మరియు వారి దగ్గర పూర్వం నుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ముహమ్మద్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా, అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసి వేశారు.[1]
[1] యూదుల దివ్యగ్రంథం ('తౌరాత్)లో: "అరేబీయాలో ఒక ప్రవక్త వస్తాడు, మీరు అతనిని అనుసరించాలి." అని, ప్రస్తావన ఉన్నా, వారు లెక్క చేయకుండా దానిని ('తౌరాత్ ను) తమ వీపుల వెనుకకు త్రోసి వేశారు. చూడండి, 2:42, 76.