ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

అత్-తహ్రీమ్

គោល​បំណងនៃជំពូក:
الدعوة إلى إقامة البيوت على تعظيم حدود الله وتقديم مرضاته وحده.
అల్లాహ్ హద్దులను గౌరవించటానికి మరియు ఆయన ఒక్కడి మన్నతలను ముందుంచటానికి గృహములను స్థాపించటం వైపు పిలుపు info

external-link copy
1 : 66

یٰۤاَیُّهَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكَ ۚ— تَبْتَغِیْ مَرْضَاتَ اَزْوَاجِكَ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు అనుమతించిన మీ దాసిని అయిన మారియాతో ప్రయోజనం చెందటంను ఎందుకు మీ కొరకు నిషేధించుకున్నారు. దాని ద్వారా మీ సతీమణుల ఇష్టతను వారు ఆమెను ద్వేషించుకోవటం వలన మీరు కోరుకుంటూ. మరియు అల్లాహ్ మిమ్మల్ని మన్నించేవాడును మరియు మీ పై కరుణించేవాడును ?!. info
التفاسير:

external-link copy
2 : 66

قَدْ فَرَضَ اللّٰهُ لَكُمْ تَحِلَّةَ اَیْمَانِكُمْ ۚ— وَاللّٰهُ مَوْلٰىكُمْ ۚ— وَهُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟

వాస్తవానికి అల్లాహ్ మీ కొరకు పరిహారము ద్వారా మీ ప్రమాణాల నుండి బయటపడటమును ధర్మ బద్ధం చేశాడు ఒక వేళ మీరు దాని కన్న మంచి దాన్ని పొందితే లేదా ఆ విషయంలో ప్రమాణమును భంగపరచి ఉంటే. మరియు అల్లాహ్ మీకు సహాయం చేసేవాడును. మరియు మీ పరిస్థితులను గురించి,మీకు ప్రయోజనం కలిగించే వాటి గురించి ఆయనకు బాగా తెలుసు. తాను ధర్మ బద్ధం చేసే విషయంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
3 : 66

وَاِذْ اَسَرَّ النَّبِیُّ اِلٰی بَعْضِ اَزْوَاجِهٖ حَدِیْثًا ۚ— فَلَمَّا نَبَّاَتْ بِهٖ وَاَظْهَرَهُ اللّٰهُ عَلَیْهِ عَرَّفَ بَعْضَهٗ وَاَعْرَضَ عَنْ بَعْضٍ ۚ— فَلَمَّا نَبَّاَهَا بِهٖ قَالَتْ مَنْ اَنْۢبَاَكَ هٰذَا ؕ— قَالَ نَبَّاَنِیَ الْعَلِیْمُ الْخَبِیْرُ ۟

మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సా రజిఅల్లాహు అన్హా కి ప్రత్యేకించి ఒక విషయమును తెలియపరచినప్పటి సంఘటనను మీరు గుర్తు చేసుకోండి. మరియు అది ఆయన తన సతీమణి మారియాకి ఎన్నటికి దగ్గరవనని (చెప్పిన విషయం). హఫ్సా ఆ విషయమును ఆయిషాకు తెలియపరచినప్పుడు అల్లాహ్ తన ప్రవక్తకు ఆయన రహస్యం బట్టబయలు అవటంను తెలియపరిస్తే ఆయన హఫ్సాను మందలించి ఆమెకు కొంత విషయమును తెలియపరచి కొంత విషయమును తెలియపరచలేదు. అప్పుడు ఆమే ఆయనతో ఈ విషయం మీకు ఎవరు తెలియపరచారు అని ప్రశ్నించినది. ఆయన సమాధానమిస్తూ ప్రతీది తెలుసుకునే వాడు మరియు ప్రతీ గోప్యమును తెలుసుకునేవాడు నాకు తెలియపరచాడు అని పలికారు. info
التفاسير:

external-link copy
4 : 66

اِنْ تَتُوْبَاۤ اِلَی اللّٰهِ فَقَدْ صَغَتْ قُلُوْبُكُمَا ۚ— وَاِنْ تَظٰهَرَا عَلَیْهِ فَاِنَّ اللّٰهَ هُوَ مَوْلٰىهُ وَجِبْرِیْلُ وَصَالِحُ الْمُؤْمِنِیْنَ ۚ— وَالْمَلٰٓىِٕكَةُ بَعْدَ ذٰلِكَ ظَهِیْرٌ ۟

మీరు ఇద్దరు పశ్చాత్తాపం చెందటం మీపై తప్పనిసరి ఎందుకంటే మీరిద్దరి హృదయములు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దాసిని నుండి దూరం ఉండటమును మరియు ఆమెను తనపై నిషేదించుకన్న విషయమును (బయట పడటమును) అయిష్ట పడిన దాని ఇష్టత వైపునకు వాలాయి. మరియు ఒక వేళ మీరిద్దరు ఆయనకు విరుద్దంగా మరలటానికి పట్టుబట్టితే నిశ్చయంగా అల్లాహ్ ఆయన సంరక్షకుడు మరియు సహాయకుడు. మరియు అలాగే జిబ్రయీలు మరియు సత్పురుషులైన విశ్వాసపరులు ఆయనకు సంరక్షకులు మరియు ఆయనకు సహాయం చేసేవారు. మరియు దైవ దూతలు అల్లాహ్ సహాయము తరువాత ఆయనకు సహాయకులు మరియు ఆయనకు బాధ కలిగించే వారికి విరుద్దంగా సహాయం చేసే వారు. info
التفاسير:

external-link copy
5 : 66

عَسٰی رَبُّهٗۤ اِنْ طَلَّقَكُنَّ اَنْ یُّبْدِلَهٗۤ اَزْوَاجًا خَیْرًا مِّنْكُنَّ مُسْلِمٰتٍ مُّؤْمِنٰتٍ قٰنِتٰتٍ تٰٓىِٕبٰتٍ عٰبِدٰتٍ سٰٓىِٕحٰتٍ ثَیِّبٰتٍ وَّاَبْكَارًا ۟

బహుశా పరిశుద్ధుడైన ఆయన ప్రభువు ఒక వేళ ఆయన ప్రవక్త మీకు విడాకులు ఇస్తే మీకన్న మంచి భార్యలను ఆయనకు బదులుగా ప్రసాదిస్తాడు. వారు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉండేవారై ఉంటారు, ఆయనపై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచే వారై ఉంటారు. అల్లాహ్ కు విధేయులై ఉంటారు. తమ పాపములపై పశ్ఛాత్తాపము పడేవారై ఉంటారు. తమ ప్రభువును ఆరాధించేవారై ఉంటారు. ఉపవాసాలుండేవారై ఉంటారు. విధవలు మరియు ఇతరులతో వివాహం కాని కన్యలై ఉంటారు. కానీ ఆయన వారికి విడాకులివ్వ లేదు. info
التفاسير:

external-link copy
6 : 66

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قُوْۤا اَنْفُسَكُمْ وَاَهْلِیْكُمْ نَارًا وَّقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَیْهَا مَلٰٓىِٕكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا یَعْصُوْنَ اللّٰهَ مَاۤ اَمَرَهُمْ وَیَفْعَلُوْنَ مَا یُؤْمَرُوْنَ ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు మీ కొరకు,మీ ఇంటి వారి కొరకు మనుషులతో,రాళ్ళతో మండించబడే పెద్ద అగ్ని నుండి రక్షణను ఏర్పరచుకోండి. ఈ అగ్ని పై అందులో ప్రవేశించే వారిపై కఠినంగా వ్వహరించే కఠినమైన దూతలు ఉంటారు. అల్లాహ్ వారికి ఆదేశించినప్పుడు ఆయన ఆదేశమును నెరవేర్చకుండా ఉండరు. ఆయన వారికి ఇచ్చిన ఆదేశమును ఆలస్యం చేయకుండా,అశ్రద్ధ వహించకుండా నెరవేరుస్తారు. info
التفاسير:

external-link copy
7 : 66

یٰۤاَیُّهَا الَّذِیْنَ كَفَرُوْا لَا تَعْتَذِرُوا الْیَوْمَ ؕ— اِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟۠

ప్రళయదినమున అవిశ్వాసపరులతో ఇలా పలకబడును : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచినవారా మీరు చేసుకున్న అవిశ్వాస కార్యము నుండి,పాప కార్యముల నుండి ఈ రోజు వంకలు పెట్టకండి. మీ వంకలు అంగీకరించబడవు. మీరు మాత్రం ఈ రోజు మీరు ఏదైతే ఇహలోకంలో అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచారో,ఆయన ప్రవక్తలను తిరస్కరించారో దాని ప్రతిఫలం ప్రసాదించబడుతారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• مشروعية الكَفَّارة عن اليمين.
ప్రమాణము యొక్క పరిహారం ధర్మ బద్ధం చేయబడింది. info

• بيان منزلة النبي صلى الله عليه وسلم عند ربه ودفاعه عنه.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్న దాని గురించి మరియు ఆయనను సమర్ధించే దాని గురించి ప్రకటన. info

• من كرم المصطفى صلى الله عليه وسلم مع زوجاته أنه كان لا يستقصي في العتاب فكان يعرض عن بعض الأخطاء إبقاءً للمودة.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపు నుండి తన సతీమణులపై ఉన్న కరుణ ఆయన నిందించటంలో పరిశోధించలేదు. ప్రేమానురాగాలను ఉంచటానికి కొన్ని తప్పిదాలను మన్నించేశారు. info

• مسؤولية المؤمن عن نفسه وعن أهله.
విశ్వాసపరుడు తన స్వయం గురించి మరియు తన ఇంటివారి గురించి ప్రశ్నించబడుతాడు. info