[1] దైవప్రవక్త జిబ్రీల్ ('అ.స.) దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) 'హిరా గుహలో దైవారాధనలో నిమగ్రమై ఉన్నప్పుడు వచ్చి అన్నారు: "చదువు!" అతను అన్నారు : "నాకు చదువురాదు!" అప్పుడు జిబ్రీల్ ('అ.స.) అతనిని గట్టిగా పట్టుకుని గట్టిగా అదిమి అన్నారు: "చదువు!"దైవప్రవక్త ('స'అస) తిరిగి అదే జవాబిచ్చారు. ఈ విధంగా అతను దైవప్రవక్త ('స'అస) ను మూడుసార్లు అదిమారు. వివరాలకు చూడండి, బద'అల్-వ'హీ, 'స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ', నసాయి'. ఆ తరువాత ఈ మొదటి ఐదు ఆయతులు చదివి వినిపించారు.
[1] ఖలమున్: కలం, అంటే చెక్కటం. మొదట కలమును చెక్కి తయారు చేసేవారు. మానవుని జ్ఞానంలో ఉంది - అతని వెంట వెళ్ళి పోతుంది. నోటితో పలికింది కూడా - దాచి పెట్టటానికి పనికి రాదు. కాని కలంతో వ్రాసి పెట్టింది చెడిపోకుండా భద్రంగా ఉంచితే చాలాకాలం వరకు ఉంటుంది. కలం వల్లనే ప్రాచీన జ్ఞానం భద్రపరచబడింది. కావున అల్లాహ్ (సు.తా.) మొట్టమొదట కలాన్ని సృష్టించి, దానితో పునరుత్థానదినం వరకు సర్వసృష్టి యొక్క విధిని వ్రాయించాడు.