કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

પેજ નંબર:close

external-link copy
90 : 23

بَلْ اَتَیْنٰهُمْ بِالْحَقِّ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

విషయం వారు వాదిస్తున్నట్లు కాదు. కాని మేము వారి వద్దకు ఎటువంటి సందేహం లేని సత్యాన్ని తీసుకుని వచ్చాము. అల్లాహ్ కొరకు భాగస్వామి,సంతానము ఉన్నదని వారు వాదిస్తున్న విషయంలో వారు అబద్దము పలుకుతున్నారు. వారి మాటల నుండి అల్లాహ్ ఎంతో మహోన్నతుడు. info
التفاسير:

external-link copy
91 : 23

مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّمَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلٰی بَعْضٍ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یَصِفُوْنَ ۟ۙ

అవిశ్వాసపరులు అనుకుంటున్నట్లు అల్లాహ్ సంతానమును చేసుకోలేదు. మరియు ఆయనతో పాటు ఎటువంటి వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఒక వేళ ఆయనతో పాటు ఎవరైన వాస్తవ ఆరాధ్య దైవం ఉన్నాడే అనుకోండి ప్రతీ ఆరాధ్య దైవం తాను సృష్టించిన సృష్టితాల్లోంచి తన భాగమును తీసుకుని పోతాడు. వారిలోంచి కొందరు కొందరిపై ఆధిక్యతను చూపుతారు. అప్పుడు విశ్వ వ్యవస్త నాశనమవుతుంది. నిజానికి ఇవేమీ జరగలేదు. అయితే ఆయన సత్య ఆరాధ్య దైవం ఒక్కడే అని ఆయన ఏకైక అల్లాహ్ అని సూచించాడు. ఆయనకు తగని సంతానము,భాగస్వామి దేని గురించి అయితే ముష్రికులు వర్ణిస్తున్నారో వాటి నుండి ఆయన పరిశుద్ధుడు,పవిత్రుడు. info
التفاسير:

external-link copy
92 : 23

عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟۠

ఆయన తన సృష్టితాల నుండి గోచరంగా ఉన్న ప్రతీది తెలిసిన వాడు, ఏవైతే ఆయన చూసి ఇంద్రియాలతో గ్రహిస్తాడో వాటిని తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. పరిశుద్ధుడైన ఆయన తనకు భాగస్వామి ఉండటం నుండి మహోన్నతుడు. info
التفاسير:

external-link copy
93 : 23

قُلْ رَّبِّ اِمَّا تُرِیَنِّیْ مَا یُوْعَدُوْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు ఇలా ప్రార్ధించండి : ఓ ప్రభువా నీవు ఈ ముష్రికులందరితో వాగ్దానం చేసిన శిక్షను ఒక వేళ నాకు చూపించదలచుకుంటే; info
التفاسير:

external-link copy
94 : 23

رَبِّ فَلَا تَجْعَلْنِیْ فِی الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟

ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారిని నేను చూస్తున్నప్పుడే శిక్షిస్తే అప్పుడు నీవు నన్ను వారికి కలిగిన శిక్ష కలగటానికి వారిలో చేయకు. info
التفاسير:

external-link copy
95 : 23

وَاِنَّا عَلٰۤی اَنْ نُّرِیَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ ۟

మరియు నిశ్చయంగా మేము వారికి వాగ్దానం చేసిన శిక్షను మీరు చూసేటట్లుగా మిమ్మల్ని చేసే సామర్ధ్యం కలవారము. దాని నుండి,ఇతర వాటి నుండి మేము అశక్తులము కాము. info
التفاسير:

external-link copy
96 : 23

اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ ؕ— نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు మీతో చెడు చేసిన వారికి మంచితనముతో,అతనిని మన్నించి,అతని వలన కలిగిన బాధపై సహనం వహించి తొలగించండి. వారు కల్పిస్తున్న భాగస్వామ్యము,అసత్యము గురించి,నీకు తగనివి మంత్రజాలకుడు,పిచ్చివాడు అన్న గుణాలను నీకు వారు అపాదిస్తున్న వాటి గురించి మాకు బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
97 : 23

وَقُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّیٰطِیْنِ ۟ۙ

మరియు మీరు ఇలా ప్రార్ధించండి : ఓ నా ప్రభువా నేను షైతానుల దుష్ప్రేరణల నుండి,వారి కలతల నుండి నీ రక్షణను కోరుతున్నాను. info
التفاسير:

external-link copy
98 : 23

وَاَعُوْذُ بِكَ رَبِّ اَنْ یَّحْضُرُوْنِ ۟

ఓ నా ప్రభువా వారు నా వ్యవహారములలో నుండి ఏదైన దానిలో నా వద్దకు రావటం నుండి నేను నీ శరణమును కోరుతున్నాను. info
التفاسير:

external-link copy
99 : 23

حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِ ۟ۙ

చివరికి ఈ ముష్రికులందరిలోంచి ఎవరి వద్దకైన మరణం వచ్చి అతను తనపై వచ్చిన దాన్ని కళ్ళారా చూసినప్పుడు తన వయస్సులో నుండి తాను కోల్పోయిన దానిపై,అల్లాహ్ విషయంలో తాను చేసిన తప్పిదంపై పశ్ఛాత్తాప్పడుతూ ఇలా వేడుకుంటాడు : ఓ నా ప్రభువా నీవు నన్ను ఇహలోక జీవితంవైపు మరలించు. info
التفاسير:

external-link copy
100 : 23

لَعَلِّیْۤ اَعْمَلُ صَالِحًا فِیْمَا تَرَكْتُ كَلَّا ؕ— اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآىِٕلُهَا ؕ— وَمِنْ وَّرَآىِٕهِمْ بَرْزَخٌ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟

నేను దాని వైపునకు మరలినప్పుడు నేను సత్కార్యములు చేయటానికి. ఖచ్చితం అలా జరగదు. విషయం నీవు కోరినట్లుగా లేదు. ఇది కేవలం అతను చెప్పిన మాట మాత్రమే. ఒక వేళ అతను ఇహలోక జీవితం వైపునకు మరలించబడితే అతను తాను చేసిన వాగ్దానమును నెరవేర్చడు. చనిపోయిన వీరందరు ఇహలోకము, మరణాంతరం లేపబడి మరలించబడే పరలోకమున మధ్య ఒక అడ్డు తెరలో (బర్జఖ్ లో) ఉండిపోతారు. వారు తాము కోల్పోయిన దాన్ని పొందటానికి, తాము పాడు చేసుకున్న దాన్ని సరి చేసుకోవటానికి దాని నుండి ఇహలోకము వైపునకు మరలించబడరు. info
التفاسير:

external-link copy
101 : 23

فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَیْنَهُمْ یَوْمَىِٕذٍ وَّلَا یَتَسَآءَلُوْنَ ۟

బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత ప్రళయం గురించి ప్రకటన ఇచ్చే రెండవ బాకాను కొమ్ములో (సూర్ లో) ఊదినప్పుడు వారు పరలోక భయాందోళనల్లో మునిగి ఉండటం వలన వారు తమ మధ్య గొప్పగా చెప్పుకునే వంశావళి ఉండదు. వారు తమ ముఖ్యమైన పనిలో మునిగి ఉండటం వలన వారు ఒకరినొకరు అడగరు. info
التفاسير:

external-link copy
102 : 23

فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

అయితే ఎవరి సత్కర్మలు అయితే అతని దుష్కర్మలపై అధికమై అతని త్రాసు పళ్ళాలు బరువవుతాయో వారందరు తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటితో విముక్తి పొంది సాఫల్యం పొందుతారు. info
التفاسير:

external-link copy
103 : 23

وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ

మరియు ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న అధికమై అతని త్రాసు పళ్ళములు తేలికైపోతాయో వారందరు తమకు నష్టము చేసే కార్యాలను చేసి,తమకు లాభం కలిగించే కార్యాలైన విశ్వాసం, సత్కార్యం చేయటమును వదిలివేసి తమ స్వయమును వృధా చేసుకుంటారు. వారు నరకాగ్నిలో శాస్వతంగా ఉంటారు. దానిలో నుండి వారు బయటపడరు. info
التفاسير:

external-link copy
104 : 23

تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَهُمْ فِیْهَا كٰلِحُوْنَ ۟

నరకాగ్ని వారి ముఖములను మాడ్చివేస్తుంది. వారు అందులో ఎలా ఉంటారంటే విచార తీవ్రత వలన వారి ఎగువ పెదాలు మరియు దిగువ పెదాలు వారి పళ్ళ నుండి కుంచించుకుపోతాయి. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• الاستدلال باستقرار نظام الكون على وحدانية الله.
విశ్వ వ్యవస్థ స్థిరత్వము ద్వారా అల్లాహ్ ఏకత్వముపై ఆధార నిరూపణ. info

• إحاطة علم الله بكل شيء.
ప్రతీ వస్తువును అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది. info

• معاملة المسيء بالإحسان أدب إسلامي رفيع له تأثيره البالغ في الخصم.
దుష్కర్మకు పాల్పడే వాడితో దాతృత్వంతో వ్యవహరించటం ఇస్లాం పధ్ధతి అది ప్రత్యర్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. info

• ضرورة الاستعاذة بالله من وساوس الشيطان وإغراءاته.
షైతాను యొక్క దుష్ప్రేరణల నుండి,అతని ప్రలోభాల నుండి అల్లాహ్ తో శరణు కోరటం ఎంతో అవసరం. info