[1] మూసా ('అ.స.) పై అవతరింపజేయబడిన తౌరాత్ గ్రంథం తరువాత అల్లాహ్ (సు.తా.) 'ఈసా ('అ.స.) పై ఇంజీల్ ను అవతరింపజేశాడు. అతను తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరిచారు. 'ఈసా ('అ.స.) : "ఇస్రాయీ'ల్ సంతతిలోని దారి తప్పిన గొర్రెల వద్దకే తప్ప ఇతరుల వద్దకు నేను పంపబడలేదు." అని అన్నారు. మత్తయి - (Mathew), 15:24. ఇక ము'హమ్మద్ ('స'అస) వచ్చారు. అతనికపై ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది. ఈ ఖుర్ఆన్ 1400 సంవత్సరాలలో, దానిలోని ఒక్క అక్షరమైనా మార్చబడకుండా, దాని అసలు రూపంలో భద్రపరచబడి ఉన్న ఏకైక, దివ్యగ్రంథం. ఎందుకంటే పునరుత్థానదినం వరకు నేను ఈ ఖుర్ఆన్ ను దాని అసలు రూపంలో భద్రపరుస్తానని అల్లాహ్ (సు.తా.) వాగ్దానం చేశాడు, చూడండి.15:9. ఇది ర'హ్మతుల్లిల్ 'ఆలమీన్ - అంటే సర్వలోకాల వారికి కారుణ్యం. ఇది సర్వలోకాల వారి కొరకు అవతరింజేయబడింది. ము'హమ్మద్ ('స'అస) చిట్టచివరి ప్రవక్త. అతనిపై అవతరింపజేయబడిన ఈ దివ్యఖుర్ఆన్ చిట్ట చివరి దివ్యగ్రంథం.
[1] ఎంతవరకైతే ఖుర్ఆన్ అవతరింపజేయబడలేదో, అంతవరకు బైబిల్ శాసనం అమలులో ఉండెను. కాని దైవప్రవక్త ('స'అస) కు దివ్యఖుర్ఆన్ ప్రసాదింపబడిన తరువాత ఇది ఇంతకు ముందు అవతరింపజేయబడిన దివ్య గ్రంథాలను రద్దు చేస్తుంది. ఇది అల్లాహ్ (సు.తా.) శాసనం. మరొక విశేషం ఏమిటంటే అవి వాటి అసలు రూపంలో లేవు. వాటిని అనుసరించే వారు వాటిలో తమ ఇష్టానుసారంగా ఎన్నో సార్లు, ఎన్నో మార్పులు చేశారు. వాటిలో చివరి మార్పు గలది 1977 క్రీస్తు శకపు (Revised) Authorized KJV. అంతేగాక ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో రకాలైన బైబిల్స్ చెలామణిలో ఉన్నాయి. చూడండి, 3:3 వ్యాఖ్యానం 2. కాని ఖుర్ఆన్ మాత్రమే, 1400 సంవత్సరాలలో ఏ విధమైన మార్పులు లేకుండా, దాని అసలు రూపంలో సురక్షితంగా ఉన్న ఏకైక దివ్యగ్రంథం.
[1] ముహైమినన్ 'అలైహి: అంటే అది వాటిలో ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది, వాటిలో చేర్చబడిన అసత్యాన్ని అసత్యమని నిరూపిస్తుంది మరియు స్పష్టపరుస్తుంది. [2] అంటే ముస్లిమేతరులు కూడా తీర్పు కొరకు వస్తే వారి మధ్య దివ్యఖుర్ఆన్ (అల్లాహుతా'ఆలా) ఆదేశానుసారంగా మాత్రమే తీర్పు చేయాలి; కానీ వారి ధర్మాన్ని అనుసరిస్తూ గానీ, లేక వారి కోరికలను అనుసరిస్తూ గానీ, తీర్పు చేయరాదు.
[1] ఇస్లాం: అంటే అల్లాహ్ (సు.తా.)కు విధేయత. జాహిలియ్యహ్ - అంటే అజ్ఞానం. ఈ రెండు పదాలు ఒకదాని కొకటి వ్యతిరేకంగా వాడబడతాయి. ఎందుకంటే సర్వ జ్ఞానాలకు మూలాధారి అల్లాహ్ (సు.తా.) కావున అల్లాహుతా'ఆలాను విశ్వసించని వారు అజ్ఞానులే! (ఫ'త్హ అల్ ఖదీర్). ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 9, 'హదీస్' నం. 21.