[1] నఫరున్: అంటే 3 నుండి 10 వరకు ఉండే సంఖ్యల సమూహం. నఖ్ లా లోయలో దైవప్రవక్త ('స'అస) తమ అనుచరు(ర.'ది.'అన్హుమ్)లతో సహా ఫజ్ర్ నమా'జ్ చేస్తుండగా అక్కడి నుండి కొందరు జిన్నాతులు పోతూ వారి ఖుర్ఆన్ విని ప్రభావితులయి విశ్వసిస్తారు. ఈ విషయం 46:29 లో వచ్చింది. జిన్నాతులు ఖుర్ఆన్ విన్నది దైవప్రవక్త ('స'అస) కు తెలియదు. అది వ'హీ ద్వారా తెలుపబడిందని ఇక్కడ పేర్కొనబడింది.
[1] ఖుర్ఆన్ ను వినగానే జిన్నాతులు విశ్వసించారు. కాని మానవులు మాత్రం దానిని మళ్ళీ మళ్ళీ విని కూడా విశ్వసించడం లేదు.
[1] చివరి వాక్యానికి కొందరు వ్యాఖ్యాతలు ఈ విధంగా తాత్పర్యం చెప్పారు : "కాని వారు, వారి (మానవుల) పాపాన్ని అవిశ్వాసాన్ని మరింత అధికం చేశారు." ఇస్లాంకు ముందు 'అరబ్బులు తమ ప్రయాణాలలో ఎక్కడైనా ఆగితే, అక్కడి జిన్నాతులతో శరణు కోరేవారు. ఇస్లాం దీనిని నిషేధించింది మరియు కేవలం ఒకే ఒక్క ప్రభువు, అల్లాహ్ (సు.తా.) తో శరణు కోరటాన్ని మాత్రమే విధిగా చేసింది. చూడండి, 15:23.
[1] చూడండి, 15:17-18. ఆకాశాలలో దైవదూతలు ('అలైహిమ్.స.), ఇతరులు అక్కడి మాటలు వినకుండా కాపలాకాస్తూ ఉంటారు మరియు ఈ అగ్నికణాలు (షుహుబున్) ఆకాశాలలోని మాటలు వినటానికి పైకి పోయే జిన్నాతులపై పడతాయి. షుహుబున్ - షిహాబున్ బ.వ.
[1] మరియు ఆకాశాల మాటలు విని జ్యోతిష్కులకు చెప్పేవారము. వాటిలో వారు తమ వైపునుండి నూరు అబద్ధాలు కలిపి చెప్పేవారు.
[2] కాని దైవప్రవక్త ('స'అస) వచ్చిన తరువాత నుండి ఈ పని ఆపబడింది. ఇప్పుడు ఎవడైనా పైకి పోవటానికి ప్రయత్నిస్తే అగ్నికణం అతనిపై పడుతుంది.
[1] జిన్నాతులలో కూడా వేర్వేరు జాతుల వారు, యూదులు, క్రైస్తవులు, ముస్లింలు మరియు సత్యతిరస్కారులు మొదలైనవారు ఉన్నారు.
[1] ఖాసి'తూన్: ఈ పదానికి - సందర్భాన్ని బట్టి న్యాయవర్తనులు, అన్యాయపరులు అనే రెండు అర్థాలు వస్తాయి. ఈ సందర్భంలో అన్యాయపరులు, లేక సన్మార్గం నుండి లేక సత్యం నుండి విముఖులైనవారు అనే అర్థంలో వాడబడింది.
[1] దీని మరొక తాత్పర్యంలో : "(మానవులు మరియు జిన్నాతులు) అల్లాహ్ (సు.తా.) దాసుడు (ము'హమ్మద్ 'స'అస, అల్లాహుతా'ఆలాను) ప్రార్థించటానికి నిలబడినపుడు అతని చుట్టు దట్టంగా గుమిగూడి (అల్లాహ్ జ్యోతిని తమ నోట్లతో ఊది ఆర్పివేయగోరతారు)." అని ఉంది. ఈ తాత్పర్యం ఇబ్నె-'అబ్బాస్, ముజాహిద్, సయ్యద్ బిన్-'జుబైర్ మరియు ఇబ్నె-'జైద్ (ర'ది.'అన్హుమ్)లు ఇచ్చారు. ఇబ్నె-జరీర్ (ర'హ్మా) దీనికి ప్రాధాన్యత నిచ్చారు. ఇది ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మా) లో పేర్కొనబడింది.