क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद

అన్-నబఅ

external-link copy
1 : 78

عَمَّ یَتَسَآءَلُوْنَ ۟ۚ

ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?[1] info

[1] దైవప్రవక్త ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ ను మరియు అతనిని ప్రవక్తగా అల్లాహ్ (సు.తా.) ఎన్నుకున్న విషయాన్ని నమ్మలేక సత్యతిరస్కారులు ఒకరితో నొకరు ఈ విధంగా ప్రశ్నించుకున్నారు: "ఏమీ? పునరుత్థానం నిజమేనా? ఇతడు వాస్తవంగానే ప్రవక్తనా?" మొదలైనవి. దానిని అల్లాహ్ (సు.తా.) స్వయంగా జవాబిచ్చాడు.

التفاسير:

external-link copy
2 : 78

عَنِ النَّبَاِ الْعَظِیْمِ ۟ۙ

ఆ మహా వార్తను గురించేనా? info
التفاسير:

external-link copy
3 : 78

الَّذِیْ هُمْ فِیْهِ مُخْتَلِفُوْنَ ۟ؕ

దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో? info
التفاسير:

external-link copy
4 : 78

كَلَّا سَیَعْلَمُوْنَ ۟ۙ

అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు. info
التفاسير:

external-link copy
5 : 78

ثُمَّ كَلَّا سَیَعْلَمُوْنَ ۟

ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు. info
التفاسير:

external-link copy
6 : 78

اَلَمْ نَجْعَلِ الْاَرْضَ مِهٰدًا ۟ۙ

ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా? info
التفاسير:

external-link copy
7 : 78

وَّالْجِبَالَ اَوْتَادًا ۟ۙ

మరియు పర్వతాలను మేకులుగా?[1] info

[1] చూడండి, 16:15.

التفاسير:

external-link copy
8 : 78

وَّخَلَقْنٰكُمْ اَزْوَاجًا ۟ۙ

మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.[1] info

[1] మానవులలో, జంతువులలో మరియు ఇతర ప్రాణంలేని వస్తువులలో కూడా జంటలున్నాయి. ఉదా: రాత్రిం-బవళ్ళు, సూర్య-చంద్రులు, ఆకాశం-భూమి, నలుపు-తెలుపు మొదలైనవి. ఇంకా చూడండి, 36:36.

التفاسير:

external-link copy
9 : 78

وَّجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۟ۙ

మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము. info
التفاسير:

external-link copy
10 : 78

وَّجَعَلْنَا الَّیْلَ لِبَاسًا ۟ۙ

మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము. info
التفاسير:

external-link copy
11 : 78

وَّجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ۟ۚ

మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము. info
التفاسير:

external-link copy
12 : 78

وَبَنَیْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ۟ۙ

మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము. info
التفاسير:

external-link copy
13 : 78

وَّجَعَلْنَا سِرَاجًا وَّهَّاجًا ۟ۙ

మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము. info
التفاسير:

external-link copy
14 : 78

وَّاَنْزَلْنَا مِنَ الْمُعْصِرٰتِ مَآءً ثَجَّاجًا ۟ۙ

మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.[1] info

[1] ము'అ'సిరాత్: నీటితో నిండి ఉండి ఇంకా కురవని మేఘాలు.

التفاسير:

external-link copy
15 : 78

لِّنُخْرِجَ بِهٖ حَبًّا وَّنَبَاتًا ۟ۙ

దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి! info
التفاسير:

external-link copy
16 : 78

وَّجَنّٰتٍ اَلْفَافًا ۟ؕ

మరియు దట్టమైన తోటలను. info
التفاسير:

external-link copy
17 : 78

اِنَّ یَوْمَ الْفَصْلِ كَانَ مِیْقَاتًا ۟ۙ

నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.[1] info

[1] చూడండి, 77:13.

التفاسير:

external-link copy
18 : 78

یَّوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ فَتَاْتُوْنَ اَفْوَاجًا ۟ۙ

ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు. info
التفاسير:

external-link copy
19 : 78

وَّفُتِحَتِ السَّمَآءُ فَكَانَتْ اَبْوَابًا ۟ۙ

మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి; info
التفاسير:

external-link copy
20 : 78

وَّسُیِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ۟ؕ

మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.[1] info

[1] చూడండి, 69:14, 14:48, 101:5, 70:9, 56:6, 20:105, మొదలైనవి.

التفاسير:

external-link copy
21 : 78

اِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ۟ۙ

నిశ్చయంగా, నరకం ఒక మాటు; info
التفاسير:

external-link copy
22 : 78

لِّلطَّاغِیْنَ مَاٰبًا ۟ۙ

ధిక్కారుల గమ్యస్థానం; info
التفاسير:

external-link copy
23 : 78

لّٰبِثِیْنَ فِیْهَاۤ اَحْقَابًا ۟ۚ

అందులో వారు యుగాల తరబడి ఉంటారు.[1] info

[1] చూడండి 6:128 మరియు 11:107.

التفاسير:

external-link copy
24 : 78

لَا یَذُوْقُوْنَ فِیْهَا بَرْدًا وَّلَا شَرَابًا ۟ۙ

అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు. info
التفاسير:

external-link copy
25 : 78

اِلَّا حَمِیْمًا وَّغَسَّاقًا ۟ۙ

సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం)[1] info

[1] చూడండి, 38:57-58.

التفاسير:

external-link copy
26 : 78

جَزَآءً وِّفَاقًا ۟ؕ

(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా! info
التفاسير:

external-link copy
27 : 78

اِنَّهُمْ كَانُوْا لَا یَرْجُوْنَ حِسَابًا ۟ۙ

వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు. info
التفاسير:

external-link copy
28 : 78

وَّكَذَّبُوْا بِاٰیٰتِنَا كِذَّابًا ۟ؕ

పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు. info
التفاسير:

external-link copy
29 : 78

وَكُلَّ شَیْءٍ اَحْصَیْنٰهُ كِتٰبًا ۟ۙ

మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.[1] info

[1] చూడండి, 36:12.

التفاسير:

external-link copy
30 : 78

فَذُوْقُوْا فَلَنْ نَّزِیْدَكُمْ اِلَّا عَذَابًا ۟۠

కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.[1] info

[1] చూడండి, 4:56, 17:97.

التفاسير:

external-link copy
31 : 78

اِنَّ لِلْمُتَّقِیْنَ مَفَازًا ۟ۙ

నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది; info
التفاسير:

external-link copy
32 : 78

حَدَآىِٕقَ وَاَعْنَابًا ۟ۙ

ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ! info
التفاسير:

external-link copy
33 : 78

وَّكَوَاعِبَ اَتْرَابًا ۟ۙ

మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు; info
التفاسير:

external-link copy
34 : 78

وَّكَاْسًا دِهَاقًا ۟ؕ

మరియు నిండి పొర్లే (మధు) పాత్ర info
التفاسير:

external-link copy
35 : 78

لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا وَّلَا كِذّٰبًا ۟ۚۖ

అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు. info
التفاسير:

external-link copy
36 : 78

جَزَآءً مِّنْ رَّبِّكَ عَطَآءً حِسَابًا ۟ۙ

(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం. info
التفاسير:

external-link copy
37 : 78

رَّبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الرَّحْمٰنِ لَا یَمْلِكُوْنَ مِنْهُ خِطَابًا ۟ۚ

భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు. info
التفاسير:

external-link copy
38 : 78

یَوْمَ یَقُوْمُ الرُّوْحُ وَالْمَلٰٓىِٕكَةُ صَفًّا ۙۗؕ— لَّا یَتَكَلَّمُوْنَ اِلَّا مَنْ اَذِنَ لَهُ الرَّحْمٰنُ وَقَالَ صَوَابًا ۟

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్)[1] మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.[2] info

[1] చూడండి 16:2 మరియు 97:4
[2] అల్లాహ్ (సు.తా.) దైవదూతలకు మరియు దైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) మాట్లాడే అనుమతినిస్తాడు. వారు కేవలం సత్యమే పలుకుతారు. చూడండి, 10:3.

التفاسير:

external-link copy
39 : 78

ذٰلِكَ الْیَوْمُ الْحَقُّ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ مَاٰبًا ۟

అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! [1] info

[1] చూడండి, 69:1.

التفاسير:

external-link copy
40 : 78

اِنَّاۤ اَنْذَرْنٰكُمْ عَذَابًا قَرِیْبًا ۖۚ۬— یَّوْمَ یَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ یَدٰهُ وَیَقُوْلُ الْكٰفِرُ یٰلَیْتَنِیْ كُنْتُ تُرٰبًا ۟۠

నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు.[1] మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది[2]!" అని వాపోతాడు. info

[1] చూడండి 18:49 చూడండి 75:13
[2] చూడండి, 69:27.

التفاسير: