ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាតេលូហ្គូ - អាប់ឌុររ៉ហុីម ម៉ូហាំម៉ាត់​

លេខ​ទំព័រ:close

external-link copy
15 : 10

وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیَاتُنَا بَیِّنٰتٍ ۙ— قَالَ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا ائْتِ بِقُرْاٰنٍ غَیْرِ هٰذَاۤ اَوْ بَدِّلْهُ ؕ— قُلْ مَا یَكُوْنُ لِیْۤ اَنْ اُبَدِّلَهٗ مِنْ تِلْقَآئِ نَفْسِیْ ۚ— اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤی اِلَیَّ ۚ— اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟

మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు - మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారు - అంటారు: "దీనికి బదులుగా మరొక ఖుర్ఆన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి." (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఇందులో నా అంతట నేను మార్పులు చేయటం నా పని కాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా, నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే, ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను!" info
التفاسير:

external-link copy
16 : 10

قُلْ لَّوْ شَآءَ اللّٰهُ مَا تَلَوْتُهٗ عَلَیْكُمْ وَلَاۤ اَدْرٰىكُمْ بِهٖ ۖؗۗ— فَقَدْ لَبِثْتُ فِیْكُمْ عُمُرًا مِّنْ قَبْلِهٖ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

(ఇంకా ఇలా) అను: "ఒకవేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా?[1] ఏమీ? మీరిది గ్రహించలేరా?" info

[1] దైవప్రవక్తగా ఎన్నుకొనబడక ముందు ము'హమ్మద్ ('స'అస) 40 సంవత్సరాలు మక్కా వారితో నివసించారు. మరియు వారు అతనిని నమ్మకస్తునిగా (అల్-అమీన్) మరియు ఎన్నడూ అబద్ధమాడని వారి (అ'స్సాదిఖ్)గా సాక్ష్యమిచ్చేవారు. అతనికి ('స'అస) ఏ గురువు లేడు. అతను చదువటం వ్రాయటం ఎరుగరు. ఇది కూడా వారికి బాగా తెలుసు. అలాంటప్పుడు ఈ ఖుర్ఆన్ ఏదైతే ఎన్నో అద్భుత విషయాలను, విజ్ఞాన విషయాలను, నక్షత్రాల విషయాలను, ప్రాచీన ప్రవక్తల గాథలను వివరిస్తుందో, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి గాక మరెవరి తరఫు నుండి రాగలదు. ఎందుకంటే ఇందులో వేయి కంటే ఎక్కువ విజ్ఞాన (Science) విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే వైజ్ఞానికి ప్రయోగాల ద్వారా సత్యమని నిరూపించబడ్డాయి. ఇకా ఎన్నో నిరూపించబడనున్నాయి. ఇంకొక విశేషమేమిటంటే దివ్య ఖుర్ఆన్ లో సూచించబడిన వైజ్ఞానిక విషయాలలో ఇంత వరకు ఒక్కటి కూడా తప్పని నిరూపించబడలేదు. మరియు దివ్యఖుర్ఆన్ లో సూచించబడిన ఇంకా ఎన్నో వైజ్ఞానిక విషయాలను మానవుడు ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేక పోయాడు. .

التفاسير:

external-link copy
17 : 10

فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰیٰتِهٖ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الْمُجْرِمُوْنَ ۟

ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడి కంటే, లేక ఆయన సూచన (ఆయాత్) లను అబద్ధాలని తిరస్కరించే వాడి కంటే, మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు! info
التفاسير:

external-link copy
18 : 10

وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَضُرُّهُمْ وَلَا یَنْفَعُهُمْ وَیَقُوْلُوْنَ هٰۤؤُلَآءِ شُفَعَآؤُنَا عِنْدَ اللّٰهِ ؕ— قُلْ اَتُنَبِّـُٔوْنَ اللّٰهَ بِمَا لَا یَعْلَمُ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟

మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు." వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు.[1] info

[1] విశ్వంలో అల్లాహ్ (సు.తా.)కు తెలియనిది ఏదీ లేదు, అలాంటప్పుడు అల్లాహ్ (సు.తా.) కు తెలియని, ఈ సిఫారసుదారులను వీరు ఎక్కడి నుండి కల్పించి తెచ్చారు?

التفاسير:

external-link copy
19 : 10

وَمَا كَانَ النَّاسُ اِلَّاۤ اُمَّةً وَّاحِدَةً فَاخْتَلَفُوْا ؕ— وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِیَ بَیْنَهُمْ فِیْمَا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟

మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించ బడకుండా ఉండి ఉన్నట్లయితే, వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగి వుండేది.[1] info

[1] చూడండి, 2:213, 253. అల్లాహ్ (సు.తా.), పునరుత్థాన దినమున తీర్పు చేయాలనీ - మానవులకూ మరియు జిన్నాతులకూ - అంతవరకు వ్యవధినివ్వాలని నిర్ణయించి ఉండకపోతే! వీరి తీర్పుఅప్పటికప్పుడే జరిగి ఉండేది.

التفاسير:

external-link copy
20 : 10

وَیَقُوْلُوْنَ لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ۚ— فَقُلْ اِنَّمَا الْغَیْبُ لِلّٰهِ فَانْتَظِرُوْا ۚ— اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ ۟۠

మరియు వారంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అద్భుత) సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" నీవిలా జవాబివ్వు: "నిశ్చయంగా అగోచర విషయ జ్ఞానం కేవలం అల్లాహ్ కే చెందుతుంది,[1] కావున వేచి ఉండండి! నిశ్చయంగా, నేను కూడా మీతో బాటు వేచి ఉంటాను." info

[1] చూడండి, 2:105 మరియు 3:73-74.

التفاسير: