Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo maanaaji Kur'aana e haala Telugu - Abdurahim ɓii Muhammed

అల్-ఇస్రా

external-link copy
1 : 17

سُبْحٰنَ الَّذِیْۤ اَسْرٰی بِعَبْدِهٖ لَیْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ اِلَی الْمَسْجِدِ الْاَقْصَا الَّذِیْ بٰرَكْنَا حَوْلَهٗ لِنُرِیَهٗ مِنْ اٰیٰتِنَا ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟

తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము.[1] నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. info

[1] 'ఈ ప్రయాణాన్ని మేము మా దాసునికి కొన్ని అద్భుత నిదర్శనాలు, సంకేతాలను చూపటానికి చేయించాము.' ఇంత దూరప్రయాణం రాత్రిపూట స్వల్పకాలంలో పూర్తి చేయించడం కూడా ఒక అద్భుత సూచనయే. ఈ ప్రయాణం రెండు భాగాలలో ఉంది. (1) మొదటి భాగం : ఇస్రా' జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన బుర్రాఖ్ పై ఎక్కి అతనితో బాటు, మక్కా ముకర్రమా నుండి బైతుల్-మఖ్దిస్ కు రాత్రిపూట పయనించడం, అక్కడ మహాప్రవక్త ('స'అస) సర్వదైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) ఇమాముగా నిలిచి నమా'జ్ చేయించడం. (2) రెండో భాగం మే'రాజ్ : అంటే పైకి ఎక్కించబడటం, లేక పైకి తీసుకొని పోబడటం. బైతుల్-మఖ్దిస్ నుండి ఆకాశాలలోనికి, చివరకు సిద్రతుల్ ముంతహా వరకు పోయిన ప్రయామం. అది 'అర్ష్ క్రింది ఏడవ ఆకాశంపై ఉంది. అక్కడ అతనికి ('స'అస) అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా నమా'జ్ మరియు ఇతర ఆదేశాలు ఇచ్చాడు. ఆ విషయాలు 'స'హీ'హ్ 'హదీస్ లలో పేర్కొనబడ్డాయి. మే'రాజ్ గురించి కొంతవరకు సూరహ్ అన్-నజ్మ్ (53) లో కూడ ఉంది. మే'రాజ్ సమయంలో దైవప్రవక్త ('స'అస), ఆకాశాలలో ఇతర ప్రవక్తలతో కలుసుకున్నారు. ఈ ప్రయాణం దైవప్రవక్త పూర్తి చేసింది కలలో కాదు. అతను శారీరకంగా మేల్కొని ఉండి, పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో (Bodily, Fully awake and with Full Consciousness and orientation of Mind) చేశారు. ఈ ప్రయాణం అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను కోరినది చేస్తాడు. ఇది జరిగిన కాలం మరియు తేదీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు రబీ'అ అల్ అవ్వల్ 17 లేక 27వ తేదీలలో అని, మరి కొందరు రజబ్ 27 అని, మరి కొందరు ఇతర నెలలని కూడా అంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

التفاسير: