Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu

ఇబ్రాహీమ్

Tujuan Pokok Surah Ini:
إثبات قيام الرسل بالبيان والبلاغ، وتهديد المعرضين عن اتباعهم بالعذاب.
దైవప్రవక్తలు సందేశమును వివరించారని,దాన్ని చేరవేశారని నిరూపణ దానితో పాటు వారిని అనుసరించటం నుండి తిరస్కరించిన వారిని శిక్ష ద్వారా బెదిరించటం. info

external-link copy
1 : 14

الٓرٰ ۫— كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ۙ۬— بِاِذْنِ رَبِّهِمْ اِلٰی صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟ۙ

{అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. ఓ ప్రవక్తా ఈ ఖుర్ఆన్ మీ వైపునకు మేము అవతరింపజేసిన గ్రంధము. మీరు ప్రజలను అవిశ్వాసము,అజ్ఞానము,అపమార్గము నుండి విశ్వాసము,జ్ఞానము,ఎవరు ఆధిక్యతను చూపని ఆధిక్యత కలిగిన,అన్ని విషయాల్లో సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ మార్గమైన ఇస్లాం ధర్మం వైపునకు అల్లాహ్ నిర్ణయంతో,ఆయన సహాయంతో మార్గదర్శకత్వము చేయటానికి. info
التفاسير:

external-link copy
2 : 14

اللّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَوَیْلٌ لِّلْكٰفِرِیْنَ مِنْ عَذَابٍ شَدِیْدِ ۟ۙ

ఆకాశముల్లో ఉన్న సమస్తము యొక్క రాజ్యాధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే మరియు భూమిలో ఉన్న సమస్తము యొక్క రాజ్యాధికారము ఒక్కడైన ఆయన కొరకే. ఆరాధన చేయబడటమునకు ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన సృష్టితాల్లోంచి దేనినీ ఆయన తోపాటు సాటి కల్పించబడదు. మరియు త్వరలోనే అవిశ్వాసపరులు కఠినమైన శిక్షను పొందుతారు. info
التفاسير:

external-link copy
3 : 14

١لَّذِیْنَ یَسْتَحِبُّوْنَ الْحَیٰوةَ الدُّنْیَا عَلَی الْاٰخِرَةِ وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَیَبْغُوْنَهَا عِوَجًا ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟

అవిశ్వాసపరులైన వారు ఇహలోక జీవితం మరియు అందులోని అంతమైపోయే అనుగ్రహాలను పరలోకము,అందులోని శాస్వత అనుగ్రహాలపై ప్రాధాన్యతనిస్తున్నారు. మరియు వారు ప్రజలను అల్లాహ్ మార్గము నుండి మరలుస్తున్నారు. మరియు వారు ఆయన మార్గము కొరకు వక్రతను,సత్యము నుండి పరధ్యానమును,తిన్నగా ఉండటం నుండి వాలిపోవటమును కోరుతున్నారు. చివరికి అందులో ఎవరు నడవరు. ఈ లక్షణాలు కలిగిన వారందరు సత్యము నుండి ,సమగ్రంగా ఉండటం నుండి దూరంగా అప మార్గములో ఉన్నారు. info
التفاسير:

external-link copy
4 : 14

وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا بِلِسَانِ قَوْمِهٖ لِیُبَیِّنَ لَهُمْ ؕ— فَیُضِلُّ اللّٰهُ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

మరియు మేము ఏ ప్రవక్తను పంపించిన ఆయన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చినది అర్ధం చేసుకోవటం వారికి సులభం అవటానికి అతని జాతి వారి భాషను మాట్లాడే వానిగా పంపించాము.మరియు అల్లాహ్ పట్ల విశ్వాసము చూపటానికి వారిని బలవంతం చేయటానికి మేము అతన్ని పంపించలేదు. అయితే అల్లాహ్ తాను కోరుకున్న వారికి తన న్యాయముతో అపమార్గమునకు గురి చేస్తాడు,మరియు తాను కోరుకున్న వారికి తన అనుగ్రహము ద్వారా సన్మార్గము కొరకు సౌభాగ్యమును కలిగిస్తాడు. తనను ఎవరు ఓడించని ఆధిక్యుడు అతడు.తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
5 : 14

وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَاۤ اَنْ اَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ۙ۬— وَذَكِّرْهُمْ بِاَیّٰىمِ اللّٰهِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۟

మరియు నిశ్చయంగా మేము ముసాను సందేశహరునిగా పంపించి ఆయన నిజాయితీని,మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని దృవీకరించే సూచనల ద్వారా ఆయనకు సహకరించాము. మరియు మేము అతన్ని తన జాతివారిని అవిశ్వాసము,అజ్ఞానము నుండి విశ్వాసము,జ్ఞానము వైపునకు తీయమని ఆదేశించాము. మరియు మేము అతన్నిఆల్లాహ్ యొక్క ఆ దినములు వేటిలోనైతే ఆయన వారిపై అనుగ్రహాలు కలిగించాడో వాటి గురించి వారిని గుర్తు చేయమని ఆదేశించాము. నిశ్చయంగా ఈ దినములలో అల్లాహ్ తౌహీదుకు,ఆయన గొప్ప సామర్ధ్యమునకు,విశ్వాసపరులపై ఆయన అనుగ్రహమునకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అల్లాహ్ విధేయతపై సహనమును చూపేవారు,ఆయన ఆశీర్వాదాలపై,ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలపటంలో కట్టుబడి ఉండేవారు దీని ద్వారా ప్రయోజనం చెందుతారు. info
التفاسير:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• أن المقصد من إنزال القرآن هو الهداية بإخراج الناس من ظلمات الباطل إلى نور الحق.
ప్రజలను అసత్యపు చీకట్ల నుండి సత్యపు వెలుగు వైపు తీయటము ద్వారా సన్మార్గము చూపటం ఖుర్ఆన్ అవతరణా ఉద్దేశము. info

• إرسال الرسل يكون بلسان أقوامهم ولغتهم؛ لأنه أبلغ في الفهم عنهم، فيكون أدعى للقبول والامتثال.
ప్రవక్తలను పంపించటం వారి జాతులు మాట్లాడే వారి భాషల ప్రకారం ఉంటుంది.ఎందుకంటే అది వారి అవగాహనలో నివేదించబడింది. అప్పుడు అది స్వీకరించటానికి,కట్టుబడి ఉండటానికి ఎంతో ప్రభావితంగా ఉంటుంది. info

• وظيفة الرسل تتلخص في إرشاد الناس وقيادتهم للخروج من الظلمات إلى النور.
ప్రజలను సన్మార్గం చూపటం,వారిని చీకట్ల నుండి వెలుగులోకి తీసి నడిపించటం ప్రవక్తల బాధ్యత. info