికుల బాధలను సహించలేక 'హబషా (అబిసీనియా) కు వలస పోయారో! వారిలో 'ఉస్మాన్ (ర' ది. 'అ.) మరియు అతని భార్య దైవప్రవక్త ('స'అస) కూతురు, రుఖయ్య (ర.'అన్హా) కూడా - ఇతర దాదాపు నూరుమంది వలసపోయిన వారితో సహా - ఉన్నారు.