ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

លេខ​ទំព័រ:close

external-link copy
51 : 56

ثُمَّ اِنَّكُمْ اَیُّهَا الضَّآلُّوْنَ الْمُكَذِّبُوْنَ ۟ۙ

ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము. info
التفاسير:

external-link copy
52 : 56

لَاٰكِلُوْنَ مِنْ شَجَرٍ مِّنْ زَقُّوْمٍ ۟ۙ

ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము. info
التفاسير:

external-link copy
53 : 56

فَمَالِـُٔوْنَ مِنْهَا الْبُطُوْنَ ۟ۚ

అప్పుడు మీ ఖాళీ కడుపులను ఆ చేదు వృక్షముతో నింపుకుంటారు. info
التفاسير:

external-link copy
54 : 56

فَشٰرِبُوْنَ عَلَیْهِ مِنَ الْحَمِیْمِ ۟ۚ

అప్పుడు దానిపై తీవ్రమైన వేడి నీళ్ళను త్రాగుతారు. info
التفاسير:

external-link copy
55 : 56

فَشٰرِبُوْنَ شُرْبَ الْهِیْمِ ۟ؕ

హుయామ్ రోగము కారణం వలన ఎక్కువ నీటిని త్రాగే ఒంటెల వలె వారు దాని త్రాగటమును అధికం చేస్తారు. info
التفاسير:

external-link copy
56 : 56

هٰذَا نُزُلُهُمْ یَوْمَ الدِّیْنِ ۟ؕ

ఈ ప్రస్తావించబడిన చేదు ఆహారము మరియు వేడి నీళ్ళు ప్రతిఫలం దినం నాడు వారికి ఇవ్వబడే ఆతిధ్యము. info
التفاسير:

external-link copy
57 : 56

نَحْنُ خَلَقْنٰكُمْ فَلَوْلَا تُصَدِّقُوْنَ ۟

ఓ తిరస్కారులారా మీరు ఉనికిలో లేనప్పటికీ మేము మిమ్మల్ని సృష్టించాము. మేము మిమ్మల్ని మరణాంతరం జీవింపజేసి లేపుతామని మీరెందుకు నమ్మరు ?! info
التفاسير:

external-link copy
58 : 56

اَفَرَءَیْتُمْ مَّا تُمْنُوْنَ ۟ؕ

ఓ ప్రజలారా మీరు మీ భార్యల గర్భాల్లో విసిరే వీర్యమును గమనించారా ?! info
التفاسير:

external-link copy
59 : 56

ءَاَنْتُمْ تَخْلُقُوْنَهٗۤ اَمْ نَحْنُ الْخٰلِقُوْنَ ۟

ఏమీ ఆ వీర్యమును మీరు సృష్టించేవారా లేదా మేము దాన్ని సృష్టించేవారమా ?! info
التفاسير:

external-link copy
60 : 56

نَحْنُ قَدَّرْنَا بَیْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوْقِیْنَ ۟ۙ

మేమే మీ మధ్య మరణమును నిర్ణయించాము. మీలో నుండి ప్రతి ఒక్కరికి ఒక సమయమున్నది దాన్ని అదిగమించటం జరగదు మరియు వెనుకకు జరగటం జరగదు. మరియు మేము అలసిపోయేవారము కాము. info
التفاسير:

external-link copy
61 : 56

عَلٰۤی اَنْ نُّبَدِّلَ اَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِیْ مَا لَا تَعْلَمُوْنَ ۟

మీరు ఉన్న మీకు తెలిసిన సృష్టి,రూపమును మేము మార్చి మీకు తెలియని సృష్టి,రూపములో మిమ్మల్ని సృష్టించే సామర్ధ్యమును కలిగిన వారము. info
التفاسير:

external-link copy
62 : 56

وَلَقَدْ عَلِمْتُمُ النَّشْاَةَ الْاُوْلٰی فَلَوْلَا تَذَكَّرُوْنَ ۟

వాస్తవానికి మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా సృష్టించామో మీకు తెలుసు. ఏమీ మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు మీరు మరణించిన తరువాత మిమ్మల్ని మరల లేపటంపై సామర్ధ్యము కలవాడని మీరు గుణపాఠం నేర్చుకుని తెలుసుకోరా ?! info
التفاسير:

external-link copy
63 : 56

اَفَرَءَیْتُمْ مَّا تَحْرُثُوْنَ ۟ؕ

ఏమీ మీరు భూమిలో నాటే బీజమును గమనించారా ?! info
التفاسير:

external-link copy
64 : 56

ءَاَنْتُمْ تَزْرَعُوْنَهٗۤ اَمْ نَحْنُ الزّٰرِعُوْنَ ۟

ఆ విత్తనమును మీరు మొలకెత్తిస్తున్నారా లేదా మేము దాన్ని మొలకెత్తిస్తున్నామా ?! info
التفاسير:

external-link copy
65 : 56

لَوْ نَشَآءُ لَجَعَلْنٰهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُوْنَ ۟

ఒక వేళ మేము ఆ పంటను నాశనం చేయదలచుకుంటే అది పక్వమునకు వచ్చి చేతికి వచ్చే సమయాన దాన్ని మేము నాశనం చేస్తాము. అప్పుడు దాని తరువాత మీరు దానికి సంభవించిన దానిపై ఆశ్ఛర్యపోతారు. info
التفاسير:

external-link copy
66 : 56

اِنَّا لَمُغْرَمُوْنَ ۟ۙ

మీరంటారు నిశ్చయంగా మేము ఖర్చు చేసిన దాన్ని నష్టపోయి శిక్షింపబడ్డాము. info
التفاسير:

external-link copy
67 : 56

بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ ۟

కాదు కాదు మేము ఆహారోపాధిని కోల్పోయాము. info
التفاسير:

external-link copy
68 : 56

اَفَرَءَیْتُمُ الْمَآءَ الَّذِیْ تَشْرَبُوْنَ ۟ؕ

ఏమీ మీరు దప్పికకు గురైనప్పుడు మీరు త్రాగే నీటిని గమనించారా ?! info
التفاسير:

external-link copy
69 : 56

ءَاَنْتُمْ اَنْزَلْتُمُوْهُ مِنَ الْمُزْنِ اَمْ نَحْنُ الْمُنْزِلُوْنَ ۟

ఏమీ ఆకాశములో ఉన్న మేఘము నుండి మీరు దాన్ని కురిపించారా లేదా మేము దాన్ని కురిపించామా ?! info
التفاسير:

external-link copy
70 : 56

لَوْ نَشَآءُ جَعَلْنٰهُ اُجَاجًا فَلَوْلَا تَشْكُرُوْنَ ۟

ఒక వేళ మేము ఆ నీటిని త్రాగటానికి,దాహం తీర్చుకోవటానికి ఉపయోగించకుండా ఉప్పగా చేయదలచుకుంటే దాన్ని చాలా ఉప్పగా చేసేవారము. మీపై కారుణ్యముగా తియ్యగా దాన్ని మీపై కురిపించినందుకు మీరు అల్లాహ్ కు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోరు. info
التفاسير:

external-link copy
71 : 56

اَفَرَءَیْتُمُ النَّارَ الَّتِیْ تُوْرُوْنَ ۟ؕ

మీ ప్రయోజనముల కొరకు మీరు వెలిగించే అగ్ని ని మీరు గమనించారా ?! info
التفاسير:

external-link copy
72 : 56

ءَاَنْتُمْ اَنْشَاْتُمْ شَجَرَتَهَاۤ اَمْ نَحْنُ الْمُنْشِـُٔوْنَ ۟

ఏ వృక్షముతో దాన్ని వెలిగించబడుతున్నదో దాన్ని మీరు సృష్టించారా లేదా మీపై దయగా మేము దాన్ని సృష్టించామా ?! info
التفاسير:

external-link copy
73 : 56

نَحْنُ جَعَلْنٰهَا تَذْكِرَةً وَّمَتَاعًا لِّلْمُقْوِیْنَ ۟ۚ

మేము ఈ అగ్నిని మీకు పరలోక అగ్నిని గుర్తు చేసే మీ కొరకు ఒక జ్ఞాపికగా చేశాము. మరియు దాన్ని మీలో నుండి ప్రయాణికుల కొరకు ప్రయోజనదాయకంగా చేశాము. info
التفاسير:

external-link copy
74 : 56

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟

ఓ ప్రవక్తా మహోన్నతుడైన నీ ప్రభువు యొక్క ఆయనకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడండి. info
التفاسير:

external-link copy
75 : 56

فَلَاۤ اُقْسِمُ بِمَوٰقِعِ النُّجُوْمِ ۟ۙ

అల్లాహ్ నక్షత్రముల స్థానాల మరియు వాటి ప్రదేశాలపై ప్రమాణం చేశాడు. info
التفاسير:

external-link copy
76 : 56

وَاِنَّهٗ لَقَسَمٌ لَّوْ تَعْلَمُوْنَ عَظِیْمٌ ۟ۙ

మరియు నిశ్చయంగా ఈ ప్రదేశముల యొక్క ప్రమాణము ఒక వేళ మీరు దానిలో ఉన్న సూచనలు మరియు లెక్క లేనన్ని గుణపాఠములు ఉండటం వలన దాని గొప్పతనమును తెలుసుకుని ఉంటే ఎంతో గొప్పది. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• دلالة الخلق الأول على سهولة البعث ظاهرة.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన బహిర్గతమైనది. info

• إنزال الماء وإنبات الأرض والنار التي ينتفع بها الناس نعم تقتضي من الناس شكرها لله، فالله قادر على سلبها متى شاء.
నీటిని కురిపించటం మరియు భూమిని మొలకెత్తించటం మరియు ప్రజలు ప్రయోజనం చెందే అగ్నిని సృష్టించటం అనుగ్రహాలు వాటిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపటమును కోరుతున్నవి. అయితే అల్లాహ్ తాను తలచినప్పుడు వాటిని తీసుకోవటంపై సామర్ధ్యము కలవాడు. info

• الاعتقاد بأن للكواكب أثرًا في نزول المطر كُفْرٌ، وهو من عادات الجاهلية.
వర్షమును కురిపించటంలో నక్షత్రములకు ప్రభావితం చేసే శక్తి ఉన్నదని విశ్వసించటం అవిశ్వాసము మరియు అది అజ్ఞాన కాలము నాటి అలవాట్లలోంచిది. info