Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo maanaaji Kur'aana e haala Telugu - Abdurahim ɓii Muhammed

external-link copy
186 : 7

مَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَا هَادِیَ لَهٗ ؕ— وَیَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟

అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు![1] మరియు ఆయన వారిని తమ తలబిరుసుతనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడుతున్నాడు. info

[1] ఇక్కడ మరియు 178వ ఆయత్ లో మరియు ఇంకా ఎన్నోచోట్లలో ఖుర్ఆన్ లో చెప్పబడిన విధంగా ఇది సున్నతుల్లాహ్ అంటే ఎవడైతే తనను తాను సవరించుకో గోరక అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను అసత్యాలని మరియు ఆయన ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించి, మూఢత్వంతో మార్గభ్రష్టత్వంలో పడిపోతాడో, అలాంటి వానిని అల్లాహుతా'ఆలా మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. అలాంటి వానికి మార్గదర్శకత్వం చేయడు. కానీ అల్లాహ్ (సు.తా.) అతనిని బలవంతంగా మార్గభ్రష్టత్వంలో పడవేయడు.

التفاسير: