क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद

external-link copy
197 : 2

اَلْحَجُّ اَشْهُرٌ مَّعْلُوْمٰتٌ ۚ— فَمَنْ فَرَضَ فِیْهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَ وَلَا جِدَالَ فِی الْحَجِّ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ یَّعْلَمْهُ اللّٰهُ ؔؕ— وَتَزَوَّدُوْا فَاِنَّ خَیْرَ الزَّادِ التَّقْوٰی ؗ— وَاتَّقُوْنِ یٰۤاُولِی الْاَلْبَابِ ۟

హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ (ఇహ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫస్)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్ కు తెలుసు. (హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుద్ధమంతులారా! కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి. info
التفاسير: