Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

external-link copy
33 : 3

اِنَّ اللّٰهَ اصْطَفٰۤی اٰدَمَ وَنُوْحًا وَّاٰلَ اِبْرٰهِیْمَ وَاٰلَ عِمْرٰنَ عَلَی الْعٰلَمِیْنَ ۟ۙ

అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను ఎంచుకున్నాడు. మరియు దైవదూతలను అతని ముందు సాష్టాంగ పడమని ఆజ్ఞాపించడం ద్వారా అల్లాహ్ ఆదం(అలైహిస్సలాం) ను గౌరవించాడు. భూమిపై నివసించే ప్రజల కొరకు మొట్టమొదటి రసూల్ గా (సందేశహరుడిగా) చేసి అల్లాహ్ నూహ్(అలైహిస్సలాం) ను గౌరవించాడు. ప్రవక్తత్వాన్ని తన సంతానంలో కొనసాగించడం ద్వారా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబాన్ని అల్లాహ్ గౌరవించాడు. ఈసా (జీసెస్) (అలైహిస్సలాం) వలన మర్యం (మేరీ) తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబాన్ని అల్లాహ్ గౌరవించాడు. ఆయన వారి వారి కాలములలోని వ్యక్తులందరినీ ఎంచుకున్నాడు. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• عظم مقام الله وشدة عقوبته تجعل العاقل على حذر من مخالفة أمره تعالى.
అల్లాహ్ యొక్క మహోన్నత స్థానం మరియు ఆయన శిక్షలలోని తీవ్రత, కఠినత్వం ఏ తెలివైన వ్యక్తినైనా సరే, ఆయన ధర్మాజ్ఞలను ఉల్లంఘించకుండా జాగ్రత్త పడేలా చేస్తుంది. info

• برهان المحبة الحقة لله ولرسوله باتباع الشرع أمرًا ونهيًا، وأما دعوى المحبة بلا اتباع فلا تنفع صاحبها.
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై చూపే నిజమైన ప్రేమకు నిదర్శనం ఏమిటంటే ఆయన షరీఅహ్ (పవిత్ర ధర్మశాసనం) లోని ధర్మాజ్ఞలను మరియు నిషేధాజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించడం. విధేయత లేని ప్రేమ వాదన వాదించేవాడికి ప్రయోజనం కలిగించదు. info

• أن الله تعالى يختار من يشاء من عباده ويصطفيهم للنبوة والعبادة بحكمته ورحمته، وقد يخصهم بآيات خارقة للعادة.
తన వివేకం మరియు అనుగ్రహం ద్వారా అల్లాహ్ తన దాసులలో నుండి తనకు తోచిన వారిని ప్రవక్త పదవి కోసం మరియు తన ఆరాధన కోసం మరియు ప్రవక్త మహిమల కోసం ఎంచుకుంటాడు. info