ఆయన (అల్లాహ్) ఆకాసం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా[1] ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బి వస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి.[2] ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరి పోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు.[3]
[1] బి ఖద్ రిహా: తమ తమ పరిమాణాన్ని బట్టి పూర్తిగా నిండి. [2] పారే నీటిపై వచ్చే నురుగు గానీ, వెండి, బంగారు కరిగించినపుడు వచ్చే నురుగు గానీ, మాలిన్యాలే. అవి ఎగిరిపోతాయి. మరియు అసలే క్రింద మిగిలిపోతుంది. [3] చూడండి, 24:39-40.