ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
128 : 6

وَیَوْمَ یَحْشُرُهُمْ جَمِیْعًا ۚ— یٰمَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِّنَ الْاِنْسِ ۚ— وَقَالَ اَوْلِیٰٓؤُهُمْ مِّنَ الْاِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَّبَلَغْنَاۤ اَجَلَنَا الَّذِیْۤ اَجَّلْتَ لَنَا ؕ— قَالَ النَّارُ مَثْوٰىكُمْ خٰلِدِیْنَ فِیْهَاۤ اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ— اِنَّ رَبَّكَ حَكِیْمٌ عَلِیْمٌ ۟

ఓ ప్రవక్తా ఒకసారి ఆ రోజును గుర్తు చేసుకోండి ఏ రోజునైతే అల్లాహ్ మానవులను,జిన్నాతులను (సఖలైన్ ను) సమీకరిస్తాడు. ఆ తరువాత వారితో అల్లాహ్ ఇలా అంటాడు : ఓ జిన్నుల వర్గీయులారా మీరు మానవులను మార్గభ్రష్టులను చేయటంను,అల్లాహ్ మార్గము నుంచి వారిని ఆపటంను ఎక్కువ చేశారు. మానవుల్లోంచి వారిని అనుసరించేవారు తమ ప్రభువుకు జవాబిస్తూ ఇలా అంటారు : ఓ మా ప్రభువా మాలోంచి ప్రతి ఒక్కరు తమ తోటి వారితో లబ్ది పొందారు. జిన్ను మానవుడు తనపై విధేయత చూపటాన్ని ఆస్వాదించేవాడు. మానవుడు తన కోరికలను పొంది లబ్ది పొందేవాడు. మరియు మేము నీవు మా కోసం నిర్ధారించిన గడువుకు చేరుకున్నాము. అది ప్రళయదినము. అల్లాహ్ ఇలా అంటాడు : నరకాగ్ని మీ శాస్వత నివాసస్థలము. మీరు అందులో ఎల్లప్పుడు ఉంటారు. వారు వారి సమాధుల నుండి లేవబడటం నుండి వారు నరకమునకు చేరటం మధ్య ఏదైతే గడువు ఉన్నదో దాన్ని అల్లాహ్ తలచుకుంటే తప్ప. ఈ గడువు అల్లాహ్ వారు నరకములో శాస్వతంగా ఉండటం నుండి మినహాయించిన గడువు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు తన విధివ్రాత విషయంలో,తన నిర్వహణలో వివేకవంతుడు,తన దాసుల గురించి,వారిలో నుండి ఎవరు శిక్షకు అర్హులో తెలిసినవాడు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• سُنَّة الله في الضلال والهداية أنهما من عنده تعالى، أي بخلقه وإيجاده، وهما من فعل العبد باختياره بعد مشيئة الله.
మార్గభ్రష్టతకు లోను చేయటం,సన్మార్గం చూపటం రెండును అంటే ఆయన దానిని సృష్టించటం,దానిని కనుగొనటం అల్లాహ్ తరపు నుంచి కావటం అన్నది అల్లాహ్ సంప్రదాయం. మరియు ఆ రెండు అల్లాహ్ తలచుకున్న తరువాత దాసుని ఎంపిక ద్వారా జరిగే కార్యము. info

• ولاية الله للمؤمنين بحسب أعمالهم الصالحة، فكلما زادت أعمالهم الصالحة زادت ولايته لهم والعكس.
విశ్వాసపరుల కొరకు వారి సత్కర్మలను బట్టి అల్లాహ్ సంరక్షణ ఉంటుంది. వారి సత్కర్మలు ఎంత ఎక్కువగా ఉంటే ఆయన సంరక్షణ వారి కొరకు అంత ఎక్కువగా ఉంటుంది. మరియు దీనికి విరుద్దంగా( పాప కార్యాలు ఎక్కువగా ఉంటే సంరక్షణకు విరుధ్ధంగా ఉంటుంది. info

• من سُنَّة الله أن يولي كل ظالم ظالمًا مثله، يدفعه إلى الشر ويحثه عليه، ويزهِّده في الخير وينفِّره عنه.
ప్రతి దుర్మార్గునికి అటువంటి దుర్మార్గుడినే సన్నిహితునిగా చేయటం అల్లాహ్ సంప్రదాయం,అతడు (దుర్మార్గుడు) అతనిని చెడు చేయడానికి ఉద్భోధిస్తాడు,దానిపై అతనిని ప్రేరేపిస్తాడు,అతడిని మంచి నుండి దూరం చేస్తాడు. మరియు దానిని అతని నుండి త్యజిస్తాడు. info