[1] స్త్రీ దేవతలు అంటే, ఇక్కడ ముష్రిక్ ఖురైషులు పూజించే స్త్రీ విగ్రహాలు ఉదా: " 'లాత్, 'ఉ'జ్జా, మనాత్ మరియు నాఇ'ల" మొదలైనవి. లేక దైవదూతలు ఎందుకంటే వారు దైవదూతలను అల్లాహ్ (సు.తా.) యొక్క కుమార్తెలగా భావించి, వారి ఆరాధన చేసేవారు. [2] పైన పేర్కొన్న వాటి ఆరాధన కేవలం షై'తాన్ ఆరాధనయే. ఎందుకంటే షై'తానే మానవుణ్ణి అల్లాహ్ (సు.తా.) మార్గం నుండి మళ్ళించి బూటక దైవాలను ఆరాధించటాన్ని ప్రోత్సహిస్తాడు.