Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo maanaaji Kur'aana e haala Telugu - Abdurahim ɓii Muhammed

Tonngoode hello ngoo:close

external-link copy
144 : 7

قَالَ یٰمُوْسٰۤی اِنِّی اصْطَفَیْتُكَ عَلَی النَّاسِ بِرِسٰلٰتِیْ وَبِكَلَامِیْ ۖؗ— فَخُذْ مَاۤ اٰتَیْتُكَ وَكُنْ مِّنَ الشّٰكِرِیْنَ ۟

(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు." info
التفاسير:

external-link copy
145 : 7

وَكَتَبْنَا لَهٗ فِی الْاَلْوَاحِ مِنْ كُلِّ شَیْءٍ مَّوْعِظَةً وَّتَفْصِیْلًا لِّكُلِّ شَیْءٍ ۚ— فَخُذْهَا بِقُوَّةٍ وَّاْمُرْ قَوْمَكَ یَاْخُذُوْا بِاَحْسَنِهَا ؕ— سَاُورِیْكُمْ دَارَ الْفٰسِقِیْنَ ۟

మరియు మేము అతని కొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహారానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో (మూసాతో) అన్నాము: "వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ ల) నివాసాన్ని మీకు చూపుతాను."[1] info

[1] ఇది అమాలోకీయుల షామ్ రాజ్యం కావచ్చు. వారు అల్లాహుతా'ఆలాకు అవిధేయులై ఉండిరి. (ఇబ్నె-కసీ'ర్).

التفاسير:

external-link copy
146 : 7

سَاَصْرِفُ عَنْ اٰیٰتِیَ الَّذِیْنَ یَتَكَبَّرُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ ؕ— وَاِنْ یَّرَوْا كُلَّ اٰیَةٍ لَّا یُؤْمِنُوْا بِهَا ۚ— وَاِنْ یَّرَوْا سَبِیْلَ الرُّشْدِ لَا یَتَّخِذُوْهُ سَبِیْلًا ۚ— وَاِنْ یَّرَوْا سَبِیْلَ الْغَیِّ یَتَّخِذُوْهُ سَبِیْلًا ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِیْنَ ۟

ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్ ను) చూసినా దానిని విశ్వసించరు.[1] ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు.[2] ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు.[3] info

[1] చూడండి, 10:96-97. [2] ఈ విషయం ఈ కాలంలో గూడ జరుగుతోంది. ఈ కాలపు చాలా మంది ముస్లింలు కూడా మంచి నుండి దూరమై పోతున్నారు మరియు చెడును అవలంబిస్తున్నారు. [3] చూడండి, 96:67.

التفاسير:

external-link copy
147 : 7

وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَلِقَآءِ الْاٰخِرَةِ حَبِطَتْ اَعْمَالُهُمْ ؕ— هَلْ یُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟۠

మరియు మా సూచనలను (ఆయాత లను) మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా! info
التفاسير:

external-link copy
148 : 7

وَاتَّخَذَ قَوْمُ مُوْسٰی مِنْ بَعْدِهٖ مِنْ حُلِیِّهِمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ ؕ— اَلَمْ یَرَوْا اَنَّهٗ لَا یُكَلِّمُهُمْ وَلَا یَهْدِیْهِمْ سَبِیْلًا ۘ— اِتَّخَذُوْهُ وَكَانُوْا ظٰلِمِیْنَ ۟

మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు.[1] info

[1] మూసా ('అ.స.) 'తూర్ పర్వతంపైకి నలభై రాత్రుల కొరకు వెళ్ళినప్పుడు సామిరి ప్రజల ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేస్తాడు. అందులో నుండి గాలి దూరినప్పుడు ఆవు అరుపు వంటి అరుపు వచ్చేది. దానిని అతడు ఇదే మీ ఆరాధ్య దైవం అని అంటాడు. ప్రజలు మూఢత్వంలో అతనిని అనుసరించి దానిని పూజించ సాగుతారు. ఏ విధంగానైతే ఈ నాడు కూడా, ఈ విధమైన మూఢనమ్మకాలు గలవారి కొరత లేదో! అది వారికి లాభం గానీ, నష్టం గానీ చేయలేదని తెలిసి కూడా, ప్రజలు ఇటువంటి వాటిని ఆరాధించడం, ప్రాచీన కాలం నుండి వస్తున్న తప్పుడు ఆచారమే!

التفاسير:

external-link copy
149 : 7

وَلَمَّا سُقِطَ فِیْۤ اَیْدِیْهِمْ وَرَاَوْا اَنَّهُمْ قَدْ ضَلُّوْا ۙ— قَالُوْا لَىِٕنْ لَّمْ یَرْحَمْنَا رَبُّنَا وَیَغْفِرْ لَنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟

మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు: "మా ప్రభువు మమ్మల్ని కరుణించి, మమ్మల్ని క్షమించక పోతే మేము తప్పక నాశనం అయ్యే వారమే!" info
التفاسير: