क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद

అల్-ము్మిన్

external-link copy
1 : 23

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَ ۟ۙ

వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు; info
التفاسير:

external-link copy
2 : 23

الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَ ۟ۙ

వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో! info
التفاسير:

external-link copy
3 : 23

وَالَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَ ۟ۙ

మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో; info
التفاسير:

external-link copy
4 : 23

وَالَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَ ۟ۙ

మరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో! info
التفاسير:

external-link copy
5 : 23

وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ

మరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో - info
التفاسير:

external-link copy
6 : 23

اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ

తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప![1] అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు. info

[1] ఈ కాలంలో వాస్తవమైన బానిసలు (అంటే యుద్ధంలో పట్టుబడటం వల్ల బానిసలైన వారు) లేరు. ఎందుకంటే ఒక ముస్లింకు మానవులను బానిసలుగా కొనటం, అమ్మటం నిషిద్ధం చేయబడింది. కేవలం ధర్మయుద్ధంలో చేజిక్కిన ఖైదీలే బానిసలు. వారు ఇస్లాం స్వీకరిస్తే వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలి. బానిస స్త్రీతో సంతానమైతే వారు వారసత్వంలో హక్కుదారులు. ఈ విధంగా చూస్తే బానిస స్త్రీకి కూడా భార్య హక్కులే ఉంటాయి. కేవలం మహ్ర్ మాత్రమే చెల్లించబడదు. చూడండి, 4:3, 24, 25, 24:32.

التفاسير:

external-link copy
7 : 23

فَمَنِ ابْتَغٰی وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْعٰدُوْنَ ۟ۚ

కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు. info
التفاسير:

external-link copy
8 : 23

وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ

మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.[1] info

[1] అమానత్: అంటే మనఃపూర్వకంగా, బాధ్యతతో విధేయతతో, డ్యూటీ చేయటం, రహస్య మాటలను, విషయాలను కాపాడటం. చేసిన వాగ్దానాలను పూర్తి చేయటం మొదలైనవి.

التفاسير:

external-link copy
9 : 23

وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ

మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో! info
التفاسير:

external-link copy
10 : 23

اُولٰٓىِٕكَ هُمُ الْوٰرِثُوْنَ ۟ۙ

అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు. info
التفاسير:

external-link copy
11 : 23

الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

వారే ఫిరదౌస్ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు.[1] info

[1] ఫిర్ దౌస్ అనేది స్వర్గాలలో అత్యున్నతమైనది. అక్కడి నుండియే స్వర్గపు నదులు ప్రారంభమవుతాయి. ('స'హీ'హ్ బు'ఖారీ).

التفاسير:

external-link copy
12 : 23

وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍ ۟ۚ

మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.[1] info

[1] మట్టితో, అంటే మానవుని సృష్టి భూమిలో ఉన్న పదార్థాలతోనే చేయబడింది. ఈ విషయం మనకు ఈనాడు సైన్సు ద్వారా తెలిసింది.

التفاسير:

external-link copy
13 : 23

ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۪۟

తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.[1] info

[1] తల్లి గర్భకోశంలో.

التفاسير:

external-link copy
14 : 23

ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا ۗ— ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ— فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَ ۟ؕ

ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు)[1] అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త. info

[1] చూడండి, 7:54.

التفاسير:

external-link copy
15 : 23

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَ ۟ؕ

ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు. info
التفاسير:

external-link copy
16 : 23

ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ ۟

అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు. info
التفاسير:

external-link copy
17 : 23

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآىِٕقَ ۖۗ— وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ ۟

మరియు వాస్తవానికి మేము మీపై ఏడు మార్గాలను (ఆకాశాలను) సృష్టించాము.[1] మరియు మేము సృష్టి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేము. info

[1] చూడండి, 2:29.

التفاسير: