क़ुरआन के अर्थों का अनुवाद - पवित्र क़ुरआन की संक्षिप्त व्याख्या का तेलुगु अनुवाद।

पृष्ठ संख्या:close

external-link copy
11 : 39

قُلْ اِنِّیْۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్ఛయంగా అల్లాహ్ నేను ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఆయన ఒక్కడినే ఆరాధన చేయాలని ఆదేశించాడు. info
التفاسير:

external-link copy
12 : 39

وَاُمِرْتُ لِاَنْ اَكُوْنَ اَوَّلَ الْمُسْلِمِیْنَ ۟

మరియి నేను ఈ సమాజము (ఉమ్మత్) నుండి మొట్టమొదట ఆయనకు విధేయుడినై,కట్టుబడి ఉండే వాడినవ్వాలని ఆయన నాకు ఆదేశించాడు. info
التفاسير:

external-link copy
13 : 39

قُلْ اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయుడినై ఆయనకు విధేయత చూపకుండా ఉంటే గొప్ప దిన శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము. info
التفاسير:

external-link copy
14 : 39

قُلِ اللّٰهَ اَعْبُدُ مُخْلِصًا لَّهٗ دِیْنِیْ ۟ۙۚ

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : నిశ్చయంగా నేను అల్లాహ్ ఒక్కడినే ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయనతో పాటు నేను ఇతరులను ఆరాధించను. info
التفاسير:

external-link copy
15 : 39

فَاعْبُدُوْا مَا شِئْتُمْ مِّنْ دُوْنِهٖ ؕ— قُلْ اِنَّ الْخٰسِرِیْنَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَاَهْلِیْهِمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اَلَا ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِیْنُ ۟

ఓ ముష్రికులారా మీరు ఆయనను వదిలి మీరు కోరుకున్న విగ్రహాలను ఆరాధించుకోండి (బెదిరించటానికి ఈ ఆదేశం). ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా వాస్తవానికి నష్టపోయే వారు ఎవరంటే తమ స్వయానికి,తమ ఇంటి వారికి నష్టం కలిగించుకుని వారు ఒక్కరే స్వర్గములో ప్రవేశించటం వలన లేదా తమతో పాటు వారూ నరకములో ప్రవేశించటం వలన తమ నుండి వారిని విడిపోవటం వలన వారు వారిని కలుసుకోరు. ఎన్నటికి కలవరు. వినండి ఇదే ఎటువంటి సందేహం లేని స్పష్టమైన నష్టము. info
التفاسير:

external-link copy
16 : 39

لَهُمْ مِّنْ فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ؕ— ذٰلِكَ یُخَوِّفُ اللّٰهُ بِهٖ عِبَادَهٗ ؕ— یٰعِبَادِ فَاتَّقُوْنِ ۟

వారి కొరకు వారిపై నుండి పొగ,జ్వాల,వేడి క్రమ్ముకుని ఉంటాయి. మరియు వారి క్రింది నుండి పొగ,జ్వాల,వేడి క్రమ్ముకుని ఉంటాయి. ఈ ప్రస్తావించబడిన శిక్ష ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. ఓ నా దాసులారా మీరు నా ఆదేశాలను పాటిస్తూ మరియు నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నాకు భయపడండి. info
التفاسير:

external-link copy
17 : 39

وَالَّذِیْنَ اجْتَنَبُوا الطَّاغُوْتَ اَنْ یَّعْبُدُوْهَا وَاَنَابُوْۤا اِلَی اللّٰهِ لَهُمُ الْبُشْرٰی ۚ— فَبَشِّرْ عِبَادِ ۟ۙ

మరియు ఎవరైతే విగ్రహాల ఆరాధన చేయటం నుండి మరియు అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే వాటన్నిటి ఆరాధన నుండి దూరంగా ఉండి,పశ్చాత్తాపముతో అల్లాహ్ వైపునకు మరలుతారో వారి కొరకు మరణము సమయమున,సమాధిలో,ప్రళయదినమున స్వర్గము యొక్క శుభవార్త కలదు. ఓ ప్రవక్తా మీరు నా దాసులకు శుభవార్తనివ్వండి. info
التفاسير:

external-link copy
18 : 39

الَّذِیْنَ یَسْتَمِعُوْنَ الْقَوْلَ فَیَتَّبِعُوْنَ اَحْسَنَهٗ ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ هَدٰىهُمُ اللّٰهُ وَاُولٰٓىِٕكَ هُمْ اُولُوا الْاَلْبَابِ ۟

ఎవరైతే మాటను విని దాని నుండి మంచిని,చెడును వ్యత్యాసపరచి మంచిమాటను దానిలో ఉన్న ప్రయోజనం వలన అనుసరిస్తారో ఈ గుణాలతో వర్ణించబడిన వారికే అల్లాహ్ సన్మార్గము కొరకు భాగ్యమును కలిగించాడు. మరియు వారందరు సరైన బుద్ధులు కలవారు. info
التفاسير:

external-link copy
19 : 39

اَفَمَنْ حَقَّ عَلَیْهِ كَلِمَةُ الْعَذَابِ ؕ— اَفَاَنْتَ تُنْقِذُ مَنْ فِی النَّارِ ۟ۚ

ఎవరిపైనైతే తాను తన అవిశ్వాసమును కనబరచటంలో,అపమార్గంలో కొనసాగిపోవటం వలన శిక్ష యొక్క వాక్కు అనివార్యమైపోయినదో ఓ ప్రవక్తా అతనికి సన్మార్గం చూపటంలో, అతడిని అనుగ్రహించటంలో మీకు ఎటువంటి వ్యూహం లేదు. ఓ ప్రవక్తా ఏమిటీ మీరు ఈ లక్షణాలు కలిగిన వాడిని నరకాగ్ని నుండి రక్షించగలరా ?!. info
التفاسير:

external-link copy
20 : 39

لٰكِنِ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّنْ فَوْقِهَا غُرَفٌ مَّبْنِیَّةٌ ۙ— تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ۬— وَعْدَ اللّٰهِ ؕ— لَا یُخْلِفُ اللّٰهُ الْمِیْعَادَ ۟

కానీ ఎవరైతే తమ ప్రభువు నుండి ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ భయపడుతారో అటువంటి వారి కొరకు ఎత్తైన భవనములు కలవు. అవి ఒక దానిపై ఒకటి ఉంటాయి. వాటి క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అల్లాహ్ వారికి వాటి గురించి గట్టి వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వాగ్దానమును భంగపరచడు. info
التفاسير:

external-link copy
21 : 39

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَلَكَهٗ یَنَابِیْعَ فِی الْاَرْضِ ثُمَّ یُخْرِجُ بِهٖ زَرْعًا مُّخْتَلِفًا اَلْوَانُهٗ ثُمَّ یَهِیْجُ فَتَرٰىهُ مُصْفَرًّا ثُمَّ یَجْعَلُهٗ حُطَامًا ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟۠

నిశ్చయంగా మీరు వీక్షించటం వలన అల్లాహ్ ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడని తెలుసుకున్నారు. అప్పుడు ఆయన దాన్ని సెలయేరులలో,ప్రవాహములలో ప్రవేశింపజేశాడు. ఆ తరువాత ఆ నీటితో రకరకాల రంగులుకల పంటలను వేలికి తీస్తాడు. ఆ తరువాత పంటలు ఎండిపోతాయి. ఓ వీక్షకుడా నీవు దాన్ని పచ్చగా ఉండిన తరువాత పసుపు రంగులో చూస్తావు. ఆ పిదప అది ఎండిన తరువాత ఆయన దాన్ని చూర్ణంగా,విచ్చిన్నంగా చేస్తాడు. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన దానిలో జీవించి ఉన్న హృదయములు కలవారి కొరకు హితోపదేశం కలదు. info
التفاسير:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• إخلاص العبادة لله شرط في قبولها.
ఆరాధనను అల్లాహ్ కొరకు ప్రత్యేకించటం అది స్వీకరించబడటానికి ఒక షరతు. info

• المعاصي من أسباب عذاب الله وغضبه.
పాపకార్యములు అల్లాహ్ శిక్షను మరియు ఆయన ఆగ్రహమును అనివార్యం చేస్తాయి. info

• هداية التوفيق إلى الإيمان بيد الله، وليست بيد الرسول صلى الله عليه وسلم.
సన్మార్గపు సౌభాగ్యమును కలిగించటం అల్లాహ్ చేతిలో ఉన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో లేదు. info