ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ

លេខ​ទំព័រ:close

external-link copy
49 : 2

وَاِذْ نَجَّیْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ یُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟

ఓ ఇస్రాయీలు సంతతివారా మిమ్మల్ని రకరకాల శిక్షలకు గురి చేసే ఫిర్ఔన్ అనుచరుల నుండి మేము మిమ్మల్ని రక్షించినప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి. మీకు మనుగడ లేకుండా ఉండటానికి వారు మీ మగ సంతానమును జిబాహ్ చేసి హతమార్చే వారు. మరియు వారి సేవ చేయటానికి స్త్రీలు ఉండటానికి మీ ఆడ సంతానమును వదిలి వేసే వారు మిమ్మల్ని అవమానించటంలో,కించపరచటంలో కొనసాగిపోతూ. మిమ్మల్ని ఫిర్ఔన్ మరియు అతని అనుచరుల పట్టు నుండి రక్షించటంలో మీ ప్రభువు వద్ద నుండి ఒక పెద్ద పరీక్ష ఉన్నది. బహుశా మీరు కృతజ్ఞత తెలుపుకుంటారని. info
التفاسير:

external-link copy
50 : 2

وَاِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَاَنْجَیْنٰكُمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟

మరియు మీపై మా అనుగ్రహముల్లోంచి మేము మీ కొరకు సముద్రమును చీల్చటమును గుర్తు చేసుకోండి. అప్పుడు మేము దాన్ని ఎండిన మార్గముగా చేశాము మీరు అందులో నడవసాగారు. అప్పుడు మేము మిమ్మల్ని రక్షించాము. మరియు మేము మీ శతృవులైన ఫిర్ఔన్ మరియు అతని అనుచరులను మీ కళ్ళ ముందటే ముంచివేశాము. మీరు వారి వైపు చూస్తూ ఉండిపోయారు. info
التفاسير:

external-link copy
51 : 2

وَاِذْ وٰعَدْنَا مُوْسٰۤی اَرْبَعِیْنَ لَیْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ ۟

మరియు ఈ అనుగ్రహముల్లోంచి మూసాతో నలభై రాత్రుల మా వాగ్దానమును అందులో జ్యోతిగా మరియు సన్మార్గముగా తౌరాతు అవతరణ పూర్తి అవటానికి చేసిన దాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ తరువాత ఈ గడువులో మీరు ఆవు దూడను ఆరాధించటం మాత్రం జరిగింది. మరియు మీరు మీ ఈ చర్య వలన దుర్మార్గులు అయ్యారు. info
التفاسير:

external-link copy
52 : 2

ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

ఆ పిదప మేము మీ పశ్చాత్తాపము తరువాత మిమ్మల్ని మన్నించాము. మేము మిమ్మల్ని శిక్షించలేదు బహుశా మీరు అల్లాహ్ కు ఆయన మంచి ఆరాధన,ఆయన పై విధేయత ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటారని. info
التفاسير:

external-link copy
53 : 2

وَاِذْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟

మరియు ఈ అనుగ్రహముల్లోంచి మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును సత్య,అసత్యాల మధ్య గీటురాయిగా మరియు సన్మార్గము,అపమార్గముల మధ్య వ్యత్యాసము చూపే దానిగా ప్రసాదించటమును మీరు గుర్తు చేసుకోండి. బహుశా మీరు దాని ద్వారా సత్యము వైపునకు మార్గం పొందుతారని. info
التفاسير:

external-link copy
54 : 2

وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ اِنَّكُمْ ظَلَمْتُمْ اَنْفُسَكُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوْبُوْۤا اِلٰی بَارِىِٕكُمْ فَاقْتُلُوْۤا اَنْفُسَكُمْ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ عِنْدَ بَارِىِٕكُمْ ؕ— فَتَابَ عَلَیْكُمْ ؕ— اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟

మరియు ఈ అనుగ్రహముల్లోంచి అల్లాహ్ మీకు ఆవు దూడ ఆరాధన చేయటం నుండి పశ్చాత్తాప్పడటమునకు భాగ్యమును కలిగించటమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మూసా అలైహిస్సలాం మీతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని దాన్ని మీరు ఆరాధించటంతో మీరు మీ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడ్డారు. కావున మీరు పశ్చాత్తాప్పడి మీ సృష్టి కర్త,మిమ్మల్ని ఉనికిలోకి తెచ్చిన వాడి వైపునకు మరలండి. మరియు ఇది మీలో కొందరు కొందరిని వదించటం ద్వారా. ఈ రకమైన పశ్చాత్తాపము నరకాగ్నిలో శాశ్వతంగా ఉండే వైపునకు దారి తీసే అవిశ్వాసములో కొనసాగటం కంటే మీకు ఎంతో మీలైనది. మీరు దాన్ని అల్లాహ్ అనుగ్రహం,సహాయం ద్వారా నెరవేర్చారు. ఆయన మీపై కనికరించాడు. ఎందుకంటే ఆయన ఎక్కువగా పశ్చాత్తాపమును అంగీకరించేవాడును,తన దాసులపై అపారంగా కరుణించేవాడును. info
التفاسير:

external-link copy
55 : 2

وَاِذْ قُلْتُمْ یٰمُوْسٰی لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰی نَرَی اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْكُمُ الصّٰعِقَةُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ ۟

మరియు మీ తాతముత్తాతలు మూసా అలైహిస్సలాంను ఉద్దేశించి ధైర్యముతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : అల్లాహ్ ను మా నుండి దాచుకోని కళ్ళాలా చూసేవరకు మేము నిన్ను విశ్వసించము. అప్పుడు దహించివేసే అగ్ని మిమ్మల్ని పట్టుకుంది. అప్పుడు అది మిమ్మల్ని మీలోని కొందరు కొందరిని చూస్తుండగానే చంపివేసింది. info
التفاسير:

external-link copy
56 : 2

ثُمَّ بَعَثْنٰكُمْ مِّنْ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

ఆ తరువాత మేము మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేశాము బహుశా మీరు అల్లాహ్ కు ఆయన మీపై దీన్ని అనుగ్రహించటంపై కృతజ్ఞత తెలుపుకుంటారని. info
التفاسير:

external-link copy
57 : 2

وَظَلَّلْنَا عَلَیْكُمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَیْكُمُ الْمَنَّ وَالسَّلْوٰی ؕ— كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ ؕ— وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟

మరియు మీపై మా అనుగ్రహాల్లోంచి మీరు భూమిలో నిలువ నీడ లేకుండా తచ్చాడుతూ తిరుగుతున్నప్పుడు మేము మేఘమును పంపించటం అది సూర్యుని వేడి నుండి మీకు నీడనిస్తుంది. మరియు మా అనుగ్రహముల్లోంచి మేము మీపై తేనె వలె తియ్యటి పానియమును మరియు కౌజు పిట్టలాంటి మంచి మాంసము కల చిన్న పక్షిని కురిపించటం. మరియు మేము మీతో ఇలా పలికాము : మేము మీకు ఆహారముగా ప్రసాదించిన శుద్ధమయిన వస్తువులను తినండి. మరియు ఈ అనుగ్రహాల పట్ల వారి తిరస్కారము,వాటి పట్ల వారి కృతఘ్నత వలన మేము ఏదీ తరిగించలేదు. కాని వారే తమ స్వయమునకు (తమ మనస్సులకు) వాటి పుణ్యముల భాగమును తగ్గించి వాటిని శిక్షకు అప్పగించి అన్యాయం చేసుకున్నారు. info
التفاسير:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• عِظَمُ نعم الله وكثرتها على بني إسرائيل، ومع هذا لم تزدهم إلا تكبُّرًا وعنادًا.
ఇస్రాయీలు సంతతి వారిపై అల్లాహ్ అనుగ్రహములు గొప్పగా ఉండటం మరియు అవి అధికంగా ఉండటం. ఇలా ఉన్నప్పటికి అవి వారిలో అహంకారమును మరియు మొండితనమును అధికం చేసింది. info

• سَعَةُ حِلم الله تعالى ورحمته بعباده، وإن عظمت ذنوبهم.
మహోన్నతుడైన అల్లాహ్ దయ మరియు ఆయన దాసులపై ఆయన కారుణ్యము యొక్క విశాలత్వము ఒక వేళ వారి పాపాలు ఎంత పెద్దవైనప్పటికి. info

• الوحي هو الفَيْصَلُ بين الحق والباطل.
దైవ వాణి అనేది సత్య,అసత్యాల మధ్య విభజన. info