ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

external-link copy
30 : 2

وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ جَاعِلٌ فِی الْاَرْضِ خَلِیْفَةً ؕ— قَالُوْۤا اَتَجْعَلُ فِیْهَا مَنْ یُّفْسِدُ فِیْهَا وَیَسْفِكُ الدِّمَآءَ ۚ— وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ؕ— قَالَ اِنِّیْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ ۟

అల్లాహ్ సుబ్హానహు వతఆలా తాను దైవదూతలతో మాట్లాడిన సన్నివేశాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు:నిస్సందేహంగా ఆయన భువిలో ఒకరికొకరు ప్రాతినిధ్యం వహించుచు దైవవిధేయతను (ధర్మాన్ని) స్ధాపించేందుకు మానవుణ్ని సృష్టించబోతున్నాను.అని అన్నాడు అప్పుడు దైవదూతలు విశ్లేషణ మరియు మార్గదర్శకాన్ని పొందే ఉద్దేశ్యంతో మానవుణ్ని భూమిపై ప్రతినిధిగా పంపటం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు.వారు అందులో కల్లోలాన్ని వ్యాపింపజేస్తారు మరియు దౌర్జన్యంతో నెత్తురును చిందిస్తారు(అని అభ్యర్ధించారు) మరియు మేము నీ విధేయతకు కట్టుబడి ఉండేవాళ్లం నీ పవిత్రతను కొనియాడేవాళ్లం,నీ ఘనతను చాటేవాళ్లము.మరియు వీటి నంచి అలసిపోయే వాళ్లము కాదు కదా అని అన్నారు.అప్పుడు అల్లాహ్ వారి ప్రశ్నకు సమాధానంగా:నిస్సందేహంగా మానవుని సృష్టి వెనుక మీకు తెలియని పరమార్ధాన్ని మరియు వారి ప్రాతినిధ్యం యొక్క లక్ష్యాన్ని నేను తెలిసినవాడను. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి. info

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది. info

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం. info