[1] యూదుల ప్రవక్తలందరూ అల్లాహ్ (సు.తా.)కు విధేయులైన వారే అంటే ముస్లింలే. ఆ ఇస్లాం వైపునకే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పిలుస్తున్నారు. ఈ ఇస్లాం ధర్మమే ఆదమ్ ('అ.స.) నుండి ప్రతి ప్రవక్త బోధించిన ధర్మం. ఇక హిందూ ధర్మానికి మూలమైన వేదాలు మరియు భగవద్గీత కూడా ఏకైక పరమేశ్వరునికి అంటే అల్లాహుతా'ఆలాకు మాత్రమే విధేయులై ఉండి, కేవలం ఆయననే ఆరాధించాలని బోధిస్తున్నాయి. ఆ పరమేశ్వరుడు, సంతానం లేదనివాడు అని కూడా వివరిస్తున్నాయి. అంతేగాక పామరులే కల్పిత దైవాలను, సృష్టించబడిన వాటిని ఆరాధిస్తారని కూడా బోధిస్తున్నాయి.