Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

అల్-వాఖియహ్

Tujuan Pokok Surah Ini:
بيان أحوال العباد يوم المعاد.
ప్రళయదినమున దాసుల పరిస్థితుల ప్రకటన info

external-link copy
1 : 56

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ

ప్రళయం ఖచ్చితంగా సంభవించినప్పుడు. info
التفاسير:

external-link copy
2 : 56

لَیْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ۟ۘ

ఇహలోకంలో తిరస్కరించినట్లు దాన్ని తిరస్కరించే ఏ ప్రాణము దొరకదు. info
التفاسير:

external-link copy
3 : 56

خَافِضَةٌ رَّافِعَةٌ ۟ۙ

అది అపరాధులైన అవిశ్వాసపరులను వారిని నరకములో ప్రవేశింపజేసి హీనపరిచేది,దైవభీతి కలిగిన విశ్వాసపరులను వారిని స్వర్గములో ప్రవేశింపజేసి ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది. info
التفاسير:

external-link copy
4 : 56

اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۟ۙ

భూమి తీవ్రంగా కంపించబడినప్పుడు, info
التفاسير:

external-link copy
5 : 56

وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۟ۙ

మరియు పర్వతాలు తుత్తునియలుగా చేయబడినప్పుడు, info
التفاسير:

external-link copy
6 : 56

فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۟ۙ

అప్పుడు తుత్తునియలుగా చేయటం వలన అవి స్థిరత్వం లేని చెల్లాచెదురయ్యే ధూళి అయిపోతాయి. info
التفاسير:

external-link copy
7 : 56

وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ۟ؕ

ఆ రోజున మీరు మూడు రకాలుగా (వర్గములుగా) అయిపోతారు. info
التفاسير:

external-link copy
8 : 56

فَاَصْحٰبُ الْمَیْمَنَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَیْمَنَةِ ۟ؕ

ఇక తమ కుడి చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే కుడి పక్షము వారు. వారి స్థానము ఎంత గొప్పదైనది మరియు ఎంత ఉన్నతమైనది! info
التفاسير:

external-link copy
9 : 56

وَاَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۟ؕ

మరియు తమ ఎడమ చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే ఎడమ పక్షం వారు. వారి స్ధానము ఎంత దిగజారినది మరియు ఎంత చెడ్డది info
التفاسير:

external-link copy
10 : 56

وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَ ۟ۙ

ఇహలోకములో సత్కర్మలు చేయటంలో ముందుండేవారు పరలోకంలో వారే స్వర్గంలో ప్రవేశము కొరకు ముందుంటారు. info
التفاسير:

external-link copy
11 : 56

اُولٰٓىِٕكَ الْمُقَرَّبُوْنَ ۟ۚ

వారందరే అల్లాహ్ సాన్నిధ్యమును పొందేవారు. info
التفاسير:

external-link copy
12 : 56

فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟

వారు అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో రకరకాల అనుగ్రహములను అనుభవిస్తూ ఉంటారు. info
التفاسير:

external-link copy
13 : 56

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ

ఈ సమాజము నుండి మరియు పూర్వ సమాజముల నుండి ఒక పెద్ద వర్గము, info
التفاسير:

external-link copy
14 : 56

وَقَلِیْلٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ

మరియు చివరి కాలము నాటి ప్రజల్లోంచి కొంత మంది వారే సాన్నిధ్యమును పొంది ముందు ఉండేవారు. info
التفاسير:

external-link copy
15 : 56

عَلٰی سُرُرٍ مَّوْضُوْنَةٍ ۟ۙ

వారు బంగారముతో నేయబడిన పీఠాలపై ఉంటారు. info
التفاسير:

external-link copy
16 : 56

مُّتَّكِـِٕیْنَ عَلَیْهَا مُتَقٰبِلِیْنَ ۟

వారు ఈ పీఠాలపై అభిముఖమై ఎదురుబదురుగా అనుకుని కూర్చుని ఉంటారు. వారిలోని ఏ ఒక్కరు ఇతరుల వెనుక వైపు చూడరు. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• دوام تذكر نعم الله وآياته سبحانه موجب لتعظيم الله وحسن طاعته.
అల్లాహ్ అనుగ్రహములను మరియు పరిశుద్ధుడైన ఆయన ఆయతులను అనునిత్యము గుర్తు చేసుకోవటం అల్లాహ్ యొక్క ఘనతను తెలపటమునకు మరియు ఆయన విధేయతను మంచిగా చేయటమునకు అవసరము. info

• انقطاع تكذيب الكفار بمعاينة مشاهد القيامة.
ప్రళయమును కళ్ళ ముందట చూడటం ద్వారా అవిశ్వాసపరుల తిరస్కారము అంతమైపోతుంది. info

• تفاوت درجات أهل الجنة بتفاوت أعمالهم.
స్వర్గవాసుల స్థానాల్లో వ్యత్యాసం వారి కర్మల వ్యత్యాసం పరంగా ఉంటుంది. info